S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి కోటకు రోప్ వే

హైదరాబాద్, జూలై 5: భువనగిరి కోట వైభవాన్ని, నిర్మాణ శైలిని ప్రజలు సందర్శించడానికి త్వరలో రోప్ వే ఏర్పాటు చేయనున్నట్టు గిరిజనాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. నెల రోజులలో రోప్ వే పనులను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. భువనగిరి కోటను పర్యాటకం, అడ్వంచర్ టూరిజంగా అభివృద్ధి చేయడానికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి అన్నారు. సచివాలయంలో మంగళవారం పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన పనులను మంత్రి సమీక్షించారు. ఓరుగల్లు కోట, గోల్కొండ కోటకు మధ్యన ఉండే భువనగిరి కోటకు ఎంతో చారిత్రక ప్రశస్తి ఉందని మంత్రి అన్నారు.

ఎమ్సెట్ మెడికల్ స్ట్రీంకు చివరి తేదీ నేడే

హైదరాబాద్, జూలై 5: తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న ఎమ్సెట్-2కు దరఖాస్తు గడువు బుధవారంతో ముగుస్తుంది. ఎమ్సెట్-2 నిర్వహణకు ఎమ్సెట్ కమిటీ ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. 6వతేదీన 10వేల రూపాయిల అదనపు ఫీజుతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇంత వరకూ 56,183 మంది ఎమ్సెట్-2కు దరఖాస్తు చేశారు. అందులో ఆంధ్రా యూనివర్శిటీ ఏరియా నుండి 10598 మంది, ఎస్వీయు ఏరియా నుండి 7382 మంది , ఇతర ప్రాంతాల నుండి 1690 మంది దరఖాస్తు చేశారు. తెలంగాణ నుండి 36,513 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అబ్బాయిలు 18446 మంది కాగా అమ్మాయిలు 37737 మంది ఉన్నారు.

రైతులను రుణ విముక్తి చేయండి

హైదరాబాద్, జూలై 5: రైతులను రుణ విముక్తులుగా చేయండి అని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రైతులకు వ్యవసాయ రుణాలను లక్ష రూపాయల వరకు బకాయిలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో గుర్తు చేశారు. మొత్తం 37 లక్షల మంది రైతులకు చెందిన 17,028 కోట్ల అప్పులు మాఫీ చేయాల్సి ఉండగా, 4 విడతలుగా మాఫీ చేస్తామని దాట వేశారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం రెండు విడతలుగా 8,898 కోట్ల రుణాలు మాఫీ చేశారని, ఇంకా 8,202 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.

పర్యావరణ అనుమతులపై 12న సమావేశం

హైదరాబాద్, జూలై 5: ప్రాజెక్టులకు అనుమతుల అంశంపై చర్చించేందుకు ఈనెల 12న న్యూఢిల్లీలో కేంద్ర పర్యావరణ నిపుణల కమిటీ సమావేశం జరుగుతుంది. కొరటా- చనాకా బ్యారేజీకి సంబంధించిన పర్యావరణ అంశాలపై ఆదిలాబాద్ జిల్లా సిఇ భగవంతరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో మహారాష్టన్రు ఆనుకొని ఉన్న పెన్‌గంగపై ఈ బ్యారేజీని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను మరింత వేగవంతంగా పూర్తి చేయడానికి అక్కడక్కడా పెండింగ్‌లో ఉన్న అటవీ పర్యావరణ అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

సేఫ్టీబిల్‌పై ప్రతిపాదనలు అమలు చేయాలి

హైదరాబాద్, జూలై 5: కేంద్రం ప్రతిపాదించిన రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్-2015పై అభ్యంతరాలను తెలంగాణ ప్రభుత్వం జరిపిన ప్రతిపాదనల అమలుకు చొరవ చూపాలని టిఆర్టీసి స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. నూతనంగా ప్రతిపాదించిన బిల్లును రవాణా రంగంలో పనిచేస్తున్న అన్ని జాతీయ ఫెడరేషన్లు వ్యతిరేకించాయి. ఈ బిల్లు చట్టం రూపంలోకి వస్తే ప్రజా రవాణా సంస్థలైన ఆర్టీసిలు కనుమరుగవుతాయని, రాజ్యాంగం ప్రకారం రవాణా అనేది రాష్ట్రాల పరిధిలో ఉందని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బిఎస్ రావు అన్నారు.

నిజామాబాద్‌లో కొత్త పోలీస్ సర్కిల్

హైదరాబాద్, జూలై 5 : నిజామాబాద్ జిల్లాలో దర్పల్లిని కొత్త పోలీస్ సర్కిల్‌గా మారుస్తూ ప్రభుత్వం జీఓ (హోంశాఖ జీఓ ఎంఎస్ నెంబర్ 131 తేదీ 5 జూలై 2016) జారీ చేసింది. ఇప్పటి వరకు డిచ్‌పల్లి పరిధిలో ఉన్న ధర్పల్లి పోలీస్ స్టేషన్, భీంగల్ సర్కిల్ పరిధిలో ఉన్న సిరికొండ పోలీస్ స్టేషన్లను కలిపి దర్పల్లి పోలీస్ సర్కిల్‌గా మార్చారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

హరితహారానికి సహకరించండి

హైదరాబాద్, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి మత పెద్దలు సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంగళవారం హిందు, ముస్లిం, సిక్కు, క్రిష్టయన్, పార్సీ మత పెద్దలతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆలయాలు, ఈద్గాలు, చర్చీ, గురుద్వార్‌ల వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ప్రోత్సహించాలని రాజీవ్ శర్మ కోరారు. ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలతో పాటు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటడంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆయన కోరారు.

ఎస్‌ఐ అర్హత పరుగులో యువకుడి మృతి

హైదరాబాద్, జూలై 5: ఎస్సై అర్హత పరుగులో పాల్గొన్న ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. మంగళవారం మాదన్నపేట బోయబస్తీలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణుడైన సునీల్ అనే యువకుడు ఎస్సై అర్హత పరీక్షకు హాజరయ్యాడు. పరుగు పోటీలో అర్సత సాధించిన సునీల్ ఇంటికి చేరుకున్నాడు. కాస్సేపటికి గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు మాదన్నపేట పోలీసులు తెలిపారు.

ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ సెర్చి కమిటీ నియామకం

హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నియామకానికి రాష్ట్రప్రభుత్వం సెర్చికమిటీని నియమించింది. ఈ కమిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రతినిధిగా ఉస్మానియా యూనివర్శిటీ మాజీ విసి ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీని నియమించారు. యుజిసి నామినీగా గురు నానక్ దేవ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ ఎస్ బ్రార్, రాష్ట్రప్రభుత్వ నామినీగా ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్యను నియమించారు. ఈ కమిటీ మూడు పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదిస్తుంది.

మోదీ కొత్త కొలువు

కేబినెట్ మంత్రులు
రాజ్‌నాథ్‌సింగ్ హోం శాఖ
సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాలు
అరుణ్ జైట్లీ ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాలు
వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ,
హౌసింగ్, పట్టణ పేదరిక నిర్మూలన
నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్
మనోహర్ పారికర్ రక్షణ
సురేశ్ ప్రభు రైల్వేలు
సదానందగౌడ గణాంకాలు, కార్యక్రమ అమలు
ఉమాభారతి జలవనరులు, నదుల అభివృద్ధి,
గంగానది పునరుజ్జీవనం
నజ్మాహెఫ్తుల్లా మైనారిటీ వ్యవహారాలు

Pages