S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైనికులకు సంఘీభావంగా ఉరీకి బైక్ యాత్ర

గుంటూరు, సెప్టెంబర్ 22: దేశ సరిహద్దుల్లో పాక్ చొరబాటుదార్లను వీరోచిత పోరాటాల ద్వారా ప్రతిఘటిస్తున్న వీర సైనికుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తికావాలని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ నుంచి కొద్దిరోజుల క్రితం కార్గిల్‌కు మోటారుబైక్‌లపై యాత్రచేసి సైనికులను కలుసుకుని వచ్చిన ఏపి ప్రతినిధి బృందాన్ని కన్నా అభినందించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు సముద్రాలు, సకల నదీ జలాలతో కాశ్మీర్‌లోని ఉరీకి వచ్చేనెల ఒకటో తేదీన గుంటూరు నుంచి 20 మందితో కూడిన బృందం బైక్ యాత్ర ప్రారంభిస్తుందని చెప్పారు.

స్విస్‌చాలెంజ్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్‌చాలెంజ్ విధానంపై హైకోర్టు గురువారం కేసును విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని ఈ కేసులో పిటిషన్లు దాఖలు చేసిన మెసర్స్ ఆదిత్య హౌసింగ్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్, మెసర్స్ ఎన్‌వైన్ ఇంజనీర్స్ సంస్ధలకు ఎటువంటి షరతులు లేకుండా టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇస్తారా ఏపి అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. ఏపి ఏజి దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో తమ అపీల్‌పై త్వరితగతిన విచారించాలని కోర్టును కోరారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వ వాదనలు వినాలని ఆయనకోర్టును కోరారు.

ఇంధన పొదుపునకు ఐదేళ్లలో ఐదు వేల కోట్ల రూపాయలు

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఇంధన పొదుపు కార్యక్రమానికి ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి తెలిపారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేసేందుకు, ఇంధన పొదుపు కార్యక్రమాలను అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శరాష్ట్రంగా ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి తెలియ చేశారు.

చంద్రబాబు ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం: వైకాపా

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా రాష్ట్రంలో పరిపాలనా విధ్వంసానికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలే దండయాత్ర చేసే రోజులు సమీపించాయని వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు వందల హామీలను ఇచ్చిన చంద్రబాబు కాపులను, రైతులను మోసం చేశారన్నారు. రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా రైతులు చేసే ఉద్యమానికి మద్దతు ఇస్తామన్నారు.

బి కేటగిరీ సీట్లకు రెండో కౌన్సిలింగ్ నిర్వహించండి

హైదరాబాద్, సెప్టెంబర్ 22: సుప్రీం కోర్టు నిబంధనలకు లోబడి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సి కేటగిరీ కింద ఎన్‌ఆర్‌ఐ సీట్ల సంఖ్యను పెంచరాదని, అలాగే బి కేటగిరీ కింద మేనేజిమెంట్ కోటా సీట్లను రెండవ కౌనె్సలింగ్ నిర్వహించి భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ అనిస్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. బి కేటగిరీ సీట్లను సి కేటగిరీ (ఎన్‌ఆర్‌ఐ) కోటా కింద మేనేజిమెంట్లు మార్చేందుకు ప్రభుత్వాలు అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం..

విజయవాడ, సెప్టెంబర్ 22: ‘నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, నాకు రహస్య ఎజెండా ఏదీ లేదు. వితండవాదం అంతకన్నా లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తన ముందున్నది ఒక్కటే లక్ష్యమన్నారు. హోదాకు సమానంగా ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత కావాలి, అందుకు అవసరమైన జీవోలు ఇవ్వాలి, అన్నీ రిలీజ్ చేయాలి, ఇదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కావాలి, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందుకే కేంద్రం ఇచ్చిన అన్ని తీసుకుంటున్నామని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అన్నారు.

‘గాంధీ’ ఆసుపత్రికి తలవంపులు..!

సికిందరాబాద్, సెప్టెంబర్ 22: ప్రాణాపాయస్థితిలో ఉన్నవారు చికిత్స కోసం వస్తే ఆపన్నహస్తం అందించి అక్కున చేర్చుకోవాల్సిన వైద్యసిబ్బంది దానిని మరచి చీదరింపులు, నిర్లక్ష్యపుపనితీరుతో వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు. ఈ ప్రపంచంలో ఒక్కసారి పోతే దాని తిరిగి తీసుకురాలేనిది ప్రాణం మాత్రమే. అలాంటి ప్రాణాలను కాపాడాల్సిన పెద్దాసుపత్రిలో కొందరు సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతూ అమాయక ప్రజల ప్రాణాలకు విలువలేనట్టుగా వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వవైద్యాన్ని అభాసుపాలు చేస్తోంది.

విశ్వనగరమన్నారు.. మురికివాడ చేశారు

హైదరాబాద్, సెప్టెంబర్ 22: స్వరాష్ట్ర సిద్ధించి, స్వపరిపాలన ప్రారంభం కాగానే మహానగరాన్ని విశ్వనగరం చేస్తామని ప్రకటించిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోందని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనీల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. తరుచూ కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొవటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ గురువారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రాణాలు పోయేవరకు చేవెళ్ల జిల్లా కోసం పోరాడుతా

చేవెళ్ల, సెప్టెంబర్ 22 : చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలను కలుపుకుని చేవెళ్ల జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసేందుకు తన ప్రాణాలనైనా అర్పిస్తానని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం అన్నారు. గత మూడు రోజుల నుండి చేవెళ్ల జిల్లాకోసం కొనసాగుతున్న పోరుకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కేంద్రం జిల్లా కేంద్రంగా కావడానికి అవకాశం ఉందన్నారు. వికారాబాద్, తాండూర్, పరిగి అభివృద్ధి చెందింది, కాని చేవెళ్ల ఇప్పుడిప్పుడే అబివృద్ధి చెందుతోందన్నారు. దీంతో మళ్లీ చేవెళ్ల వెనుకబడి పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తాండూరులో కొనసాగుతున్న ఆందోళన

తాండూరు, సెప్టెంబర్ 22: తాండూరును రెవెన్యూ డివిజన్‌గా ఉన్నతి కల్పించటంతో పాటు, 19 మండలాలతో కూడిన వికారాబాద్ జిల్లా ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ గత అయిదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. రెండురోజులు తాండూరు బంద్ విజయవంతం కావడంతో ఆందోళనకారులు, తాండూరు అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం అయ్యాయి.

Pages