S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జర్నలిస్టుగా కల్యాణ్‌రామ్

నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇజం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇజం టైటిల్‌ను ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు పూరి జగన్నాధ్ ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత, హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ, తాను ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒక ఎతె్తైతే, పూరి జగన్నాథ్‌తో చేస్తున్న ఈ చిత్రం మరో ఎత్తని, ఒక డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నామని అన్నారు.

నేర్చుకుందాం

క. జననాథ! వేఁట నెపమున
గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదం
బున నందు నాకు నీయి
చ్చిన వరము దలంపవలయుఁ జిత్తములోనన్
భావం: ఓ రాజా! వేట అనే మిషతో కావాలని సప్రయత్నంగా కణ్వమహాముని ఆశ్రమానికి వచ్చి అక్కడ నీవు సంతోషంగా నాకు ఇచ్చిన వరాన్ని మనసులో జ్ఞాపకం చేసికొమ్ము.
క. బాలార్క తేజుఁ డగు నీ
బాలుఁడు నీకొడుకు వీనిఁ బౌరవకుల ర
త్నాలంకారు నుదార గు
తాలయు యువరాజుఁ జేయు మభిషేకము తోన్
భావం: బాల సూర్యుడి వలె వెలుగుతున్న ఈ చిరంజీవి నీ కొడుకు. సౌరవంశానికే అలంకారమైన వాడూ, ఉత్తమ గుణాలకు నెలవైన వాడూ అయిన ఇతడిని యువరాజుగా అభిషేకించుము.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

9న బాబు బంగారం సింగిల్ ట్రాక్

వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి ద దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘బాబు బంగారం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. జీబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్‌ను ఈనెల 9న విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, వెంకటేష్, నయనతారల కాంబినేషన్‌పై క్రేజ్ బాగా వుందని, దానికి మారుతి దర్శకుడనగానే ఆ క్రేజ్ రెట్టింపు అయిందని అన్నారు.

8న ఇద్దరం

సంజీవ్, సాయికృప జంటగా జావన్ అండ్ కాస్పియన్ ఇంటర్నేషనల్ పతాకంపై సుధాకర్ వినుకొండ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇద్దరం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 8న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వినుకొండ సుధాకర్ మాట్లాడుతూ, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం గ్యాంగ్‌రేప్ నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. రేప్ చేసే గ్యాంగ్‌లో ఒక మంచి వ్యక్తి వుంటే అతను మిగిలినవారిని ఎదిరిస్తే అక్కడి పరిస్థితి ఎలా వుంటుంది అనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు.

స్వచ్ఛమైన ప్రేమకథ..మరల తెలుపనా!

ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్‌లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ఈ చిత్రం ద్వారా వాణి.యం.కొసరాజు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోందంటూ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, మరల తెలుపనా ప్రియా పాటలను ప్రేక్షకులు బాగా ఆదరించారని, ఎలాంటి సంగీతం కావాలో దాన్ని డైరక్టర్ రాబట్టుకున్నారని, ప్రతి పాటకు మంచి సాహిత్యం కుదిరిందని అన్నారు.

ఇవి తింటే దూరం

క్యాన్సర్‌ను నిరోధించే శక్తి మనం నిత్యం వాడే పసుపులో అత్యధికంగా వుంది. అదే విధంగా టమాట, బీట్‌రూట్, క్యారెట్, క్యాబేజి, కాలిఫ్లవర్ మరికొన్ని కూరగాయల్లో వుండే బీటా కెరోటిన్ క్యాన్సర్‌ను సమర్ధవంతంగా నిరోధిస్తుందని తేలింది. సీజన్లవారీగా లభించే మామిడి, అనాస, జామ, నేరేడు, నారింజ, బొప్పాయి, అరటి పళ్ళు కూడా క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. ఇవికాక పొట్టు తీయని ఆహార ధాన్యాలు, చేపలు, వైట్‌మీట్ కూడా మనం క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే క్యాన్సర్ మహమ్మారికి అల్లంత దూరం వుండవచ్చు.

- బి.మాన్‌సింగ్ నాయక్

పనితోనే ప్రశాంతత

లోకనాయకుడు కమల్‌హాసన్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రుతిహాసన్ తనదైన స్టైల్‌లో సినీ రంగంలో దూసుకుపోతోంది. తాజాగా సైమా అవార్డుల వేడుకలో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటనకుగాను ఉత్తమనటి అవార్డును కూడా అందుకుంది. కెరీర్ మొదట్లో ఐరన్‌లెగ్‌గా ముద్రపడినా ‘గబ్బర్‌సింగ్’ పవర్‌ఫుల్ హిట్‌తో గోల్డెన్ గాళ్‌గా మారిపోయింది. వరుస ఆఫర్లతో క్రేజీ స్టార్‌గా ఎదిగింది. శ్రుతిహాసన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని ట్విట్టర్‌లో తన అభిమానులతో పంచుకుంది. తనకు ఎప్పుడూ పనిచేస్తూ బిజీగా వుండడమే ఇష్టమని, అలా పనిచేయకుంటే వెంటనే సిక్ అవుతానని అంటోంది. తనను ఆరోగ్యంగా, అందంగా వుంచుతోంది తన పనేనని అంటోంది.

విశాల్‌కు జతగా మంజిమా

ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో మలయాళ తారల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో మంజిమా మోహన్ తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుండగా, అప్పుడే మంజిమా మరో క్రేజీ ప్రాజెక్టును సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. విశాల్ కథానాయకుడుగా నటించబోయే ‘పందెంకోడి-2’ చిత్రంలో మంజిమామోహన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్‌గా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతోపాటుగా మరికొన్ని చిత్రాల్లో మంజిమాకు అవకాశాలు వరిస్తున్నాయట!

ఆహారపు అలవాట్లే క్యాన్సర్ కారకాలు

ఆధునిక మానవుడు దైనందిన జీవితంలో వత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన వైవిధ్యం లేకపోవడం వంటి కారణాలవల్ల అస్వస్థతకు గురవుతున్నాడు. మనిషిని పట్టిపీడించే ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కొన్ని రకాల క్యాన్సర్లు ఆహారపు అలవాట్లవల్లే వస్తాయని కార్నిగే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లేర్‌షా తన పరిశోధనల్లో నిర్ధారించారు. క్యాన్సర్‌లో ప్రమాదకరమైన లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)కు ఆహార అలవాట్లకు సంబంధం లేదని ఆమె తేల్చారు. అదే విధంగా స్ర్తిలలో వచ్చే గర్భాశయ క్యాన్సర్ మనం తినే ఆహారంవల్ల రాదు.

కొండల్ని పిండేస్తా...

...........
టీనేజ్ అమ్మాయికి పర్వతారోహణే ప్రాణం ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు తహతహ
ఏడింటిలో మూడు పర్వతాలు అధిరోహణ
...........

-ఆశాలత

Pages