S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న దుకాణాలు

బోధన్, జూలై 3: బోధన్ పట్టణంలో రంజాన్ ధమాకా అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఆదివారం పాత మార్కెట్ కొనుగోలు దారులతో పట్టణంలోని కిటకిట లాడుతోంది. ఉదయం నుండీ అర్థరాత్రి రెండు గంటల వరకు అమ్మకాలు కొనసాగాయి. ఇందుకోసం దుకాణా దారులు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేసారు. పండుగకు ఇంకా కేవలం రెండు రోజుల గడువుమాత్రమే ఉండటంతో పట్టణంలోని ముస్లీంలే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన ముస్లీంలు సైతం ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. రంజాన్ కొనుగోళ్లతో పట్టణంలో పండుగ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు వర్షాలు కురియడంతో ఇక్కడ వ్యాపారాలు అంతగా కొనసాగలేక పోయాయి.

కొత్త జిల్లాలకు మహనీయుల పేర్లు

హైదరాబాద్, జులై 3: కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న జిల్లాల్లో తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాతలు, పోరాట యోధులైన దొడ్డి కొమరయ్య, కొమరం భీం పేర్లు పెట్టాలని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దొడ్డి కొమరయ్య 70వ వర్ధంతి సందర్భంగా రచయిత, జర్నలిస్టు మరిపాల శ్రీనివాస్ రాసిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ ప్రసంగిస్తూ ఈ విషయమై తాను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి కోరతానని చెప్పారు. తెలంగాణ చరిత్రను మహాగ్రంధంగా తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

వివాహిత కిడ్నాప్, హత్య

మేడిపల్లి, జూలై 3: కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్ మేడిపల్లి మండలం మోత్కురావుపేట గ్రామానికి చెందిన ఎల్కపల్లి వౌనిక (19) అనే వివాహితను శనివారం రాత్రి కిడ్నాప్ చేసి హతమార్చారు. ఇందుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. రెండు నెలల క్రితం మోత్కురావుపేటకు చెందిన మహేష్‌ను వివాహం చేసుకున్న వౌనిక ఆషాఢ మాసం సందర్భంగా తండ్రి మల్లయ్యతో కలసి అత్తగారి ఇంటి నుండి పుట్టింటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యంలో ముసుగులు ధరించిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అటకాయించారు. మల్లయ్యపై దాడి చేసి, చెట్టుకు కట్టేసి మత్తుమందు చల్లడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

గోడ కూలి చిన్నారుల మృతి

రామాయంపేట, జూలై 3: పూరిగుడిసె మట్టి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. హృదయ విదారకరమైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున మెదక్ జిలజూల్లా రామాయంపేట మండలంలోని నగరం గిరిజన తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం...తండాకు చెందిన బానోతు లాలు-కలీ తమ గుడిసెలో ముగ్గురు పిల్లలు చిట్టి (9), చందు (7), గీత (4)తో కలిసి ఉంటున్నారు. శనివారం కురిసిన వర్షానికి మట్టిగోడలు తడిసి ముద్దయ్యాయి. నిద్రలో ఉండగానే రాత్రి ఒంటిగంట సమయంలో గుడిసె మట్టిగోడలు కూలి చిన్నారులపై పడడంతో ఇద్దరు చిన్నారులు చిట్టి, గీత అక్కడికి అక్కడే మృత్యువాత పడ్డారు.

నక్కలగండికి నిర్వాసితుల గండి!

నల్లగొండ, జూలై 3: ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టులో అంతర్భామైన నక్కలగండి రిజర్వాయర్ పనులకు సమీప ముంపు గ్రామాల ప్రజలు పదేపదే అడ్డుతగులుండడం వివాదాస్పదమవుతోంది. పరిహారం నిర్ధారణ, చెల్లింపుల్లో ఇరిగేషన్ శాఖ తీరును తప్పుబడుతూ ముంపు గ్రామాలైన నక్కలగండి, మోత్యాతండా, తేల్ధేవర్‌పల్లి, మహాబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మర్లపాడు, కేశ్యనాయక్ తండావాసులు తరుచూ పనులను అడ్డుకుంటూ పరిహారంపై పేచీ పెడుతున్నారు. గత రెండు రోజులుగా మోత్యాతండావాసులు తమకు పరిహారంపై స్పష్టతనివ్వాలని, పరిహారం, పునరావాసం చూపాకే పనులు ప్రారంభించాలంటూ పనులను అడ్డుకున్నారు.

అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలి

హైదరాబాద్, జులై 3: ఉగ్రవాదులకు న్యాయ సహయం అందిస్తామని ప్రకటించిన మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని, లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు అసద్ పెద్దన్నగా మారారని ఆయన విమర్శించారు. ఐఎస్‌ఐ, లష్కర్-ఎ-తొయిబా, డిజెఎస్ వంటి ఉగ్రవాద సంస్ధలు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చుకుని జాతి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన తెలిపారు.

ప్రాజెక్టుల్లో అవినీతి వరద : నాగం

హైదరాబాద్, జులై 3: రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, భగీరథ నీటి పారుదల ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. టెండర్ల విధానానికి ముఖ్యమంత్రి కెసిఆర్ బ్రేక్ వేసి తన ఇష్టం వచ్చిన వారికి అప్పగిస్తున్నారని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. లోగడ 30 శాతానికి తక్కువగా టెండర్లు ఉంటే, ఇప్పుడు కేవలం 2 శాతం కంటే తక్కువగా వేయడం జరుగుతోందన్నారు. ప్రాజెక్టుల డిజైన్ మార్చరాదని సలహాదారే లేఖ రాసినప్పటికీ ఆయన మాటను పెడ చెవిన పెట్టి మెగా, నవయుగకు పనులు కట్టబెట్టారని ఆయన తెలిపారు.

గణేశ ఉత్సవాలపై సిగపట్లు

హైదరాబాద్, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వానికి, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి మధ్య ‘టగ్ ఆఫ్ వార్’ ప్రారంభమైంది. గణేశ్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు విధించడం సరికాదని, విగ్రహాలు, వాటికి ఉపయోగించే రంగుల విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి వ్యతిరేకిస్తోంది. అసలు మతసంబంధమైన అంశాల్లో ప్రనుత్వం జోక్యం చేసుకోవడాన్ని సమితి పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఇతర మతాల ఆచార వ్యవహారాల్లో ఎలాంటి జోక్యం చేసుకోని ప్రభుత్వం హిందూ మతసంబంధమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం పట్ల సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తాజాగా ప్రభుత్వానికి తెలియచేశారు.

పుష్కరాలకు అర్చకుల కొరత!

నల్లగొండ, జూలై 3: కృష్ణా పుష్కరాల పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు అవసరమైనంత సంఖ్యలో అర్చక పండితులు లేకపోవడం నల్లగొండ జిల్లాలో సమస్య్యగా మారింది. ఆగస్టు 12 నుండి 23 వరకు జరిగే ఈ పుష్కరాలకు కోటి మందికి పైగా భక్తులు జిల్లా పరిధిలోని ఘాట్‌లకు రావచ్చని భావిస్తున్నారు. పుణ్యస్నానాల పిదప భక్తులు తమ పూర్వీకులకు పిండ ప్రధానాలు, పితృ తర్పణాల ప్రక్రియలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో అర్చక పండితులు అవసరమవుతారు. భక్తుల రద్ధీకి అనుగుణంగా పూజాదికాలు, తీర్ధప్రసాదాల వితరణకు, అలాగే నదీ హారతులకు, మహిళలు నదిలో దీపాలు వదిలే ప్రక్రియ పూజల నిర్వహణకు భారీ సంఖ్యలోనే అర్చక పండితుల అవసరముంది.

దేశంకోసం పని చేయాలి

హైదరాబాద్, జూలై 3: అమెరికాలో ఉంటున్న తెలుగువారి సామాజిక స్పృహ, బాధ్యత స్ఫూర్తిదాయకమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికాలోని చికాగోలో జరుగుతున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆటా మహిళా విభాగం ప్రతినిధులు బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కమ్యూనికేషన్ అభివృద్ధి చెందని కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం మన వాళ్లు అమెరికా రావాలన్నా, సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలన్నా, కష్టంగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వారి సమాచారం అయినా తెలుసుకోగలుగుతున్నామని అన్నారు.

Pages