S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విగ్రహ ఏర్పాటుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

అచ్చంపేట, ఆగస్టు 8: ప్రభుత్వ అమనుమతులు లేకుండా ఆస్తులను ధ్వంసం చేస్తూ విగ్రహాలను పెట్టేవారిపై, అందుకు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెదకూరపాడు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. గురువారం ఆయన గడప గడపకు వైసిపి కార్యక్రమంలో భాగంగా నీలేశ్వరపాలెం గ్రామంలో పర్యటించారు. మొదటగా స్థానికంగా విలేఖర్లతో మాట్లాడారు.

సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందించాలి

గుంటూరు (కార్పొరేషన్), ఆగస్టు 4: గుంటూరు నగర ప్రజలకు శుద్ధిచేసిన సురక్షితమై మంచినీటిని అందించేందుకు అధికారులు కృషి చేయాలని మంచినీటి సరఫరా వ్యవస్థను ప్రత్యేక పర్యవేక్షణ చేసేందుకు నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం కమిటీ సభ్యులైన పబ్లిక్ హెల్త్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజీనర్ కోటేశ్వరరావు, పి పరంధామయ్య, జోగారావు, రాధాకృష్ణ తదితరులు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నగరానికి మంచినీటిని సరఫరా చేసే తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్‌ను తనిఖీ చేశారు.

హోదా కోసం కొవ్వొత్తులతో కాంగ్రెస్ ర్యాలీ

మంగళగిరి, ఆగస్టు 4: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాలిగోపురం ఎదుట గల మహాత్మాగాంధీ విగ్రహం వరకు సాగింది. గాంధీకి వినతిపత్రం అందజేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జంజనం భిక్షారావు, జిల్లా కాంగ్రెస్ మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ సలీం మాట్లాడుతూ పార్లమెంట్‌లో 5వ తేదీ ప్రత్యేకహోదా బిల్లుకు అన్ని పక్షాలు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హతమార్చిన భర్త

తెనాలి రూరల్, ఆగస్టు 4: స్థానిక జయప్రకాష్‌నగర్‌కు చెందిన వేముల లక్ష్మీదుర్గ(30)ను ఆమె భర్త వెంకటకృష్ణ గురువారం సాయంత్రం సమయంలో రోకలి బండతో తలపై మోది హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం వెంకటకృష్ణ లక్ష్మీదుర్గకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 7 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సాయంత్ర సమయంలో భార్యను హతమార్చిన వెంకటకృష్ణ పిల్లలను అక్కడే వదలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్‌ఐ భాస్కరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు.

మన్యాన్ని వీడని ముసురు

భద్రాచలం, ఆగస్టు 4: మన్యాన్ని ముసురు వీడటం లేదు. గత నాలుగు రోజులుగా ఆకాశానికి చిల్లు పడ్డట్లుగా ఒకటే వాన. కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తంగా మారి స్తంభించింది. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. పాలెం, తాలిపేరు ప్రాజెక్టుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. తాలిపేరు ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి 21వేల 500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. పొంగిన వాగులు, ఉపనదుల నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.

ఏసీబీకి చిక్కిన సర్వేయర్

ఖానాపురం హవేలి, ఆగస్టు 4: ఖమ్మం సర్వే ల్యాండ్ రికార్డ్సులో పని చేస్తున్న మురళీ అనే సర్వేయర్ ఏసిబికి చిక్కారు. బోనకల్ మండలం కలకోట గ్రామానికి చెందిన కానూరి గోపీకృష్ణ అనే రైతు తన భూమిని రీ సర్వే చేయాలని మండల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే భూమిని సర్వే చేసే విషయంపై ఖమ్మంలోని సర్వే ల్యాండ్ రికార్డ్సు కార్యాలయంలో కలవాలని కోరటంతో ఆయన ఖమ్మంలో ఆ కార్యాలయంలోని అధికారులను సంప్రదించి రీ సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన అధికారులు సర్వే కోసం మురళీని కేటాయించగా, గోపీకృష్ణ మురళీని కలిసి త్వరగా సర్వే పూర్తిచేయాలని కోరారు.

పార్టీల మధ్య పోడు పోరు

ఖమ్మం, ఆగస్టు 4: అటవీ భూమిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై దాడులు చేస్తున్నారని, పంటను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. హరితహారం పేరుతో పేదల పొట్టలు కొడుతున్నారంటూ సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి, సిపిఐ, సిపిఎంలు క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆందోళనలు చేస్తున్నాయి. ఇది గత కొనే్నళ్ళుగా జరుగుతూనే ఉంది. కానీ ఇటీవల న్యూడెమోక్రసి నేతలు ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ చేసిన ఆందోళనలకు టిఆర్‌ఎస్ నేతలు స్పందించి న్యూడెమోక్రసి నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో పోడు పోరాటం కాస్త పార్టీల మధ్య పోరుగా మారింది.

నేడు హంద్రీనీవాకు నీరు విడుదల..

నందికొట్కూరు, ఆగస్టు 4 : కరవు కాటకాలకు నిలయమైన, తాగు, సాగునీరు అందక సతమతమవుతున్న రాయలసీమకు వరప్రదాయినిగా భావిస్తున్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను నేటి నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతమైన మహారాష్టల్రో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండడంతో వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తుంది. గురువారం నాటికి శ్రీశైల జలాశయంలో నీటిమట్టం 830 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టుకు వరద నీరు 73,870 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వుండగా 7,063 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో వుందని అధికారులు తెలిపారు.

ఆక్రమణలో రైల్వే స్థలం!

నంద్యాల, ఆగస్టు 4: నంద్యాల పట్టణ శివారులో కుందూనది ఒడ్డున రైల్వే శాఖకు చెందిన 22 ఎకరాల రైల్వే స్థలం కబ్జాదారుల చేతిలో ఆక్రమణకు గురైనా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు. రైల్వే స్థలంలో బడా బాబులు తిష్టవేసి దర్జాగా వరి సాగు చేసుకుంటున్నారు. ఈ స్థలానికి 130 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికి గుంటూరు డివిజన్ రైల్వే అధికారులు ఎన్ని సార్లు వారికి ప్రజల నుండి వినతులు అందినా స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే స్థలాన్ని పేద, మధ్యతరగతి ప్రజలు సాగుచేసుకోవడం లేదు. సంవత్సరమంతా కుందూనది ద్వారా నీరందే ఈ పొలంలో ఏడాదికి మూడు పంటలు పండుతాయి.

పనుల ప్రగతిని నివేదించాలి

విశాఖపట్నం, ఆగస్టు 4: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 9వ తేదీన జిల్లాలోని అరకు, పెదలబుడు గ్రామాల్లో పర్యటించనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు ఖరారైన తాత్కాలిక పర్యటన కార్యక్రమం ప్రకారం ముఖ్యమంత్రి తాను దత్తత తీసుకున్న గిరిజన గ్రామం పెదలబుడు సందర్శించే అవకాశం ఉందని, అరకులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకుల్లో పాల్గొంటారన్నారు. ఉదయం 11.30 గంటలకు చేరుకుని మధ్యాహ్నం వరకు అక్కడ ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రభుత్వ శాఖలన్నీ తాము ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన, చేపట్టనున్న కార్యక్రమాలపై నివేదిక అందించాలని ఆదేశించారు.

Pages