S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రత్యేక హోదాపై కెవిపి బిల్లుకు మద్దతిచ్చి చిత్తశుద్ధి చాటుకోండి

తిరుపతి, జూలై 21: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకావాలంటూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రారావురాజ్యసభలో శుక్రవారం ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇచ్చి బిజెపి, టిడిపి, వైసిపిలు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రానికి ప్రత్యేక సాధన కల్పించాలంటూ కాంగ్రెస్ ఎంపి రామచంద్రరావు ప్రైవేటు బిల్లును ప్రవేశపెడుతున్న విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించి రాజ్యసభలో అన్ని పార్టీలు కెవిపి బిల్లుకు మద్దతివ్వాలని నినాదాలు చేశారు.

బరితెగిస్తున్న ఎర్రకూలీలు

తిరుపతి, జూలై 21: చట్టాలను కఠినతరం చేసినా ఎర్రకూలీలు మాత్రం ఏమాత్రం వెనకంజ వేయకుండా అడవుల్లో ఎర్రచందనం చెట్లను కొట్టడానికి తరలి వస్తున్నారు. కూలీలుగా వస్తున్నవారిలో ఎక్కువ శాతం ఎర్రకూలీలు ఉండటం చట్టాలు కఠిన తరం చేసిన అంశం వారికి అవగాహన లేకపోవడంతో వస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి సమీపంలోని శేషాచల అడవుల్లో గురువారం తెల్లవారుజామున కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ఎర్రకూలీలు రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో కానిస్టేబుల్ దిలీప్‌కుమార్ గాయపడ్డాడు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకాల్పులు జరిపారు.

తిరుమలలో దళారికి సహకరించిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదు

తిరుమల, జూలై 21: శుపథం వద్ద విలేఖరి పేరుతో ఓ దళారి రాజు కలర్ జిరాక్స్ ఆర్జిత సేవా టిక్కెట్లతో అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో దళారికి సహకరించిన ముగ్గురు టిటిడి ఉద్యోగులపై గురువారం ఒన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో జూనియర్ అసిస్టెంట్ గురుమూర్తి, అటెండరు ప్రకాష్‌లను సస్పెండ్ చేస్తూ టిటిడి ఇఓ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఉద్యోగికి ఈ కేసులో ఎలాంటి సంబంధం ఉన్నాయనే విషయంపై విచారణ చేస్తున్నారు.

మాయదారి టిబి!

కుప్పం, జూలై 21: ఇరవై రోజుల్లో తల్లి, కుమారుడు టిబివ్యాధితో మృతి చెందిన సంఘటన గుడుపల్లి మండల పరిధిలోని బిజిగానిపల్లి గ్రామంలో జరిగింది. తిమ్మప్ప భార్య తిమ్మక్క (42) గురువారం ఉదయం టిబి వ్యాధితో ఇంటి వద్దనే మృతి చెందింది. ఆమె కుమారుడు మునికృష్ణ(18) ఈనెల 1వ తేదిన టిబి వ్యాధితో మృతి చెందాడు. కేవలం ఇరవై రోజుల్లోనే తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మరోవైపు తిమ్మక్కకు పిన్నమ్మ వరుస అయిన తిమ్మక్క ఆమె కుమారుడు హంసగిరి 16నెలల క్రితం టిబి వ్యాధితో ఇదే గ్రామంలో మృతి చెందారు. ఈ నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు.

నిబంధనల ప్రకారమే ఒప్పంద అధ్యాపకుల పోస్టుల భర్తీ

తిరుపతి, జూలై 21: టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే ఒప్పంద అధ్యాపక పోస్టుల నియామకాలు చేపడతామని టిటిడి జె ఇ ఓ పోలాభాస్కర్ తెలిపారు. గురువారం ఆయన తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి ఆధ్వర్యంలో 3 డిగ్రీ కళాశాలలు, 2 జూనియర్ కళాశాలలు, ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయన్నారు. వీటిలో ఒప్పంద అధ్యాపకుల పోస్టులను భర్తీచేసేందుకు ఇటీవల ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ టిటిడికి ఇచ్చిన సూచనల మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అమలుచేస్తూ నియామకాలు చేపడుతున్నామన్నారు.

