S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో మల్లినాథుడు

తెలుగువారికి చాలాకాలం నాడు ఒక మల్లినాథసూరి కాళిదాస కావ్యాలకు గొప్ప వ్యాఖ్యానాలు రాసి సంస్కృత సాహిత్య భిక్ష పెట్టినాడు. అటు తరువాత వేదాంత దేశికులు తమ సంస్కృత పాండితీప్రకర్ష చేత అనేక రచనలు చేస్తే అవన్నీ సంస్కృతంలో ఉండి కొందరికే తెలిసే స్థితి ఏర్పడింది. తమిళదేశం వారు వాటిని ఇంగ్లీషులోకి, తమిళంలోకి అనువదించుకున్నారు. తెలుగువారికి దేశిక సాహిత్యం పరిచయం కాకపోవడం అనే లోపాన్ని గ్రహించి కెవి రాఘవాచార్య గారు అసిధారావ్రతంగా పాదుకా సహస్రానే్న కాకుండా అనేక రచనలకు గొప్ప వ్యాఖ్యానాలను రచించారు.

- శ్రీరంగాచార్యులు, 9299451266

గొడుగులు నాటండి

ఆమె గొడుగు కోసుకురమ్మంది
అవును మరి
అది ప్రణయ రుతువులో విచ్చుకునే పువ్వు
పై చినుకులేవీ మీద పడకుండా
లోపల కురిసే చినుకుల్ని మాత్రమే
మనకు వినిపించే వేణువు

- ప్రసాదమూర్తి, 8499866699

కథా భూమిక (శ్రీవిరించీయం 9)

కొందరు రచయితలు, పూర్తిగా ఉత్తరాలతోనే కథనంతటినీ నింపేస్తారు. కొందరయితే కేవలం సంభాషణల్లోనే కథనం అంతా నడుపుతారు. అలాగే కథంతా వర్ణనలతో నింపేసే రచయితలూ ఉన్నారు. ఏ పద్ధతిని అవలంబించినా, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే-కథ నడవాలి. పాత్రలను కాగితంమీద, చదువరని మన్ఫఃలకంమీద ముందుకు లాక్కుపోవాలి. ఇటుకలు పేర్చుకుంటూ, గోడను ఎత్తుకు లేపుకుపోయినట్టుగా కథ బలిష్టంగా పైకి ఎదగాలి. అలా ఉత్కంఠతో కథను నడిపినప్పుడు ఏ పద్ధతిలో రాశాం అనేది గుర్తు రాదు. కొందరు కవులు కథనంతటినీ పద్యాలతోనో గీతలతోనో రాసేస్తే, దానికి ‘ఖండకావ్యం’ అనో ‘కావ్యగీతం’ అనో నామకరణం చేయడం కూడా అమలవుతోంది.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584

ప్రాణానికి ప్రాణం స్నేహం

వర్గాలు,వర్ణాలు వదిలితేనే స్నేహం
కలహాలు, ద్వేషాలు తెలియని స్నేహం
మధురం మధురం స్నేహం
సృష్టిలో తీయనిది స్నేహం
జ్ఞాపకాల చిరునామా స్నేహం
జీవితంలో తీయని మలుపు
మధురం మధురం స్నేహం
ఆపదలో ఆదుకొనే అమృతహస్తం
ఆనందానికి ప్రియమైన నేస్తం
బాంధవ్యాల కన్న మిన్న నేస్తం
మధురం మధురం స్నేహం
స్నేహానికి లేదు నిర్వచనం
ఎన్ని యుగాలైనా, ఎన్ని జన్మలైనా
చెరిగిపోనిది, తరిగిపోనిది, మరణం లేనిది
మధురాతి మధురమైనది స్నేహం
- మలుగు లక్ష్మీమైథిలి, 9441685293

వెలిగే కాంతిపుంజం

స్నేహమే దైవం (చిరుకవితలు)

త్యాగమనే జలంతో ఎదిగే
పచ్చని మొక్క
స్వార్ధమనే కలుషమంటని
అగ్నిహోత్రం
జడివానకు జడవని గిరి శిఖరం
సుడిగాలికి కొడిగట్టని దివ్యదీపం
ఋతువేదయినా శ్రుతి తప్పని గానం
నీడ కూడా దూరమైన
కటిక చీకటిలో
వీడిపోనని తోడు నడిచే వెలుగురేఖ
నీ గుండె గాయానికి చెమ్మగిల్లే నయనం
నీ ఆనందానికి పొంగిపోయే హృదయం
తల్లితండ్రి గురువు దైవం సర్వస్వం
నమ్మకానికే నమ్మకమైన
ఆత్మబాంధవ్యం
నారికేళ సలిల ధారాసమనిర్మలం
అర్పించడమే గాని
ఆశించడమెరుగని సౌశీల్యం
ఒకే రాగం పలికే రెండు గొంతులు
ఒకే భావం తెలిపే రెండు మనసులు

పుష్కర స్నానం... అనంత పుణ్యఫలం (సంస్కృతి)

మానవ నాగరికత, సంస్కృతి అభివృద్ధి చెందుతూ వచ్చింది నదీ తీరాల్లోనే. అందుకే మనకున్న ముఖ్యమైన 12 నదులకు ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరం వస్తుంది. గత సంవత్సరం గోదావరి నది పుష్కరాలు జరిగితే, ఈ ఏడాది కృష్ణానదికి పుష్కరాలొచ్చాయి. కృష్ణా పుష్కరాలకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమంటే?.. మనం ప్రతి నిత్యం స్నానం చేసేటప్పుడు చెప్పుకునే శ్లోకంలో ‘గంగేచ యమునేచైవ’ పఠిస్తాం. అయితే ఈ శ్లోకంలో ఎక్కడా కృష్ణవేణి పేరు లేదు. అయినా మనం కృష్ణానదికి పుష్కరాలు నిర్వహిస్తాం. శ్లోకంలో పేరు లేనంతమాత్రాన ఆ నది గొప్పది కాదని భావించక్కర్లేదు. దేశంలోని అతిపెద్ద రెండో పొడవైన నది కృష్ణానది.

