S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంజునాథ్ కమిషన్ ఎదుట బిసిల ఆందోళన

విజయవాడ, జూలై 22: కాపులను బిసిల్లో చేర్చవద్దంటూ స్థానిక మంజునాథ్ కమిషన్ ఎదుట పలు బిసి సంఘాలు శుక్రవారం ఆందోళన జరిపాయి. అమలాపురం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బిసి సంఘాలు శుక్రవారం విజయవాడ చేరుకున్నాయి. స్థానిక బెంజ్ సర్కిల్ దగ్గరున్న మంజునాథన్ కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశాయి. ఒక దశలో కార్యాలయంలోకి దూసుకువెళ్లడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరువాత బిసి సంఘాల నాయకులు మంజునాథ కమిషన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాయి.

సర్వే వేగవంతం చేయాలి

కాకినాడ, జూలై 22: జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా సాధికార సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సర్పవరంలో సర్వేను పరిశీలించారు. కొన్ని సందర్భాలలో సర్వర్ డౌన్‌లోడ్ కావడంతో డేటా నమోదు కావడం లేదని సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. రూరల్ తహసీల్దారు జె సింహాద్రి సర్వే వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు. శుక్రవారం మండలంలో 138 గృహాలకు చెందిన 410 వ్యక్తుల వివరాలను సేకరించగా ఇప్పటివరకు మండలంలో 4వేల మంది వివరాలను సేకరించినట్లు కలెక్టర్‌కు తెలిపారు.

పిడుగుపాటుకు మహిళ మృతి

రంపచోడవరం, జూలై 22: మండలంలోని చుప్పరిపాలెం గ్రామంలో పిడుగుపాటుకు ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. రంపచోడవరం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు శివరామకృష్ణ, బాధితుల బంధువులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. శుక్రవారం చుప్పరిపాలెం గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దుంప తోటలో గొప్పు పనులు చేయడానికి వెళ్లిన మహిళలు వర్షానికి పొలం సమీపంలోని చెట్టు కిందకు చేరారు. అదే సమయంలో ఆ ప్రదేశంలో పిడుగు పడటంతో వెనుమల లక్ష్మి (40) అక్కడికక్కడే మృతి చెందింది. వెనుమల పెంటమ్మ, వేట్ల మంగాయమ్మ, వేట్ల అచ్చియ్యమ్మ తీవ్ర గాయాలపాలయ్యారు.

అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ గ్రామాలు

సామర్లకోట, జూలై 22: అందరి భాగస్వామ్యంతో బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ కోరారు. సామర్లకోట టిటిడిసి జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో గ్రామాలను స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా పరిధిలో ఎంపిక చేసిన 333 గ్రామాలకు చెందిన ఎంపిడిఒలు, ఇవోపిఆర్డీలు, సర్పంచ్‌లకు మూడు రోజులు ఇవ్వనున్న శిక్షణా తరగతులను శుక్రవారం జడ్పీ సిఇవో కె పద్మ అధ్యక్షతన ప్రారంభించారు.

పార్టీలకు స్థలాలపై చిత్రమైన జిఒ

కాకినాడ రూరల్, జూలై 22: రాజకీయ పార్టీలకు రాష్ట్రంలో స్థలాలు కేటాయించడం కోసం చంద్రబాబు సర్కార్ చిత్రమైన జీవోను తెచ్చిందని విమర్శించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు కాకినాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ జీవో మాటున టిడిపి తమ పార్టీకి పెద్ద ఎత్తున భూములు కేటాయింపు చేసుకునే కార్యక్రమం చేపట్టిందని ఆరోపించారు. అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని బట్టి స్థలాలను కేటాయించడం హాస్యస్పదమని, ఇది ఏ రకంగా శాస్ర్తియమో తెలిపాలని డిమాండు చేశారు. టిడిపి సర్కార్‌కు భూములపై ఉన్న ప్రేమ.. పేద ప్రజలకు ఇళ్లు కట్టించే విషయంలో ఎందుకు లేదని ప్రశ్నించారు.

వివక్ష లేని అభివృద్ధి

రాజమహేంద్రవరం, జూలై 22: తన హయాంలో నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో రూ. 135.07కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మేయర్ పంతం రజనీశేషసాయి వెల్లడించారు. అభివృద్ధిలో ఎక్కడా వివక్షతకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ పాలకవర్గ హయాంలో రాజమహేంద్రవరం అభివృద్ధిపథంలో పయనిస్తోందని, పారదర్శకంగా పాలన సాగుతోందన్నారు. ఆదాయ సాధన, అభివృద్ధి విషయంలో నగరపాలక సంస్థ వృద్ధిని సాధించిందన్నారు.

75 కిలోల గంజాయి పట్టివేత

శంఖవరం, జూలై 22: గంజాయిని కారులో తరలిస్తుండగా అన్నవరం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విశాఖ జిల్లా మాడుగుల నుండి 75 కేజీల గంజాయిని కారులో తరలిస్తుండగా అన్నవరం పిఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. కారుతోపాటు ఎం శ్రీను, సూర్యనారాయణ, వెంకట్రావు అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని శనివారం కోర్టుకు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

గోదావరిలో గుర్తుతెలియని మహిళల మృతదేహాలు ?

కాట్రేనికోన, జూలై 22: కుండలేశ్వరం గౌతమీ గోదావరిలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గుర్తుతెలియని ఇద్దరు మహిళలు తల్లీ, కూతుళ్లుగా భావిస్తున్నారు. ఇద్దరు బుధవారం రాత్రి నుండి వీరి మృతదేహాలు గోదావరి నీటిలో తేలియాడుతుండటంతో స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేసినట్టు చెబుతుండగా పోలీసులు మాత్రం తమకు ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.

విజయవాడ తరలివెళ్లిన ఆదిరెడ్డి

రాజమహేంద్రవరం, జూలై 22: వైఎస్సార్‌సిపి నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన పరివారం శుక్రవారం అట్టహాసంగా విజయవాడకు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆదిరెడ్డి, ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉదయం ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీగా విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఇందుకోసం పలువార్డుల నుంచి బస్సులు, కార్లలో జన సమీకరణ చేశారు.
వైసిపికి నాపై నమ్మకం లేదు

రైతులందరికీ పూర్తిస్థాయలో పరిహారం

గొల్లప్రోలు, జూలై 22: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చేపట్టనున్న బైసాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లిస్తామని అదనపు జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించిన భూమి రికార్డులు, పాస్‌బుక్‌లను ఆయన పరిశీలించారు. జాతీయ రహదారి విస్తరణ మొదటి విడతకు సంబంధించి భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. రికార్డులు పెండింగ్‌లో ఉన్న రైతులు, రీ సర్వేకు దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడ త్వరలోనే పరిహారం చెల్లిస్తామని జెసి చెప్పారు.

Pages