S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంచెం టచ్‌లో ఉంటే... (మినీకథ)

‘‘్భద్రుడూ ఇది విన్నావటోయ్’’ హడావుడిగా లోపలికి వచ్చి అడుగుతున్న సత్యాన్ని చూసి ‘‘అబ్బే నువ్వు చెప్పందే ఏం వింటా’’ అంటూ ఎదురుప్రశ్న వేశాడు భద్రం.
‘‘అవున్నిజమే కదా! నే చెప్పందే నీకసలేం తెలవదు. సంగతేంటంటే ఈరోజు నాగన్న జన్మదినం. నువ్వు కాస్త శుభాక్షాంక్షలు చెప్పావనుకో. ఒకరికొకరు ఎంతో ఆనందిస్తారు’’ అన్నాడు సత్యం.
‘‘సరే గానీ సత్యం, నీ శుభాక్షాంక్షలతో ఇద్దరికి ఆనందమేమిటి?’’ ఆశ్చర్య వ్యక్తం చేశాడు భద్రం.

- డాక్టర్ యిమ్మిడిశెట్టి చక్రపాణి, నెహ్రూచౌక్, అనకాపల్లి-531001. సెల్ : 9849331554.

ధర్మరాజుగారి ధర్మా! (కథ)

ఏనుగుల ఘీంకారాలతో, అశ్వాల సకిలింపులతో, భటుల పదఘట్టనలతో రథాలు కదిలే శబ్దాలు కోట సామ్రాజ్యం దూరంగా జరిగిపోయాయి. కోటను దాటి దూరంగా కారడవిలోకి తరలాడు ధర్మరాజు. తోవ సవ్యంగా లేదు. మార్గం ముళ్లడొంకలమయం. పైగా సాయంకాలం అయింది. తోడుగా ధర్మా ఒక్కడే మిగిలాడు. మూన్నాళ్ల నుండి తిండి లేదు. ఆకలిగా ఉంది. దాహంగా ఉంది. దరిదాపుల్లో దాహార్తికి సమాధానంగా చిన్న నీటిమడుగైనా లేదు. ధర్మరాజు నిస్సత్తువగా ఒక చెట్టు ముందర కూలబడిపోయాడు. అతని పక్కనే ఒదిగిపోయింది ధర్మా. నీరసించి కృశించిన ధర్మా కేసి చూసిన ధర్మరాజు ‘అయ్యో! తిండీతిప్పలు లేక నన్ను అనుసరిస్తున్నాడు ఈ ధర్మాగాడు.

- యల్. రాజాగణేష్, చైతన్యనగర్, పాతగాజువాక, విశాఖపట్నం-530026. సెల్ : 9247483700.

mataata

యువర్స్ లవ్వింగ్లీ... 41

‘‘సూర్య మనకి చాలా విలువైన సమాచారం ఇచ్చాడు. భరణిని చంపినది మనిషి కాదు దెయ్యం. భరణివల్ల మోసగించబడి ఆత్మహత్య చేసుకున్న సంధ్య అనే అమ్మాయి దెయ్యంగా మారి భరణిమీద పగ తీర్చుకుంది’’ అంటూ సూర్య తనకి చెప్పినదంతా అతడికి చెప్పాడు భరణి.
‘‘మీరు నిజంగా దీన్నంతటినీ నమ్ముతున్నారా?’’ భరణి చెప్పినది విని అన్నాడు రవీంద్ర.
పాణి చిన్నగా నవ్వేడు ‘‘నిజానికి మన నమ్మకాలతో పనిచలేదు రవీంద్రగారూ’’ అంటూ తను డాక్టర్ పరమేశ్వర్‌తో మాట్లాడిన విషయాలు కూడా రాజేంద్రకి చెప్పాడు.
‘‘నమ్మకం సంగతి పక్కన పెట్టండి. అసలు దీన్ని మీరు కోర్టులో ఎలా నిరూపిస్తారు? సాక్ష్యం ఎవరున్నారు?’’

