S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనరుడు జాషువా

కులమతాలు గీచుకున్న గీతలుజొచ్చి
పంజరాన కట్టువరను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు విశ్వనరుడ నేను
(జాషువ: నేను)

- రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి 9440222117

జీవన రాగం

చిన్నారుల నవ్వుల్తో
ఇంద్రధనసు వంతెనల్ని
కడుతున్నాను
స్వేచ్ఛాగీతాల్ని సరిహద్దులు దాటించేందుకు
పావుర సైన్యాన్ని పెంచుతున్నాను
వసంతాల సుమగంధాలను శ్వాసిస్తూ
ఎడారిలో మోడుల్ని
పల్లవింపచేస్తున్నాను
గుండె వంతెనలో
జలధారల్ని ఒడిసిపడుతూ
కాల్వల్లోకి తోడేస్తున్నాను
పరవళ్లు తొక్కే నదినై
బీళ్లకు పచ్చదనాన్ని అతికిస్తున్నాను
చందమామ గుండెలపై ఆడుకుంటూ
వెనె్నల జలపాతాల్ని కుమ్మరిస్తున్నాను
శిశిరంతో స్నేహం చేసినా
ఆమనిలా జీవనరాగాన్ని పలికిస్తూనే ఉంటాను

- బొబ్బిలి శ్రీధరరావు, 7660001271

కథా సంహితలు 16

భారతదేశం ఒక సంయుక్త దేశంగా తీసుకుంటే, మనకు మంచి కథకులు వున్నారు. భాషలు ఎక్కువ, ప్రాంతీయతలు ఎక్కువ కనుక మనకు భాషా రచయితల, ప్రాంతీయ రచయితల పరిమాణం ఎక్కువ. ఒక భాష రచయితే ఆ భాష చదివే అన్ని రాష్ట్రాలలోను గణనకు రాడు; గమనానికి రాడు. విభేదాలు, వితరణలలో వున్న వ్యత్యాసాలవల్ల రుూ విపర్యయం జరుగుతుంది. ఒక భాష రచయిత యితర భాషల లోనికి తేలికగా అనువాదం కాడు. మాండలికం అడ్డం వస్తుంది. వస్తుప్రాధాన్యం కూడా గోడ కడుతుంది. జాతీయ స్థాయిలో కథా రచయితలు వున్నంతగా అంతర్జాతీయ స్థాయిలో మనకు అయిదారుగురు తప్ప ప్రసిద్ధమయిన రచయితలు లేరు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584

జ్ఞానానికి నిధి.. సంతాన ప్రదాత.. పళని సుబ్రహ్మణ్యస్వామి

ఆదిదంపతులైన శివపార్వతుల కుమారుడు కుమారస్వామి. ఇతని పుట్టుక గురించి రామాయణంలో విశేషమైన కథ ఉంది. పూర్వం మానవులు, దేవతలు, సిద్దులు, సాధ్యులు కలసి మహాదేవుని ప్రార్థించి తమకు ఆటంకాలు కలిగించేవాడు, హింసించేవాడు అయన తారకా సురుని సంహరించడానికి శివకుమారుడిని ప్రసాదించమని వేడుకున్నారు. ఆ మహాదేవుని ప్రసాదం వలన శివకుమారుడు జన్మించాడు. ఆ శివకుమారుడే కుమారస్వామిగాను, స్కంధుని గాను, శరవణునిగాను, కార్తికేయునిగాను, సుబ్రహ్మణ్యేశ్వరునిగాను ప్రఖ్యాతిగాంచాడు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు

అంతా పూర్ణమే

విశ్వమంతా వ్యాపించినవాడిని ఈశ్వరుడని మనం పిలుస్తాం. ఈ ఈశ్వరుడే పరమేశ్వరునిగా కీర్తిస్తాం. ఈ పరమేశుడు అందరికి దగ్గరగా ఉంటాడు. దూరంగాను ఉంటాడు. అందరిలోను ఉంటాడు. అందరిలో చైతన్యరూపుడై వెలిగేవాడే ఈశ్వరుడు. భక్తికి వశమయ్యే భగవానుడుగా కీర్తినొందినవాడు. అన్నింటికి కర్త ఒక్కడే అన్న జ్ఞానాన్ని కలిగినవాడు మనిషి. నిష్కామభావంతో కర్మలను చేయమంటుంథి ఈశావాస్యోపనిషత్తు. కర్మలే అంటకుండా ఉండే మనిషి వందసంవత్సరాలు బతుకుతాడు. సదా భగవంతుని నామానే్న జపిస్తూ ఉంటాడు. విషయవాసనలేవీ దగ్గరకు రాకుండా విషయాలను భగవంతునికి అర్పించే మనిషే దివ్యుడు. సర్వత్రావ్యాపించి ఉన్న భగవంతుడు నానారూపాల్లో కనిపిస్తున్నాడు.

