S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో ఐదు రోజులు 144సెక్షన్ అమలు

జనగామ టౌన్, జూలై 5: జనగామ జిల్లా కోసం చేస్తున్న ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. నిత్యం తనిఖీలు తీవ్రతరం చేస్తూ పట్టణంలోని గల్లీల్లో సైతం పోలీసులు గస్తీలు ముమ్మరం చేస్తున్నారు. గత ఐదు రోజుల కిందట జనగామలో విధ్వంస సంఘటనలు చోటుచేసుకున్నప్పటి నుంచి పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కళాశాలల వద్ద, బస్టాండ్‌లో, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బందోబస్తు నిర్వహిస్తూ ప్రజల్ని గుంపులుగుంపులుగా ఉండకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. భాష్పవాయువు ప్రయోగించే వజ్ర వాహనం ద్వారా పట్టణంలో 144సెక్షన్ అమలుపై ప్రచారం నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ

వడ్డేపల్లి, జూలై 5: త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య హక్కులను, నిజాం నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభాపతి అసెంబ్లీలోని తెలుగుదేశం పార్టీ శాసనభ కార్యాలయాన్ని ప్రభుత్వం లేకుండా చేయడం ప్రజాస్వామ్యంలో తీరనిమచ్చగా అభివర్ణించారు.

జనగామ జిల్లా ఏర్పాటుపై సిఎం నోరు విప్పాలి

వరంగల్, జూలై 5: వరంగల్ జిల్లాలో రెండవ అతిపెద్ద పట్టణంగా ఉన్న జనగామ జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రి కెసిఆర్ నోరువిప్పాలని పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేసారు. జనగామ జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా బస్సు దగ్ధం కేసులో వరంగల్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైధీలుగా ఉన్న జెఎసి నాయకులను ఆయన మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జనగామను మొదటి జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పడు జనగామను యాదాద్రిలో కలుపుతానని చెప్పడం పట్ల ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు.

అంగరంగ వైభవంగా శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

వరంగల్, జూలై 5: వరంగల్ భద్రకాళి ఆలయంలో మంగళవారం నుంచి శాకాంబరి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయుల రాజధాని ఏకశిల నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా లోకాన్ని తన కరుణాకటాక్షాలతో అనుగ్రహిస్తున్న శ్రీ భద్రకాళీ అమ్మవారి సన్నిధానంలో ఏటా ఆషాఢమాసంలో అత్యంత వైభవంగా శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

మోదీ లాంటి ఏకవ్యక్తి పాలన ఎక్కడా లేదు

దేవరకొండ, జూలై 5: ప్రధాని నరేంద్రమోదీ లాంటి ఏకవ్యక్తి పాలన ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగడం లేదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం దేవరకొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన మంత్రి వర్గంలోని ఏ మంత్రికి పని చేసే అవకాశం కల్పించకుండా అసమర్ధులను మంత్రి వర్గంలో నుండి తొలగించి సమర్ధులకు మత్రివర్గంలో స్ధానం కల్పించానని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దళితులను కుక్కలతో పోల్చిన వికె సింగ్‌ను మోడీ ఎందుకు మంత్రి వర్గం నుండి తొలగించలేదని ఆయన ప్రశ్నించారు.

భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తున్న టి.సర్కార్: తమ్మినేని

నల్లగొండ, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో భూసేకరణ చేస్తు నిర్వాసితులకు తగిన పరిహారం, పునరావాసం కల్పించకుండా అన్యాయం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. మంగళవారం నల్లగొండలో ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు ఇప్పటికే పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో 5లక్షల ఎకరాల భూసేకరణ చేసిందన్నారు. భూనిర్వాసితులకు న్యాయం చేయాలని ఉద్యమిస్తే తమపై ప్రాజెక్టులకు వ్యతిరేకమంటు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు.

చీదేళ్లలో విషాదఛాయలు

పెన్‌పహాడ్, జూలై 5: మండలపరిధిలోని చీదేళ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మంగళవారం తెల్లవారుజామున చివ్వెంల మండలపరిధిలోని గుంజలూరు స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది. ప్రమాద వార్త తెలుసుకున్న మృతుల బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఎస్సారెస్పీ రెండో దశ పనులు పూర్తి చేయాలి

నల్లగొండ, జూలై 5: శ్రీరాంసాగర్ రెండో దశ(ఎస్సారెస్పీ) కాలువ పొడగింపులో అసంపూర్తి పనులన్నింటిని పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్సారెస్పీ రెండో దశ పనులను ఆయన సమీక్షించారు. రెండో దశ పనుల్లో ఇంకా సేకరించాల్సిన భూముల వివరాలను, సేకరణలో ఎదురవువుతున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ కింద 9వేల ఎకరాల భూసేకరణకు ఇంకా 180ఎకరాలు మాత్రమే సేకరించాల్సివుందని అధికారులు వివరించారు.

సిఎం పర్యటనను విజయవంతం చేయాలి

చౌటుప్పల్, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 8న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటన ఏర్పాట్లను మంగళవారం మంత్రి పరిశీలించారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి మొక్కను నాటే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. గోదాం ప్రారంభోత్సవానికి శిలాఫలకం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని సూచించారు.

మల్లన్న సాగర్‌పై దండెత్తిన ప్రజా సంఘాలు

సంగారెడ్డి, జూలై 5: మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్దంటూ భూ నిర్వాసితులు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు తెలిపేందుకు వివిధ ప్రజాసంఘాల నాయకులతో తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తొగుట మండలం వేములఘాట్ గ్రామానికి తరలివచ్చారు. మంగళవారం ‘మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదన - ఒక చర్చ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. జెఎసి నేతలతో పాటు న్యాయవాదుల జెఎసి నాయకులు, రైతు సంఘాల నాయకులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, ఇతర జిల్లాల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Pages