S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేనికైనా సిద్ధం!

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 19: యూరి మిలిటెంట్ దాడి నేపథ్యంలో భారత్ నుంచి ఎలాంటి సవాళ్లు తలెత్తినా ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సన్నద్ధమవుతోంది. భారత నాయకత్వం తీవ్రస్థాయిలో హెచ్చరిక స్వరాన్ని వినిపించడంతో పాక్ ఆర్మీ చీఫ్ సోమవారం సైనిక కమాండర్లతో సమావేశమయ్యారు. దేశీయ, బాహ్య భద్రతా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిణామాలు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని వారికి స్పష్టం చేశారు.

బాధ్యులను కఠినంగా శిక్షించాలి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: యూరిలోని భారత సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్‌కు అండగా నిలిచాయి. దాడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ డిమాండ్ చేశారు. ఫ్రాన్స్, కెనడా, వెనిజులా తదితర దేశాలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా నిలుస్తామని ప్రకటించాయి. మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు జరిపినట్లుగా భావిస్తున్న ఈ దాడిని ఖండిస్తూ ప్రపంచం నలుమూలలనుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుపతివరకు పొడిగించాలి

ఇటీవల కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ప్రభు నంద్యా ల నుండి కడపకు నేరుగా రైలు సౌకర్యాన్ని ప్రవేశపెట్టనునన్నట్లు ప్రకటించారు. ఆంధ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి. ఆయన మన రాష్ట్రంనుండి రాజ్యసభకు ఎన్నుకోబడినందున రాష్ట్రానికి అదనంగా రైల్వే సదుపాయాలు ప్రకటించడం అవసరమే. ఈ రైలుబండి ప్రస్తుతం కడపవరకు వెల్లి మళ్లీ నంద్యాల చేరుతుంది. దీనివల్ల కర్నూలు, కడప జిల్లాల ప్రజలు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. ఈవరకే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ అనంతపురం, చిత్తూరు జిల్లాలతో సహా రాయలసీమ ద్వారా ప్రయాణిస్తున్నది.

పాకిస్తాన్‌ను శిక్షించి తీరాలి

కుక్కతొక వంకర అనేది మరోసారి రుజువైంది. యురిలోని సైనిక శిబిరంపై ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన దాడి పాకిస్తాన్ కుక్కతోక వంకర విధానానికి మరో నిదర్శనం. ఇస్లామిక్ తీవ్రవాదం ద్వారా భారత దేశంపై ప్రచ్చన్న యుద్ధం కొనసాగిస్తున్న పాకిస్తాన్ వైఖరిలో మార్పు రానేరాదు. పాకిస్తాన్ తనంత తాను మంచి మార్గంలోకి రానప్పుడు గట్టిగా బుట్టి చెప్పటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించకతప్పదు. యురి సైనిక శిబిరంపై ఇస్లామిక్ తీవ్రవాదుల ద్వారా దాడి చేయించి దాదాపు ఇరవై మంది సైనికులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్‌కు వీలైనంత త్వరగా బుద్ది చెప్పాలి.

సామాజిక చైతన్యం అవసరం

ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని రాజకీయ పార్టీలు నాయకులు మారినా భారతదేశంలో మాత్రం అధికశాతం మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. వీరి జీవితాల్లో మెరుగుదల కనిపించడంలేదు. అభివృద్ధి పథంలో భారత్ వెలిగిపోతోందంటున్నా, అది కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం. రాజకీయ పెద్దన్నలు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, తమ వ్యక్తిగత ఆస్తులను కూడ బెట్టుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఓట్లకోసం కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ తాము మాత్రం వైభోగాలలో తేలిపోవడం నేటి రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి వారి చర్యలవల్ల దేశం ఇంకా

- డి.చాంద్‌బాష

బయటపడ్డ మరో కుంభకోణం ‘ఎంబ్రేర్’