వరలక్ష్మి మురళీకృష్ణ

నేర్చుకుందాం

ఆ. దానినెఱిఁగి కమలయోని వానికిఁ గర
మల్గి మర్త్య యోనియందుఁ బుట్టు
మనుచు శాపమిచ్చె నొనరంగ వాఁడును
గరము భీతిఁ గరయుగంబు మొగిచి
భావం: బ్రహ్మదేవుడు ఈ గంగాదేవిని మహాభిషుడు చూడడం చూసాడు. ఆ సందర్భంలో ఆ గంగాదేవి పైన మహాభిషుని పైన కోపం తెచ్చుకొన్న బ్రహ్మ ఆ మహాభిషుడిని మానవ వనితకు పుట్టుమని శాపమిచ్చాడు. ఆ శాపానికి వెరచిన మహాభిషుడు తాను చేసిన పనికి వగచి అమిత భయవిహ్వలుడై రెండు చేతులు బ్రహ్మ ముందు జోడించి నిలుచున్నాడు.
క. అనిమిషలోక వియోగం
మన దుఃఖితు లయి వసిష్ఠ మునివరు శాపం
బున వచ్చువారి వసువుల
నెన మండ్రం గాంచి గంగ యెంతయుఁ బ్రీతిన్

హరివంశం 206

శుక్రుడు అంగిరసుడి శిష్యుడు కాబట్టి బృహస్పతికి జరిగిన అన్యాయానికి గర్హించి దేవగురువు పక్షం వహించాడు. శుక్రుడి పట్ల తన కుండే మక్కువతో పరమశివుడు బృహస్పతి పక్షంలో చేరాడు. అప్పుడాయన అజగవమనే మహా ధనుస్సు ధరించి బృహస్పతి విరోధి వర్గాన్ని చీల్చి చెండాడాడు.
చంద్రుడు చేసిన అపరాధాన్ని పట్టించుకోకుండా అతడి పక్షం వైపే మొగ్గుచూపుతున్నారని రుద్రుడు కోపించి బ్రహ్మ శిరమనే అస్త్రాన్ని దేవతలపై ప్రయోగించాడు. వారు అశక్తులైనారు. స్తంభించిపోయినారు. ఇదే అదనుగా చూసుకొని అసురులు విజృంభించారు. దేవవర్గం శక్తిహీనమైనందున క్రమంగా నాశం పొందుతూ వచ్చారు.

మహావాక్యములు

వేదభారతి ఉద్భవించి జ్ఞాన పరిమళాలు వెదజల్లిన పుణ్యభూమి మన భరతఖండం. ఋషుల మనోరథాలు అనంత విశ్వంలో స్వేచ్ఛాపయనం చేసి గ్రహించిన మహిమాన్విత నిత్యసత్యాల సమాహారమే మన వేదనిధి. మానవునికి నాగరికతను నేర్పిన తొలి విజ్ఞాన శాస్త్రాలు. జిజ్ఞాసువులకు సులభగ్రాహ్యంగా నుండుటకు సాక్షాత్ విష్ణుస్వరూపుడయిన వ్యాస మహర్షిచే నాలుగు భాగాలుగా విభజించబడినవి.

- వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు

క్రేజీ మల్టీస్టారర్?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ మల్టీస్టారర్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నందమూరి హీరోలకు, మెగా హీరోలకు మధ్య గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్‌కోసం ప్రయత్నాలు జరుగుతున్నా, అవి అక్కడే ఆగిపోయాయి. తాజాగా కల్యాణ్‌రామ్, సాయిధరమ్‌తేజ్‌లతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ఓ దర్శకుడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. ఇప్పటికే కల్యాణ్‌రామ్ కథ కూడా విన్నాడని తెలిసింది. ఈ చిత్రంలో మరో హీరోకోసం అడగ్గా ఆయన సాయిధరమ్ పేరు సూచించారట. ఇప్పటికే వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది.

ప్రేక్షకులు శుభమస్తు అన్నారు

‘సోలో’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేశారు. తాజాగా అల్లు శిరీష్, లావణ్యాత్రిపాఠి జంటగా ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో మరోసారి ముందుకొచ్చాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్‌అవుతున్న సందర్భంగా దర్శకుడు పరశురామ్ చెప్పిన విశేషాలు.
మంచి స్పందన..

- శ్రీ

Pages