S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిగ్ బాష్ లీగ్‌తో మంధానా కాంట్రాక్టు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్ఠాత్మక బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) మహిళల టోర్నీలో భారత బ్యాట్స్‌విమన్ స్మృతి మంధాన పాల్గొననుంది. బిబిఎల్‌లో పోటీపడే బ్రిస్బేన్ హీట్స్‌తో ఆమె ఏడాది పాటు అమల్లో ఉండే ఒప్పందం కుదుర్చుకుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నుంచి నో ఆబ్జెక్షన్ సర్ట్ఫికెట్ లభించిందని, దీనితో కాంట్రాక్టు లాంఛనాలు పూర్తయ్యాయని మంధానా మంగళవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పింది. బ్రిస్బేన్ జట్టుతో తాను ఇంతకు ముందు మ్యాచ్ ఆడానని, ఇప్పుడు అదే జట్టులో సభ్యురాలుగా చేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.

సింగూర్‌కు కొనసాగుతున్న వరద తాకిడి

సంగారెడ్డి, సెప్టెంబర్ 27: సరిగ్గా గత యేడాది సెప్టెంబర్ 25వ తేదీన కేవలం రెండు టిఎంసి నీటి నిల్వతో ఉన్న సింగూర్ ప్రాజెక్టు అందుకు భిన్నంగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని నిండుకుండలా తొణకిసలాడుతోంది. వర్షాలు కురియడం నిలిచిపోయి మూడు రోజులు కావస్తున్నా సింగూర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద తాకిడి కొనసాగుతూనే ఉంది. మంగళవారం రాత్రి 8 గంటలకు వస్తున్న వరద ప్రవాహాన్ని పరిశీలిస్తే 78900 క్యూసెక్కులుకాగా ప్రాజెక్టు పరిరక్షణ నిమిత్తం 63 వేల క్యూసెక్కుల నీటిని దిగువన మంజీర బ్యారేజ్, ఘన్‌పూర్ ఆనకట్ట, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వదిలిపెడుతున్నారు.

విండీస్ జట్టులో స్పిన్నర్ వారికాన్

దుబాయ్, సెప్టెంబర్ 27: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్తాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడే విండీస్ జట్టుకు స్పిన్నర్ జోమెల్ వారికాన్ ఎంపికయ్యాడు. గత నెల భారత్‌తో జరిగిన మూడు, నాలుగు టెస్టుల్లో ఆడిన 14 మంది సభ్యులతో కూడిన జట్టులో వారికాన్‌కు స్థానం లభించింది. తన ప్రతిభతో సెలక్టర్లను ఆకట్టుకున్న వారికాన్‌కు మరోసారి అవకాశం దక్కింది. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 13 నుంచి మొదలయ్యే మొదటి టెస్టులో విండీస్, పాకిస్తాన్ జట్లు ఢీ కొంటాయి. ఈ రెండు జట్లకూ గులాబీ బంతులతో ఆడే మొట్టమొదటి డే/నైట్ టెస్టు అవుతుంది.

బంగారు బతుకమ్మ సంబరాలు

మెదక్, సెప్టెంబర్ 27: తెలంగాణ జాగృతి ప్రతినిధులు మంగళవారం నాడు బంగారు బతుకమ్మ గోడ పత్రికను విడుదల చేశారు. జిల్లా తెలంగాణ జాగృతి కో కన్వీనర్ గీతారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30 నుండి అక్టోబర్ 8 వరకు మెదక్ నియోజకవర్గంలోని తొమ్మిది గ్రామాల్లో బంగారు బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 90 ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 1100 ప్రాంతాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆటపాటలు నిర్వహించడం జరుగుతాయన్నారు. ఈ నెల 30న ప్రారంభమయ్యే బంగారు బతుకమ్మ పండుగను ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ద్వారా ప్రారంభించడం జరుగుతుందని ఆమె తెలిపారు.

