S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్మిక హక్కులను హరిస్తున్న మోదీ ప్రభుత్వం

నర్సీపట్నం, ఆగస్టు 28: కార్మిక హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం హరిస్తోందని కేరళ మత్స్య, జీడిపిక్కల పరిశ్రమల శాఖ మంత్రి మెర్సి కుట్టిఅమ్మ ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీడిపిక్కల కార్మికుల సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో అసంఘటిత రంగ కార్మికులు దుర్భరమైన జీవన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవాలి

బెంగళూరు, ఆగస్టు 28: రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవాలని, ప్రభుత్వ, పరిపాలనకు సంబంధించిన అంశాల్లో భాగస్వాములై సమాజంలో కోరుకున్న మార్పును తీసుకురావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ విద్యార్థులకు సూచించారు. ఆదివారం బెంగళూరులో ఆయన ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు (నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ) 24వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఈ విజ్ఞప్తి చేశారు. ‘న్యాయ విద్యార్థులంతా రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి మన రాజకీయ వ్యవస్థతో పాటు రాజ్యాంగ సంస్థలు, ప్రక్రియల గురించి అవగాహన పెంపొందించుకోవడం ద్వారా దేశ అభ్యున్నతికి ఉపకరించే అవకాశాలను విశే్లషించుకోవాలి.

లంచం ఇచ్చేందుకు బిచ్చగాడి అవతారం!

ఓ అధికారికి లంచం ఇచ్చేందుకు ఓ పిల్లవాడు బిచ్చమెత్తుకోవలసి వచ్చింది. తండ్రి చనిపోయినందుకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సాధించుకునేందుకు అధికారి లంచం అడగటంతో ఆ పిల్లవాడు సదరు లంచం మొత్తాన్ని సంపాదించేందుకు బిచ్చం ఎత్తుకోవలసి వచ్చింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కున్నత్తూర్‌లో అజిత్ అనే పదిహేనేళ్ల పిల్లవాడి తండ్రి నిరుడు చనిపోయాడు. అంత్యక్రియలకు డబ్బు లేకపోవటంతో అప్పుచేసి మరీ దహన సంస్కారాలను పూర్తిచేశాడు. అయితే తండ్రి మరణానికి పరిహారం కోసం ప్రభుత్వాన్ని కాళ్లరిగేలా తిరిగి అర్థిస్తే ఏడాది తరువాత రూ.12, 500 సాయం ప్రకటన వచ్చింది.

పేగు బంధం

కన్నబిడ్డను కాపాడుకోడానికి తన ప్రాణాలనే త్యాగం చేసి పేగు బంధానికి నిర్వచనం చెప్పింది ఓ అమ్మ.. ఏ దేశంలోనైనా, ఏ ఖండంలోనైనా మాతృప్రేమ ఒకేలా వుంటుంది. అమెరికాలో సరదాగా ఓ కుటుంబ బోట్లో షికారు చేస్తుండగా, రెండేళ్ల బాలుడు అకస్మాత్తుగా నీళ్లలో పడిపోయాడు. అది గమనించిన ఆ బాలుడి తల్లి చెల్సీ రస్సెస్ (35) ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకి పిల్లాడిని పైకితీసి బోటులోని వారికి అందించి తాను మునిగిపోయింది. కొంతసేపటికి చెల్సీని కూడా వెలికితీశారు. అయితే అప్పటికే జరగరానిది జరిగిపోయింది. బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడగా, ఆ మాతృమూర్తి మాత్రం విగతజీవిగా మారిపోయింది.

దేవాలయంపైనే అంత్యక్రియలు

ఉత్తరభారతాన్ని అల్లాడిస్తున్న వరదలు యూపి, బీహార్‌లలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వారణాసిలో అంతిమసంస్కారం జరిపే పవిత్రమైన మణికర్ణిక ఘాట్ పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. దీంతో దానికి సమీపంలో ఉన్న ఓ చిన్న దేవాలయం ఉపరిభాగంపైనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వారణాసిలో వరద పోటెత్తడంతో నీటమునిగిన ఓ కాలనీలో మృతదేహాలను దహనం చేయటానికి కూడా అవకాశం లేక నీటిలోనే ఉంచి పొడి ప్రదేశం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక బీహార్‌లో వరదల కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 153కు చేరింది.