అధికారుల వేధింపులు తాళలేక ఒప్పంద ఉద్యోగి బలవన్మరణం

మదనపల్లె, జూలై 21: రెండేళ్ళుగా పాలకమండలి, మున్సిపల్ అధికారులు వేధింపులు ఎక్కువైయ్యాయి. రూ.300లతో చేరిన తాను 18సంవత్సరాలుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా తనపై అపనిందలు వేసి, ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంతటితో ఆగకుండా నా ఉద్యోగం మరొకరికి రూ.5లక్షలకు అమ్ముకున్నారు. పెద్దపెద్ద వాళ్ళవద్దకు వెళ్ళి బతిమలాడినా ఫలితం లేకపోయింది. 18ఏళ్ళు తలెత్తి తిరిగిన నేను గత నెలరోజులుగా తలదించుకుని తిరుగుతున్నా.. పలుమార్లు మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌లను బతిమలాడినా ఫలితం లేక, ఏమి చేయలేక నిశ్సహాయస్థితిలో వెళ్ళిపోతున్నాను. దయచేసి నాలా మరొకరిని బలిచేయకండి..

అప్పలాయగుంటలో ఘనంగా పుష్పయాగం

పుత్తూరు, జూలై 21: టిటిడి అనుబంధ ఆలయంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం అత్యంత వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం , విశేష అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ తులసి, చామంతి, గనే్నరు, మొగలి, సంపంగి, రోజా కలువలు వంటి 16 రకాలకు చెందిన మూడున్నర టన్నులు బరువు కలిగిన పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. ఆధ్యాంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించారు.

తిరుపతిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

తిరుపతి, జూలై 21: నగర పాలక సంస్థ పరిధిలోని 37,39 వార్డులలో తాగునీటి పైప్‌లైన్‌ను, యుడిఎస్ లైను, శ్మశానవాటికలో కర్మక్రియల భవననిర్మాణం అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. సుమారు రూ.26 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు బి. చంద్రశేఖర్, చంద్రశేఖర్, శంకర్‌రెడ్డి, జన్మభూమి కమిటీ మెంబర్ నరసింహయాదవ్, దంపూరి భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్‌పల్స్ సర్వేని అంకితభావంతో నిర్వహించాలి

చిత్తూరు, జూలై 21: ప్రజాసాధికారత సర్వేని అంకితభావంతో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సర్వేపై జిల్లా అధికార యంత్రాగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వేవల్ల ప్రజల్లో అనేక అపోహలు ఉన్నట్లు సమాచారం వస్తున్నదని, ఈఅపోహలు తొలగించాలని అన్నారు. అదనంగా అర్హులకు అనేక సంక్షేమ ఫలాలు అందుతాయన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. దీనిపై పలుచోట్ల రకరకాలు వదంతులు వస్తున్నాయని వీటికి ఆదిలోనే చెరమగీతం పాడాలన్నారు.

సౌమ్యనాథస్వామి ఆలయంలో ఘనంగా ధ్వజావరోహణం

నందలూరు, జూలై 21:నందలూరు సౌమ్యనాథాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం బ్రహ్మోత్సవాలు ముగిశాయనేందుకు చిహ్నంగా ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో ధ్వజావరోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులకు ఉభయదారులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకీపై కూర్చుండబెట్టి భక్తులు పాల్గొనగా వసంతోత్సవానికి బయలుదేరారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కోలాహలంగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఈ ఉత్సవంలో తొలుత కోనేరు స్వామివారికి చక్రస్నానం ఒనర్చారు. భక్తులు కూడా పాపాలు హరిస్తాయని కోనేటిలో మునకలేశారు.

Pages