S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది మార్కెట్‌లో అడుగుపెట్టిన స్కిప్పర్

హైదరాబాద్, జూలై 22: పాలిమర్ పైపుల ఉత్పత్తి రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన స్కిప్పర్ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా హైదరాబాద్‌లో పాలిమర్ పైపుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ డైరెక్టర్ దేవేష్ బన్సల్ తెలిపారు. మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారంలో 2.25 ఎకరాల విస్తీర్ణంలో ప్లంబింగ్, వ్యవసాయ పైపుల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పామని, వంద మంది ఉద్యోగులను నియమించామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాలిమర్ పైపులను తయారు చేస్తామని, దేశీయ టెక్నాలజీతో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు.

అంధకారంలో అంజనగిరి

వనపర్తి, జూలై 22: వనపర్తి మండలం అంజనగిరి గ్రామంలో విద్యుత్ లైనుకు అంతరాయం కలిగిస్తున్నారన్న నెపంతో ఏకంగా విద్యుత్ అధికారులు ఆ గ్రామానికే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, గ్రామస్తులు డిఇ ఇంటి ముందు బైఠాయించారు. రైతులకు పగలే 9 గంటల విద్యుత్‌ను ఇవ్వాలన్న ఉద్దేశంతో అంజనగిరి గ్రామం నుండి పాన్‌గల్ మండలానికి అదనపు లైనును వేయడానికి అధికారులు విద్యత్ పోల్‌లను పాతారు. అయితే ఒడ్డు వెంట కాకుండ తమ పంటపొలాల్లో మధ్యలో లైను వేయడంవల్ల ప్రమాదాలు జరుగుతాయని, తమ పంటపొలాల్లో తమ అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారని ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు.

గద్వాలకు అర్హత లేదని కెసిఆర్ పుష్కర స్నానం చేసి చెప్పాలి

అలంపూర్, జూలై 22: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.16,500కోట్ల మిగులు బడ్జెట్ మిగిలించిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో ఉందని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్‌లు అన్నారు. గద్వాల జిల్లా సాధనకై జములమ్మ నుంచి జోగుళాంబదేవి ఆలయం వరకు చేస్తున్న పాదయాత్ర 4వ రోజు శుక్రవారం అలంపూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్‌లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నడిగడ్డ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడతాయని ఆశించినా అడియాశలుగానే మిగిలియాని తెలిపారు.

ఒక్కరోజులోనే పాన్, టాన్!

న్యూఢిల్లీ, జూలై 22: పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్), ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ (టాన్)లను ఇక ఒక్కరోజులోనే సంస్థలు పొందవచ్చు. అవసరమున్న సంస్థలు డిజిటల్ సిగ్నేచర్ సర్ట్ఫికెట్ ఆధారిత దరఖాస్తును సమర్పిస్తే చాలు.. 24 గంటల్లోనే పాన్, టాన్ రిజిస్ట్రేషన్ అందుతుంది. వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంలో భాగంగానే ఈ సంస్థాగత మార్పు అని ఆదాయ పన్ను శాఖ శుక్రవారం తెలిపింది. మరోపక్క వ్యక్తిగతంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారికీ మార్గం సుగమం చేసింది ఆదాయ పన్ను శాఖ. ఆధార్ ఆధారిత ఈ-సిగ్నేచర్ సదుపాయం ద్వారా పాన్ కార్డును పొందే వెసులుబాటును కల్పించింది.

క్షీణించిన యాక్సిస్ బ్యాంక్ లాభం

ముంబయి, జూలై 22: దేశీయంగా ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 21 శాతం క్షీణించి 1,555.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 1,978.44 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 13,852.1 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 12,234.41 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, మొండి బకాయలు పెరగడమే తాజా లాభాల పతనానికి కారణమని శుక్రవారం బ్యాంక్ తెలియజేసింది.

జిఎస్‌టిపై ఆశాభావంతో..

ముంబయి, జూలై 22: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 92.72 పాయింట్లు పుంజుకుని 27,803.24 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 31.10 పాయింట్లు పెరిగి 8,541.20 వద్ద నిలిచింది.
ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి గురువారం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ప్రకటించిన ఆర్థిక ఫలితాలు బాగుండటంతో శుక్రవారం ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి.

మహాపాదయాత్ర ప్రారంభం

మక్తల్, జూలై 22: జిల్లాలో పూర్తిగా వెనుకబడిన మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరందించే జిఓ.నెం 69 ప్రకారం వెంటనే నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల జలసాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మక్తల్ మండల పరిధిలోని భూత్పూర్ రిజర్వాయర్ నుండి చేపట్టిన మహాపాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

నాటి ప్రాజెక్టులకే నేడు ప్రారంభోత్సవాలు

షాద్‌నగర్, జూలై 22: గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే మొదలుపెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టులనే నేడు టిఆర్‌ఎస్ మంత్రులు ప్రారంభిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లురవి విమర్శించారు. శుక్రవారం బాలానగర్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కొయిల్‌సాగర్ ప్రాజెక్టులను మొదలుపెట్టి ప్రజలకు నీరు అందించడం జరిగిందని, అయితే నేడు టిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆయా ప్రాజెక్టులకు కొత్త పేర్లు పెడుతూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు.

పుష్కర ఘాట్లకు యాత్ర

మహబూబ్‌నగర్, జూలై 22: కృష్ణా పుష్కరాల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంది. అందులో బాగంగా శుక్రవారం జిల్లా యంత్రాంగం కృష్ణా పుష్కరాల ఘాట్లవైపు యాత్రతో బయలుదేరారు. అదేవిధంగా మంత్రులు సైతం పుష్కరాల పనులపై దృష్టిపెట్టి కృష్ణానది తీరాన పర్యటించారు. అన్ని పుష్కర ఘాట్ల వద్ద వాహనాల పార్కింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి పుష్కర ఘాట్ వద్ద పూజలు నిర్వహించేందుకు, పిండ ప్రధానాలు చేసేందుకుగాను ముందుగానే పూజారులను గుర్తించి ఘాట్ వారిగా జాబితా తయారు చేయాలని కూడా తెలిపారు.

రాకెట్ స్పీడ్‌తో ‘పాలమూరు’ పూర్తి చేస్తాం

కొత్తకోట, జూలై 22: ఆంధ్ర నాయకులు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి సుప్రీం కోర్టులో కేసు వేస్తే కేసు పాలమూరుకు అనుకులంగా వచ్చిందని రాకేట్ స్పీడుతో పాలమూరు ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని భీమా లిఫ్ట్-2 టన్నల్ 1 వద్ద మోటార్లను రన్ చేసి నీటిని విడుదల చేశారు.

Pages