S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేకహోదాపై త్వరలో స్పష్టత

న్యూఢిల్లి:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై త్వరలో స్పష్టత వస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. న్యూఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని అప్పటి యుపిఎ ప్రభుత్వం చట్టంలో ఎందుకు పొందుపరచలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీని ఎలా ఆదుకోవాలన్న విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్‌కు లేనేలేదని ఆయన వ్యాఖ్యానించారు.

పట్నాలో ఎన్డీఎ మహా ధర్నా

పట్నా:ఉపకార వేతనాలకు కోత విధించడం, దళితుల అణచివేత చర్యలకు నిరసనగా బిహార్ రాజధాని పట్నాలో ఎన్‌డిఎ పక్షాలు మహా ధర్నా నిర్వహించాయి. బిజెపి,ఎల్‌జెపి, ఆర్‌ఎల్‌ఎస్‌పి, హమ్ (ఎస్) పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీశైలంలో కేఈ పూజలు

కర్నూలు:శ్రీశైలంలోని భ్రమరాంబికామల్లికార్జున స్వామివార్లను ఏపీ ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా పుష్కరాల ముహూర్తం దగ్గరపడిన నేపథ్యంలో ఆయన శ్రీశైలం సందర్శించారు.

చేనేతలక్ష్మి పథకం ప్రారంభం

హైదరాబాద్:జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణలో చేనేతలక్ష్మి పథకాన్ని మంత్రి కె.తారకరామారావు ఆదివారం ప్రారంభించారు. రవీంద్రభారతిలో జరిగిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత విధానాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన చేనేత వస్త్రాలతో నిర్వహించిన ఫ్యాషన్‌షో అందరినీ ఆకట్టుకుంది.

దూసుకెళుతున్న సర్వే

ఏలూరు, ఆగస్టు 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికారత సర్వే ప్రక్రియ జిల్లాలో దూసుకెళుతోందనే చెప్పాలి. ఇప్పుడున్న గణాంకాల ప్రకారం చూస్తే రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి మొదటిస్థానంలో నిలుస్తోంది. అన్ని మండలాల్లోనూ సర్వే ప్రక్రియ పరుగులు తీస్తోంది. జిల్లా కేంద్రమైన ఏలూరు జిల్లాలోనే అత్యధికంగా సర్వే చేస్తూ ముందంజలో నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న మిగిలిన జిల్లాల్లో వున్న పరిస్థితి చూసుకుంటే జిల్లాలో దాదాపు రెట్టింపు మంది వివరాలను సర్వే ద్వారా సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.

కొరడా ఝళిపిస్తున్న జెసి

ఏలూరు, ఆగస్టు 6: ఆహార కల్తీ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా ఉంది. ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ కల్తీలను పూర్తిస్దాయిలో నిరోధించేందుకు కృతనిశ్చయంతో ముందుకెళుతోంది. జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు నేతృత్వంలో జిల్లావ్యాప్తంగా ఉన్న హోటళ్లు, ఇతర తినుబండారాల కేంద్రాలపై పూర్తిస్ధాయి దాడులను ప్రారంభించారు. ఈలోగానే ఏలూరులో ఒక దారుణం చోటుచేసుకోవటంతో నగరంలో వరుస దాడులు నిర్వహించారు. ఒక హోటల్‌ను మూయించివేశారు. మరికొన్నింటికి నోటీసులు ఇచ్చారు. ఆహారకల్తీకి సంబంధించి గత కొద్దిరోజుల నుంచి పలు ఫిర్యాదులు అందుతూ వస్తున్నాయి.

కృష్ణా పుష్కరాలకు పటిష్ఠ భద్రత

ఏలూరు, ఆగస్టు 6 : రానున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా యాత్రీకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పూర్తి భద్రతా ఏర్పాట్లను చేపట్టిందని ఏలూరు రేంజ్ డి ఐజి పివి ఎస్ రామకృష్ణ తెలిపారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం డి ఐజి పుష్కరాల ఏర్పాట్లపై ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పోలీసు అధికారులు, లారీ ఓనర్ల అసోసియేషన్ నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డి ఐజి మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు.

పోటెత్తిన భక్తి భావం

కొవ్వూరు, ఆగస్టు 6: కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో అంత్య పుష్కరాల ఏడో రోజు శనివారం క్షేత్రంలోని స్నానఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అత్యధిక సంఖ్యలో వేలాది మంది భక్తులు గోష్పాద క్షేత్రానికి విచ్చేసి పుణ్యస్నానమాచరించారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అధిక సంఖ్యలో పిండ ప్రదానాలు నిర్వహించారు. పెరిగిన యాత్రీకులను దృష్టిలో ఉంచుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గోదావరి వరద కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో గోష్పాద క్షేత్రంలోని అన్ని స్నాన ఘాట్లలో యాత్రీకులు, భక్తులు పుణ్యస్నానమాచరించారు.

అటు ఆరోపణలు... ఇటు విమర్శలు

విజయనగరం, ఆగస్టు 6: ఒకవైపు అధికారులు తన వినడం లేదని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆరోపణలు చేయడం, మరోవైపు అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని పాలకవర్గసభ్యులు విమర్శలు చేయడంతో మున్సిపాలిటీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తమ మాట వినడంలేదని, సక్రమంగా పనిచేయడంలేదని అధికారంలో ఉన్న నాయకులు ఆరోపణలు చేయడంతో అధికారులు అంతర్మథనంలో పడ్డారు. రెండేళ్ల నుంచి ఇవే ఆరోపణలు, విమర్శలు చేయడంతో వారు మనోవేదన చెందుతున్నారు. అధికారులు మారినా ఆరోపణలు, విమర్శలు చేయడం మానడంలేదు.

30 ఏళ్ల కల ఫలించింది

శృంగవరపుకోట, ఆగస్టు 6: రైతుల 30 ఏళ్ల కల ఫలించిందని మంత్రి మృణాళిని అన్నారు. మండలంలోని వేములాపల్లి వద్ద జగారం, అలుగుబిల్లి (జెఎ చానల్) కాలువ అభివృద్ధి పనులను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1270 ఎకరాలకు సాగునీరు అందించే జెఎ చానల్ పనులు స్థానిక ఎమ్మెల్యే కోళ్లలలితకుమారి కృషితో పూర్తయిందన్నారు. గ్రోయిన్, కాలువ అభివృద్ధి పనుల ఆవశ్యకతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి జపాన్ నిధులు నాలుగు కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు అయ్యేలా జిల్లా నేతలు కృషి చేశారని చెప్పారు. ఎన్నో రైతు కుటుంబాల్లో ఈ చానల్ ఆనందాన్ని నిపుతుందన్నారు.

Pages