- శ్రీరామ్

ఆత్మజ్ఞాన ప్రబోధం.. వరప్రసాదం

మానవుడు జనన మరణ పరంపర నుండి విముక్తి పొంద గోరినప్పుడు ధ్యానము పూజ జపము మొదలైన సాధన మార్గములు భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. కాని ఎన్ని సాధనాలు చేసినా గురుకృపను పొందగలిగినప్పుడే ముక్తి లభిస్తుంది. కనుక ధ్యానిస్తే గురుదేవుని స్వరూపమునే ధ్యానించాలి. లౌకిక విద్యలు నేర్పే గురువులు విద్యాగురువులు వీరు పునర్జన్మ రాహిత్యం చేసే ఆత్మవిద్యను ప్రసాదించలేరు. తమను ఆశ్రయించిన వారికి సద్గురు శ్రీశ్రీశ్రీ హనుమత్కాళీ ప్రసాదబాబు కల్పవృక్షము.

- వేదుల సత్యనారాయణ

సర్వం దైవస్వరూపమే

భ గవంతుడు గుణాతీతుడు.నిర్గుణుడు. గుణాల చేత ప్రేరింపబడేవాడు మానవుడు. మానవుడు సత్వగుణం వృద్ధిపొందితే సత్యప్రకాశుడు అవుతాడు. నిస్వార్థంతో నలుగురి కల్యాణం కోసం శ్రమించే తత్వంగుణ సంపన్నుడుగా కీర్తించబడుతాడు. పరమాత్మస్వరూపునిగా సంభావించబడుతాడు. రజోగుణం వృద్ధి చెందించుకున్నవారు కోరికలతో సతమతవౌతారు. కర్మలనాశ్రయిస్తారు. కోరికలను తీర్చుకోవడానికి కాలాన్ని వెచ్చించి భగవంతునికి దూరవౌతుంటాడు. తమోగుణుడు ఇతరులను హింసించి అయినా తనకు కావాల్సిన దాన్ని పొందాలనే తత్త్వాన్ని పెంచుకుని ఉంటాడు. మోహాన్ని పెంచుకుని ఆపదల పాలు అవుతుంటాడు. సత్యధర్మాలకు దూరమై పతనం వైపు అడుగులువేస్తుంటాడు.

- వందిత

ఫితృఋణం తీర్చే అమావాస్య

మహాలయ పక్షం ప్రారంభమయ్యాక 15వ రోజున వచ్చే బాద్రపద బహుళ (లేక కృష్ణ) అమావస్యే మహాలయ అమావాస్య. శుద్ధ పూర్ణిమనుండి వరుసగా పదిహేను రోజులు పితృపక్షం అంటారు. ఈరోజు నుండీ వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలకు పూజ చేయాలని పెద్దల ఉవాచ. పితృ దోషం అంటే ఒక శాపంగా భావిస్తాం. ఏ వ్యక్తికైనా అనారోగ్యమో లేదా మరే తీరని కష్టాలో కలగడం జరిగితే దానికి కారణం అతడి పూర్వీకులు అంటే ఆ వ్యక్తియొక్క తల్లిదండ్రులు లేదా వారి తల్లిదండ్రులో తాతముత్తాతలో తెలిసోతెలీకో చేసిన దోషాలు, తప్పులు కారణం కావచ్చు అంటారు. గత జన్మలో పూర్వీకులు చేసిన దోషాల ఫలితం వారి తర్వాతి తరాలవారు అనుభవించక తప్పకపోవచ్చు.

- హైమా శ్రీనివాస్

కలియుగంలో సప్తఋషులు పేర్లేమి?

* యోగం ద్వారా మనిషి గాలిలోనికి లేవవచ్చునా?
- సందేహాలరావు, సూర్యాపేట
ఈ ప్రక్రియలు యోగశాస్త్రంలో ఉన్నాయని సుప్రసిద్ధమే. ఇటీవల కాలంలో మహర్షి మహేష్ యోగిగారి శిష్యులు గూడా వీటిని ఆచరించి చూపేవారని విన్నాము.
* పంచముఖ ఆంజనేయస్వామి ఉన్నాడా?
- కాట్రగడ్డ వెంకట్రావు, చెన్నై
ఆంజనేయ తత్త్వాన్ని విశేషంగా ఉపదేశించే గ్రంథాలలో పరాశర సంహిత ప్రముఖమైనది. దానిలో ఆంజనేయస్వామి యొక్క రకరకాల మూర్తులు వర్ణింపబడినాయి. వాటిల్లో పంచముఖ ఆంజనేయ రూపం ప్రధానమైనది. లంకలో బందీగా వున్న సీతాదేవికి ఆంజనేయస్వామి తన పంచముఖ స్వరూపాన్ని చూపించాడని గూడా ఈ గ్రంథంలో వున్నది.

కుప్పా వేంకట కృష్ణమూర్తి

ముసురు వేళల్లో ఇవి తింటే మేలు

ముసురువేళల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. చికున్ గున్యా, డెంగీ, వైరల్ జ్వరాలు వెన్నంటే వస్తుంటాయి. ఈ కాలంలో తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఇంట్లోనివారిని కాపాడుకోగలం. ఈ కాలంలో లభించే పండ్లను తీసుకోవటానికి చాలా మంది ఇష్టపడరు. అసలు ముసురు వేళల్లోనే పండ్లు చౌకగా లభ్యమవుతాయి. మార్కెట్లో లభించే తాజాపళ్లను తినటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ప్రతిరోజూ ఇంట్లో వండుకునే ఆహారంలో కొన్నింటిని తప్పనిసరిగా చేర్చటం వల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి బయటపడవచ్చని న్యూట్రీషియన్లు చెబుతున్నారు.

Pages