S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకుండా...వంశధార పనులా?

శ్రీకాకుళం(టౌన్), జూలై 19: జిల్లాలోని వంశధార నిర్వాసితుల పునరావాసం వంటి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉండగా పనులు ప్రారంభించాలంటూ ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర మంత్రి ఆదేశించడంలో అర్థం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేసి వారిని భయబ్రాంతులను గురిచేసే విధంగా ప్రశ్నించిన వారికి ప్రభుత్వ సత్తా చూపిస్తామని అనడం మంత్రి నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు.

మహిళలు బలీయమైన శక్తిగా రూపొందాలి

రాజాం, జూలై 19: స్వయంశక్తి సంఘాల ద్వారా మహిళలు బలీయమైన శక్తిగా తయారవ్వాలని మెప్మా మిషన్ డైరెక్టర్ చినతాతయ్యలు హితవు పలికారు. మంగళవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ఆర్‌టిలు, ఎస్ ఎల్ ఎఫ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రోజూ సంఘాల పనితీరుపై ఆర్‌టిలు, ఎస్‌ఎల్ ఎఫ్‌లు దృష్టిసారించాలని, నెలవారి సమావేశాలు నిర్వహించి వెనుకబడ్డ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. స్వయంశక్తి సంఘాలు ద్వారా కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవాలని, జీవన ప్రమాణాలు పెంపొందించుకోవాలన్నారు.

అక్షరాస్యతపై అవగాహన తప్పనిసరి

గార, జూలై 19: మండలం బూరవెల్లి గ్రామంలో స్థానిక సర్పంచు మళ్ల ఆగ్నేయ ఆధ్యర్యంలో శ్రీకాకుళం రూరల్ మం డలం కరజాడలో గల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వారు అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

డబుల్.. ట్రబుల్..!

కరీంనగర్, జూలై 19: కొన్ని ప్రాంతాల్లో స్థలాలు దొరకడం కష్టంగా ఉంటే.. స్థలాలు దొరికిన ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ట్రబుల్ ఎదుర్కొంటోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చి రాష్ట్రంలో అధికారంలో చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అడుగులేసినా.. ముందుకు కదలడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో కాంట్రాక్టర్లు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం జిల్లాలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. సిఎం కెసిఆర్ దత్తత గ్రామం మినహా జిల్లాలో ఏ ఒక్క చోట కూడా ఇళ్ల నిర్మాణాలు మొదలుకాలేదు.

హరితహారం లక్ష్యాలను సాధించాలి

కరీంనగర్, జూలై 19: హరితహారం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) రాజీవ్‌శర్మ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ రాజీశ్ శర్మ మాట్లాడుతూ మొక్కలు నాటడాన్ని వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలలో టేకు, పండ్ల మొక్కలకు డిమాండ్ ఉందని, అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్‌లు టేకు పండ్ల మొక్కల కొనుగోలుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ముందుగా ప్రభుత్వ నర్సరీలలో ఉన్న మొక్కలు నాటడం పూర్తయిన తరువాత ప్రైవేటు నర్సరీలలోని మొక్కలను కొనుగోలు చేయాలని సూచించారు.

టిఎంయు విజయకేతనం

కరీంనగర్, జూలై 19: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎంయు) జోరు కొనసాగింది. జిల్లాలో 11డిపోలుండగా, 10డిపోల్లో టిఎంయు విజయం సాధించింది. అలాగే కరీంనగర్ నాన్ ఆపరేషన్ జోన్‌లో రెండు స్థానాలుంటే ఆ రెండింటిని కైవసం చేసుకుంది. టిఎంయుకు ప్రధాన పోటీ ఇచ్చిన ఎంప్లాయిస్ యూనియన్ (టియు) ఒకే ఒక స్థానం వేములవాడతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంగళవారం జిల్లాలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారిగా ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఉదయం 5గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగగా, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు.

ఫీజుల నియంత్రణలో సర్కార్ విఫలం

కరీంనగర్ టౌన్, జూలై 19: గత కొంతకాలంగా రాష్ట్రంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చడంలో, విద్యా రంగంలో నెలకొన్న సవాళ్ళను అధిగమించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు విమర్శించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చింతకుంట మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులను వాడుకున్న కెసిఆర్ అధికారంలోకి రాగానే వారిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.

ప్రచారం ఫుల్.. సంక్షేమం నిల్

ధర్మపురి, జూలై 19: కెసిఆర్ ప్రభుత్వం ప్రచారానికి, ఇతర పార్టీల నుండి వలసల ప్రోత్సాహానికి ఇచ్చినంత ప్రాధాన్యత, ప్రజా సంక్షేమానికి ఇవ్వడం లేదని మాజీ మంత్రి డి.శ్రీ్ధర్‌బాబు ధ్వజమెత్తారు. మంగళవారం దైవ దర్శనానికై ధర్మపురికి విచ్చేసిన ఆయన నియోజకవర్గ ముఖ్య నేతల, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లాగౌడ్ అధ్యక్షతన, జడ్పీ మాజీ చైర్మన్ లక్ష్మణ్‌కుమార్ అతిథిగా నిర్వహించిన సమావేశంలో శ్రీ్ధర్‌బాబు మాట్లాడారు. డబుల్‌బెడ్ రూం, ఎకరాలు దళితులకు పంపిణీ, ఉచిత విద్య, 12శాతం మైనారిటీ రిజర్వేషన్ల వంటి ఎన్నికల వాగ్ధానాలను మరిచారని విమర్శించారు.

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి

సిరిసిల్ల, జూలై 19: నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామస్థులదేనని ఎస్పీ జోయల్ డేవిస్ పిలుపునిచ్చారు. మంగళవారం పోలీసు శాఖ దత్తత తీసుకున్న సిరిసిల్ల మండలం చిన్నిలింగాపూర్‌లో ఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసులు ఇక్కడ పునరుద్ధరించిన ఎల్లమ్మ చెరువు వద్ద హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఇక్కడ జరిగిస సమావేశంలో జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ నాటిన ప్రతీ మొక్కను రక్షించుకోవాలని, ఇది అందరి బాధ్యతగా పేర్కొన్నారు.

ప్రతి నీటి చుక్క వినియోగంలోకి తీసుకువస్తాం

పెద్దపల్లి రూరల్, జూలై 19: వర్షపు నీరు వృథా పోకుండా తగిన ఏర్పాట్లు చేసి, ప్రతి నీటి చుక్కను వినియోగంలోకి తీసుకు వస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి గ్రామ సమీపంలోని గుట్ట వద్ద గల పులిమడుగు (పులి గుండం) ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలసి మంత్రి మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ పులి మడుగు గుట్టల నుంచి వస్తున్న వరద నీరు వృథా పోకుండా చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టి పంట పొలాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Pages