‘సీజరు భార్య తప్పు చేయదు’ ఈ ఇంగ్లీషులో ఒక సామెత ఉన్నది. భారతదేశం లో కొందరు తప్పు చేయరు అని అంతా విశ్వసించారు. అలాంటివారిలో ఆంటోనీ ఒకరు. షేక్స్‌పియర్ నాటకం ఆంటోనీ క్లియోపాత్రకు ఈ ఆంటోనీకి ఎట్టి సంబంధం లేదు. చరిత్రలో ఆంటోనీ రాజు. విలాసపురుషుడు. కాని భారత మాజీ రక్షణమంత్రి ఎకె ఆంటోనీ మాత్రం సెయింట్ ఆంటోనీ లాంటివాడే. 2014 ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రక్షణమంత్రిగా మనోహర్ పారేకర్ బాధ్యతలు స్వీకరించారు. అక్కడినుండి కొత్త అధ్యాయం మొదలైంది. నీరక్షీర వివేచనతో ఇప్పటివరకు మనం పాలు అనుకున్నవి పాలుకాదు నీళ్లు అని తేలింది.

- ముదిగొండ శివప్రసాద్

పట్టి పరిమార్చలేమా?

ప్రమత్తత మరోసారి సమర వీరుల ప్రాణాలను తీసుకొంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పిన నలుగురు జిహాదీ ఉగ్రవాదులు పదిహేడుమంది సైనికులను హత్య చేయగలగడం భద్రతా కుడ్యంలో ఏర్పడి ఉన్న కన్నాలకు మరో ప్రత్యక్ష నిదర్శనం. సైనిక దళాల స్థావరంలో, జమ్ము కశ్మీర్‌లోని పాకిస్తాన్ దురాక్రమిత ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అధీనరేఖ-లైన్ ఆఫ్ కంట్రోల్‌కు అత్యంత సమీపంలోని ఊరి పట్టణంలో నెలకొని ఉన్న సైనిక శిబిరంలో ఈ ప్రమత్తత నెలకొని ఉండడం పాకిస్తానీ తోడేళ్లు దూకగలగడానికి ప్రధాన కారణం!

విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపి

హైదరాబాద్, సెప్టెంబర్ 19: క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడేందుకు కార్యకర్తలు సమాయత్తం కావాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. పార్టీ తరఫున ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. సోమవారం మొదటి రోజున ముగింపు సమావేశంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ దేశ ప్రజల మధ్య బిజెపి విద్వేషాలు రెచ్చగొడుతున్నదని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పేదల పక్షాన నిలబడితే, బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదని దుయ్యబట్టారు. కాశ్మీర్ ఘటన దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

పారదర్శకంగా రాయితీలు

హైదరాబాద్, సెప్టెంబర్ 19: పరిశ్రమల స్థాపనకు అనువైన 220 ప్రాంతాలతో ఒక అట్లాస్‌ను రూపొందించాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని మెగా ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సోమవారం సమావేశం అయింది. పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు, మంత్రుల ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డిలతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మెగా ప్రాజెక్టులతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వ విధానం ఉండాలని కెటిఆర్ సూచించారు.

కొత్త బిఇడి కళాశాలల దరఖాస్తులను అనుమతించండి

హైదరాబాద్, సెప్టెంబర్ 19: కొత్తగా బిఇడి కాలేజీలు ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్న వారందరి దరఖాస్తులను అనుమతించాలని రాష్ట్ర హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్‌సిటిఇ నిబంధనలను పక్కన పెట్టి కొత్తగా బిఇడి కాలేజీలు రాకుండా అడ్డుకోవడం రాష్టప్రరిధిలో అంశం కాదని, అలాంటి అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు పేర్కొన్నారు. ఒకసారి అన్నీ పరిశీలించిన తర్వాతనే ఎన్‌సిటిఇ అనుమతి ఇస్తున్నపుడు ఇక దానికి అనుమతి ఇవ్వకపోవడం అనేది రాష్ట్రప్రభుత్వం ఇష్టం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Pages