ఈ ఏడాదిలోగా బిఎఫ్‌ఐకి గుర్తింపు

లాసనే్న, సెప్టెంబర్ 27: భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కి ఈ ఏడాదిలోగానే గుర్తింపునిస్తామని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) అధ్యక్షుడు డాక్టర్ చింగ్ కువో వూ స్పష్టం చేశాడు. ఇక్కడ అతను విలేఖరులతో మాట్లాడుతూ బిఎఫ్‌ఐ ఎన్నికలు నిబంధలను అనుసరించి జరిగాయని, ఎక్కడా అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోలేదని తమ తరఫున పరిశీలకుడిగా వెళ్లిన ఎడ్గర్ టన్నర్ తన నివేదికలో పేర్కొన్నట్టు చెప్పాడు. బిఎఫ్‌ఐకి గుర్తింపునివ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. లాంఛనాలు పూర్తి కావాల్సి ఉంటుందని, సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత బిఎఫ్‌ఐ గుర్తింపును అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నాడు.

గల్లంతైన కార్మికుడి మృతదేహం లభ్యం

హత్నూర, సెప్టెంబర్ 27: వరద నీటిలో కొట్టుకుపోయిన కార్మికుని మృతదేహం మంగళవారం లభించిన సంఘటన మండల పరిధిలోని రెడ్డిఖాణాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాల్‌రెడ్డి కథనం ప్రకారం.. నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామానికి చెందిన కుర్తి ఆంజనేయులు గౌడ్ (32) బోర్పట్ల శివారులోని పరిశ్రమలో విధులు నిర్వహించేందుకు ఈ నెల 24న వెళ్తుండగా మధ్య వాగు ప్రవాహ ఉద్ధృతి కి బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. గత మూడు రోజులుగా ఆంజనేయులు కోసం అధికారులు, కుటుంబ సభ్యులు గాలింపులు చేపట్టగా గ్రామ శివారులోని చెక్‌డ్యాం వద్ద మృతదేహం లభించినట్లు తెలిపారు.

తాల్ స్మారక చెస్ ఆనంద్ తొలి గేమ్ డ్రా

మాస్కో, సెప్టెంబర్ 27: తాల్ స్మారక చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న ఆనంద్ ఈ టోర్నీని అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో జరిగిన పోరుతో మొదలుపెట్టాడు. నల్లపావులతో ఆడిన అతను గిరి ఎత్తులకు ప్రతి అడుగులోనూ దీటైన సమాధానమిచ్చాడు. 56 ఎత్తుల తర్వాత గేమ్‌లో ఫలితం అసాధ్యమని స్పష్టం కావడంతో ఇరువురు ఆటగాళ్లు రాజీకి అంగీకరించారు.

తులం బంగారం కోసం వృద్ధురాలి హత్య

సదాశివపేట, సెప్టెంబర్ 27: బీరు బాటిల్ పగులగొట్టి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న 75 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలి ముఖంపై, కణతలపై బలంగా పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్ గిరిజాల వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుమ్మరి మాణెమ్మ (75) ఇల్లు బస్టాండ్ సమీపంలో ఉంది. ఎప్పటి మాదిరిగానే తన రేకుల ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు లోపలకు ప్రవేశించి బీరు బాటిల్‌ను పగులగొట్టి ఆమెపై దాడి చేసి హతమార్చారు. కేవలం ముఖంపైనే పొడవటంతో పాతకక్షలపై పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రతి నగరానికీ ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్

చండీగఢ్, సెప్టెంబర్ 27: దేశంలోని ప్రతి నగరానికీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైనె్మంట్ (డబ్ల్యుడబ్ల్యుఇ) తరహా ఫైట్స్‌ను పరిచయం చేయడమే తన లక్ష్యమని ‘ది గ్రేట్’ ఖలీ అన్నాడు. ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్‌లో ఖలీ పేరుతో సుప్రసిద్ధుడైన దలీప్ సింగ్ రాణా మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో హర్యానా క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైనె్మంట్ (సిడబ్ల్యుఇ) పేరుతో వివిధ ప్రాంతాల్లో రెజ్లింగ్ పోటీలను నిర్వహించనున్నట్టు చెప్పాడు.

ఆరు నెలల క్రితం తల్లి.. ఇప్పుడు తండ్రి ఆత్మహత్య

సదాశివపేట, సెప్టెంబర్ 27: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆరు మాసాల క్రితం జీవితంపై విరక్తి చెందిన గృహిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా తాజాగా తండ్రి కూడా అదే దారిని ఎంచుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారిన సంఘటన సదాశివపేట పట్టణ పరిధిలోని సిద్దాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సున్నపులింగం (42) పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం వద్ద సెక్యూరిటి గార్డుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్య ఆరు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడి అర్ధాంతరంగా తనువు చాలించింది.

Pages