S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువజనోత్సవాల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ

గుడ్లవల్లేరు, సెప్టెంబర్ 22: జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం గుడివాడ ఎఎన్‌ఆర్ కళాశాలలో నిర్వహించిన యువజనోత్సవాల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. కూచిపూడి నృత్యం, జానపద గీతాలు, ఏకపాత్రాభినయంలో తమదైన ప్రతిభ కనబర్చి జిల్లాలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారని ప్రిన్సిపాల్ రామాంజనేయులు తెలిపారు.

సమరానికి సై

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 22: విఎంసి కౌన్సిల్ సర్వ సాధారణ సమావేశం శుక్రవారం జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ జరిగిన కౌన్సిల్ సమావేశాలతో పోల్చితే నేడు జరగబోయే కౌన్సిల్ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు.

అప్రమత్తంగా ఉండాలి

విజయవాడ, సెప్టెంబర్ 22: భారీ వర్షాలు, సైక్లోన్ ప్రభావం నేపధ్యంలో జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో 45వేల ఇరుగు పొరుగు బృందాలను ఏర్పాటుచేయడం ద్వారా ఆరోగ్యం, వనం-మనం, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలతో దోమలపై దండయాత్రను పూర్తిస్థాయిలో అమలుచేయడం ద్వారా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు.

కెఎంకె పుష్కర టెండర్ వివాదంలో వికెట్ డౌన్

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 22: ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు కెఎంకె పుష్కర టెండర్ వివాదంలో విఎంసి ఉద్యోగి ఒకరు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ వివాదానికి ప్రధాన సాక్షిగా నిలిచిన కెఎంకె ఓచర్ బిల్లు నకలు కాపీ బయటకు ఎలా వచ్చిందన్న విషయంతోపాటు ఒరిజినల్ కాపీ కనిపించడం లేదన్న ఆరోపణలపై అకౌంట్స్ సెక్షన్‌లో పనిచేసే జ్ఞానప్రసాద్ అనే అధికారిని సస్పెండ్ చేస్తూ విఎంసి కమిషనర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ వెనుక గల కారణాలను పక్కన పెడితే అసలు ఈవిషయంలో సస్పెండ్‌కు గురైన అధికారికి ఎంతటి సంబంధం ఉందన్న విషయంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆధార్‌తో నిత్యావసర వస్తువుల పంపిణీ

విజయవాడ (రూరల్), సెప్టెంబర్ 22: దేశ వ్యాప్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో ఆధార్ బేస్‌డ్ నిత్యావసర సరుకుల విధానాన్ని 2017 మార్చి నుండి అమలు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర, పౌర సరఫరాల సహాయ కార్యదర్శులు జిల్లాలో రెండు రోజులు పర్యటించడం కోసం గురువారం నగరానికి చేరుకున్నారు. గురువారం జిల్లాలో గొల్లపూడి, రాయనపాడు, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో బయో మెట్రిక్ ఆధార్ ఆధారిత, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ క్షేత్రస్థాయి వాస్తవ అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.

దోమలపై దండయాత్ర

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబ ర్ 22: రాష్ట్రంలో పెరుగుతున్న జ్వరా లు, అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘దోమలపై దండయాత్ర - పరిసరాల్లో పరిశుభ్రత’ కార్యక్రమాన్ని నగరంలో విజయవంతం చేసేందుకు విస్తృత చర్యలు తీసుకోవాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈసందర్భంగా గురువారం తన ఛాంబర్‌లో వి ఎంసి ఇంజనీరింగ్, ప్రజారోగ్య శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు.

వరద ఉద్ధృతితో కృష్ణమ్మ పరవళ్లు

జగ్గయ్యపేట రూరల్, సెప్టెంబర్ 22: కృష్ణా, నల్లగొండ, గుంటూరు జిల్లాల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, వరద ఉద్ధృతికి మండలంలోని ముక్త్యాల, రావిరాల, వేదాద్రిలో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. గురువారం ఉదయానికే వరద కృష్ణా నదికి చేరుకోగా పులిచింతల ప్రాజెక్టులో సుమారు 30 టిఎంసిల నీరు నిల్వ చేసిన ఇరిగేషన్ అధికారులు 10 గేట్లు ఎత్తి రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదలడంతో గురువారం సాయంత్రానికి కృష్ణా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ముక్త్యాలలో కృష్ణా నది ఒడ్డున గల శివాలయం, జంట నందులు వరద నీటిలో మునిగిపోయాయి. గత నెలలో పుష్కరాల సమయంలో ఈ ప్రదేశంలోనే పుణ్యస్నానాలు చేశారు.

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కామారెడ్డి, సెప్టెంబర్ 22: జిల్లా రైతాంగానికి వరప్రదాయినిగా ఉన్న భారీనీటి పారుదల శాఖ పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయం గత రెండేళ్ల కాలంగా నీరు లేక బోసిపోయి ఉంది. నిన్న మొన్నటి వరకు డెడ్ స్టోరీజీలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి కొత్త నీరు ఇప్పుడిప్పుడే వచ్చిచేరుతోంది. సెప్టెంబర్ 22నుండి ప్రాజెక్ట్‌లోకి నీరు రావడం వల్ల ప్రాజెక్ట్ 12వరదగేట్ల వద్ద కొత్తనీరు కన్పిస్తుంది. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం వెయ్యి ఏడు క్యూసెక్కుల వరద నీరు వస్తుందని నిజాంసాగర్ ప్రాజెక్ట్ డిప్యూటిఇఇ సురేష్‌బాబు తెలిపారు.

మెడికల్ కళాశాలలో ఎంసిఐ బృందం తనిఖీలు

నిజామాబాద్, సెప్టెంబర్ 22: నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని అన్ని విభాగాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం గురువారం సందర్శించి పరిశీలించింది. జిల్లా మెడికల్ కళాశాలకు నాల్గవ సంవత్సరానికి సంబంధించిన అనుమతితో పాటు వచ్చే సంవత్సరం అదనపు మెడికల్ సీట్ల మంజూరీ కోసం స్థానికంగా నెలకొని ఉన్న వసతి, సౌకర్యాలను తెలుసుకునేందుకు ఎంసిఐ బృందం హాజరై అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

బాన్సువాడ, సెప్టెంబర్ 22: బాన్సువాడలోని ప్రభుత్వ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను గురువారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులానికి మంత్రి చేరుకున్న సమయంలో బాలికలు అల్పాహారంగా ఉప్మా భుజిస్తూ కనిపించారు. దీంతో మంత్రి పోచారం కూడా వారితో కలిసి విద్యార్థినుల కోసం వండిన ఉప్మాను ప్లేటులో పెట్టించుకున్నారు. ఈ ఉప్మాను రుచి చూసిన వెంటనే మంత్రి పోచారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమాత్రం రుచి లేకుండా వండిన ఉప్మాను పిల్లలకు ఎలా పెడుతున్నారని నిర్వాహకులపై ఆగ్రహం ప్రదర్శించారు. విద్యార్థులకు కేటాయించిన గదులతో పాటు కిచెన్ రూమ్, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు.

Pages