S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిష్కారం కాని వివాదాలు

పంధొమ్మిదవ శతాబ్దంలో ‘గెలివర్ ట్రావెల్స్’అనే నవల వచ్చింది. దానితో కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అది ఇంగ్లీషులో వుండడం వలన ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రాచుర్యాన్ని పొందింది. స్వాతంత్య్రానికి ముందు తరువాత కొంతకాలం మన దేశంలో హైస్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ విద్యార్థులకానవలను ఉపవాచకంగా పెట్టేవారు. దాని ప్రభావంతోనే కావచ్చును, పందొమ్మిదవ శతాబ్దం చివరలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు ‘వర్ధమానుని విదేశీయాత్రలు’ అనే నవల వ్రాసారు. అప్పట్లో, ఇది ఆంధ్ర దేశంలో మంచి ప్రాచుర్యాన్ని పొందింది.

- మనె్న సత్యనారాయణ

లక్ష్యం చేరని సమానవిద్య

ప్రజాస్వామ్యంలో సంక్షేమ సమాజ నిర్మాణం, విద్యావంతులైన పౌరులచేతనే సాధించబడుతుంది. అలాం టి సమాజంలో శాంతి, సుస్థిరత, సౌభా గ్యం హోదా నెలకొని ఉంటాయి. మారుతున్న సమాజంలో శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక రంగాలలో ప్రగతిని సాధించాలంటే ప్రతివారు సర్వసంపూర్ణమైన మూర్తిమత్వాభివృద్ధిని పొందాలి. విద్యా ప్రయోజనాలను, లక్ష్యాలను అవగాహన చేసుకొని గమ్యాలను చేరుకోవడానికి నిరంతర ప్రయత్నం చేయాలి. మనిషి మనిషిగా జీవించడానికి మానవ జీవిత సార్ధక్యానికి విద్య చాలా అవసరం.

-డాక్టర్ సరోజన బండ (విశ్రాంతాచార్యులు, ప్రభుత్వ ఉన్నతస్థాయి విద్యా అధ్యయన సంస్థ)

శ్రావణ మాస పూజలు ప్రారంభం

శ్రీకాకుళం(కల్చరల్), ఆగస్టు 4: ఇస్తినమ్మ వాయినం... పుచ్చుకుంటినమ్మ వాయినాం శ్రావణ మాసంలో ఈ మాటలు ప్రతీ ఇంటా మహిళల నోట వింటుంటాం. ఇది మహిళల మాసం.. పూజలు, వాయినాలతో ప్రతీ ఇళ్లు ఈ నెలంతా ఆధ్యాత్మిక శోభలో కళకళలాడుతుంటుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాల నిర్వహణకు మహిళలు ఇచ్చే ప్రాధాన్యం మాటల్లో చెప్పలేనిది. ఎంతో నిష్ట నియమాలతో ఈ పూజలు మహిళలకు పండగ వాతావరణమే. అతివలు తమ కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శ్రావణ మాస వ్రతాలు ఆచరిస్తారు. జిల్లాలో ప్రముఖ ఆలయాల సైతం శ్రావణ మాస శోభ సంతరించుకుంది.

మైనస్?

శ్రీకాకుళం: 150 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీకాకుళం మున్సిపాలిటీ రాష్ట్ర విభజన అనంతరం కార్పొరేషన్‌గా మారింది. పన్నుల భారాలు తప్ప పేదోళ్ళకు కావల్సిన వౌలిక సదుపాయాల కల్పనలో రెండేళ్ళ టిడిపి పాలనపై నగరవాసులు అసంతృప్తిగానే ఉన్నారు. నగర పాలక సంస్థకు డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రతికూల ఫలితాలు వెలువడతాయన్న సర్వే ఫలితాలతో టిడిపికి మైనస్ మార్కులే వచ్చినట్టు తెలుస్తోంది.

మంత్రి ఆఫీసు ముట్టడి

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 4: జిల్లాలో కార్మిక హక్కులను కాలరాస్తూ పరిశ్రమ యాజమాన్యాలు తమ ఇష్టాను సారం వ్యవహరిస్తున్నాయని, అయినప్పటికీ కార్మిక శాఖ మంత్రి పట్టించుకోపోవడం అన్యాయమంటూ సిఐటియు నేతృత్వంలో కార్మికులు గురువారం కదం తొక్కారు. ఉదయం వందలాది మంది కార్మికులు సిటు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సమావేశమై అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేసారు.

ప్రజలను మోసం చేస్తున్న టిడిపి, బిజెపి

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 4: విభజన నేపథ్యంలో యుపిఎ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రకటించిన హోదాతో పాటు అనేక అంశాలపై తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి విమర్శించారు. గురువారం రాష్టవ్య్రాప్త నిరసనల్లో భాగంగా స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్ నుండి పాత బస్టాండ్ పొట్టి శ్రీరాముల కూడలి వరకు కళ్లకు గంతలు కట్టుకొని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరజీవి విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

కాశీబుగ్గ హాస్టళ్ళలో ఎసిబి తనిఖీలు

పలాస, ఆగస్టు 4: కాశీబుగ్గలోని పోస్టుమెట్రిక్ హాస్టల్, బాలల వసతి సంక్షేమ గృహంలో గురువారం ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందిన ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు కాశీబుగ్గలోని హాస్టల్‌కు సంబంధించి వార్డెన్ గురువులు ఇంటి వద్దకు వేకువజామున అయిదు గంటలకు చేరుకొని ఆయనతో హాస్టల్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థుల సంఖ్యతోపాటు బియ్యం, ఇతర సామగ్రిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులు నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రౌడీయిజంపై ఉక్కుపాదం: ఎస్పీ

మందస, ఆగస్టు 4: భూదందాలు, రౌడీయిజం చేస్తే ఉక్కుపాదంతో అణగదొక్కుతామని జిల్లా ఎస్పీ బ్రహ్మరెడ్డి హెచ్చరించారు. గురువారం మందస పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలోని మావోయిస్టుల ప్రభావం లేదని, ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒడిశా, గిరిజన గ్రామాలు అనించి ఉండడంతో సారా అమ్మకాల కేంద్రాలు ఉన్నాయన్నారు. వాటిని నివారించేందుకు చర్యలు చేపడతామన్నారు.

గర్భిణులకు పౌష్టికాహారం అవసరం

జలుమూరు, ఆగస్టు 4: ప్రతీ గర్భిణీ బలమైన పౌష్టికాహారం వాడాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. జలుమూరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం అంగన్వాడీ ఏర్పాటు చేసిన సీమంతాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గర్భిణులకు మంచి ఆహారం అందించడం ద్వారా శిశుమరణాలు తగ్గుతాయని, దీనిని దృష్టిలో ఉంచి ప్రభుత్వం ప్రతీ అంగన్వాడీ కేంద్రానికి పౌష్టికాహారాన్ని అందిస్తుందని దీనిని ఆ గ్రామాల్లో గర్భిణులకు, పిల్లలకు సక్రమంగా వినియోగించాలని ఆయన సూచించారు.

బాబు మోసాలపై తిరగబడండి

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 4: అమలు కాని హామీలతో అధికారం చేపట్టి రెండేళ్లు అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలపై ప్రజలు తిరగబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.

Pages