జెఎన్‌యు ఎన్నికలు.. సిఇసిగా మహిళ

న్యూఢిల్లీ, ఆగస్టు 28: వివాదాలతో అట్టుడికిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి సంఘ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల నిర్వహణకు తొలిసారి ఒక మహిళ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. జెఎన్‌యుఎస్‌యు నిర్వహించిన సమావేశంలో సిఇసిగా స్కూల్ ఆఫ్ సోషల్ సైనె్సస్ ఎస్‌ఎస్‌ఎస్‌కు చెందిన పిహెచ్‌డి ప్రథమ సంవత్సర విద్యార్థిని ఇషితా మనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాజీ సిఇసి దిలీప్ వౌర్య తెలిపారు. ఎన్నికల కమిటీ సారథిగా మహిళను ఎన్నుకోవడం జెఎన్‌యు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కమిటీ త్వరలోనే సమావేశమై ఎన్నికల తేదీలను ఖరారు చేయనుంది. దీంతో సెప్టెంబర్‌లోనే ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శాంతికాముకులతో చర్చలకు సిద్ధం

న్యూఢిల్లీ, ఆగస్టు 28: హింసను వ్యతిరేకించే, శాంతి పునరుద్ధరణకు తోడ్పడే ఎవరితోనైనా చర్చలు జరపడానికి తాము సిద్ధమేనని జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబ్ ముఫ్తీ చెప్పారు. వేర్పాటువాదులు గనుక శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లయితే వారితో కూడా చర్చలు జరపడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ఆమె అన్నారు. అయితే అదే సమయంలో చర్చలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం, అలాగే భద్రతా దళాల శిబిరాలను ఘెరావ్ చేసి దాడి చేసేలా యువతను రెచ్చగొడుతున్న కొంతమంది వ్యక్తులు హింసను ప్రేరేపించడాన్ని ఆపాలని ఆమె అన్నారు.

రవిశంకర్‌ను కలిసిన బుర్హాన్ వనీ తండ్రి

శ్రీనగర్, ఆగస్టు 28: కాశ్మీర్‌లో గత నెల భద్రతా దళాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ తండ్రి బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌ను కలిసి జమ్మూ, కాశ్మీర్‌లో పరిస్థితిపై ఆయనతో చర్చించారు. గత వారం తాను బెంగళూరు వ్యక్తిగత పనిమీద వెళ్లినప్పుడు రవిశంకర్‌ను కలిశానని, జమ్మూ, కాశ్మీర్‌లో వాస్తవ పరిస్థితిని ఆయనకు వివరించానని ముజఫర్ వనీ త్రాయ్ పట్టణంలోని తన నివాసంనుంచి ఫోన్‌లో పిటిఐకి చెప్పారు. కాశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనడానికి మీ పలుకుబడిని ఉపయోగించాలని తాను రవిశంకర్‌ను కోరినట్లు వృత్తిరీత్యా టీచర్ అయిన వనీ చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న ద్రోణాచార్య, అర్జున అవార్డులకు ఎంపికయనవారు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ద్రోణాచార్య, అర్జున అవార్డులకు ఎంపికయనవారు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నప్పటి చిత్రాలు..

పక్షం రోజులు ముందుగానే పార్లమెంట్!

న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశంలో వస్తుసేవల పన్ను (జిఎస్‌టి)ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఒకటోనుంచి అమలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆతృత పడుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు వీలుగా పార్లమెంటు శీతాకాల సమావేశాలను 15 రోజులు ముందుగా ప్రారంభించాలని భావిస్తోంది. సమావేశాలను ముందుగా ప్రారంభించడం వల్ల కొత్తగా జిఎస్‌టి అమలుకు అవసరమైన రెండు చట్టాలను ఆమోదించడానికి పార్లమెంటుకు తగినంత సమయం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ మూడవ లేదా నాలుగవ వారంలో ప్రారంభం అవుతాయి. నెల రోజుల పాటుసాగే ఈ సమావేశాలను ప్రభుత్వం పండుగల సీజన్ ముగిసిన వెంటనే ప్రారంభించాలని భావిస్తోంది.

Pages