- విష్ణ్భుట్ల రామకృష్ణ, చరవాణి : 9440618122

కృతజ్ఞత బాగుంది (స్పందన)

గత వారం మెరుపులో గౌతమి గారి కలం నుంచి రాసిన కృతజ్ఞత కథ చాలా బాగుంది. కథలో చెప్పదలచిన సందేశాన్ని క్లుప్తంగా చెప్పిన తీరు బాగుంది. కథలో పాత్రల సంభాషణలు, కథను అందంగా మలిచిన విధం కథను చివరి వరకు ఆసక్తిగా చదివించింది. ముఖ్యంగా మాస్టారు అప్పదాసు, విద్యార్థి సుందరం మధ్య వచ్చే సంభాషణలు చాలా బాగా కుదిరాయి. సమాజానికి సాయం చేస్తే పదిమందికి ఉపయోగపడుతుంది. ఆ సాయాన్ని పొందిన వారు వృద్ధిలోకి వచ్చి మళ్లీ పదిమందికి సాయం చేస్తే కృతజ్ఞతగా వుంటుందని చక్కటి సందేశంతో కథను మలిచిన గౌతమి గారికి ధన్యవాదములు. గౌతమి గారి పుస్తక సమీక్షలు కూడా చాలా బాగుంటాయి.
- పుప్పాల పవన్‌కుమార్, ఆర్ సి రోడ్డు, తిరుపతి

ఏం చేయాలి? (మనోగీతికలు)

కందకాలు పూడ్చేయాలంటే
కండను కదిలించాలి
గుండెలో భయం ముల్లై గుచ్చితే
కొండను ధ్యానించాలి!
చెలియ కోపమును చల్లార్చాలని
తలచేటి గాలిబా!
చెలిమి కోసమై రాయబారి
పూదండను పంపించాలి!
పూజలందుకొను వారసత్వాన్ని
సులభంగా పొందలేవులే
శిల్పం కోసం కాలం చెరుపని
బండను శోధించాలి!
చీకటి తెరలను చీల్చేయాలని
కలలు కంటున్న ఓ దానా
సౌరఘటాలను శిరసుకెత్తుకొని
ఎండను సేవించాలి
పుట్టిన వాడు గిట్టక మానడు
లోకంలో ఇది సత్యంలే
దేహమెట్టిదో తెలిపేటందుకు
మట్టికుండను చూపించాలి!
- కిలపర్తి దాలినాయుడు
సాలూరు

నానీల తరవాణి ( పుస్తక సమీక్ష)

పదిహేడు నుండి ఇరవై నాలుగు అక్షరాల మధ్య ఒక అర్ధవంతమైన భావచిత్రాన్ని అందించేది నానీ. సూక్ష్మంలో మోక్షం అన్నట్లు అక్షరాలతో ఆహా అనిపించేటట్లు రత్నాల బాలకృష్ణ తన తరవాణి నానీల సంపుటి ద్వారా జీవిత సత్యాన్ని చెప్పారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే నానీలకు నారు నీరు పోసిన డాక్టర్ గోపి బాలకృష్ణ నానీలు చదవగానే పువ్వుల పొట్లం విప్పినప్పుడు గుప్పుమనే పరిమళంలా అనిపించింది అన్నారు. ఇలా అనడానికి కారణం ఈ నానీయేమో. ‘మెరుపు కొరడాతో/ ఆకాశానికి శిక్ష/వర్షమై/కన్నీరు కారుస్తోంది. మెరుపును కొరడాతో పోల్చి అది ఆకాశాన్ని శిక్షిస్తే ఇంకేముంది ఆ బాధ తాళలేక ఆకాశం ఏడుస్తోంది. అదే వర్షం.

- ఈవేమన, సెల్ : 7893451307

వాళ్లకీ ఓ రోజుండాలి (కథానిక)

సర్వేశ్వరశర్మగారు మంచి పేరున్న ఉపాధ్యాయుడు, వేదపండితుడు, సాహితీవేత్త. ఈమధ్యనే ఉద్యోగ విరమణ చేసారు. విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో ఈయనకు అవిశ్రాంత శ్రమ పెరిగింది. పిల్లలిద్దరూ పెళ్లిళ్లు అయి అమెరికాలో ఉన్నారు. పక్షవాతం వచ్చిన భార్యకు అన్నీ తానై సేవలందిస్తూ కోలుకునేటట్టు చేస్తున్నారు. ఇదివరకు ఇంట్లో ఏచిన్న పని కూడా తాను చేసియెరగడు. యింట్లో పనిమనిషి కొన్ని పనులు వరకు మాత్రమే చేయగలదు. అన్ని సందర్భాలలో కనిపెట్టుకొని చంటిపిల్లలకు చేయాల్సిన పనులన్నీ ఎంతో సహనంతో కూడిన ప్రేమతో చేస్తున్నప్పటికీ కొద్దిపాటి అసౌకర్యం, అసహనం చోటు చేసుకుంటున్నాయి.

- చావలి శేషాద్రి సోమయాజులు, పాచిపెంట, విజయనగరం జిల్లా. ఫోన్ : 9032496575

Pages