S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్జీల నియామకాల్లో కేంద్రం ప్రతిపాదనకు ‘నో’ అన్న సుప్రీం

న్యూఢిల్లీ, జూలై 3: న్యాయమూర్తులుగా పదోన్నతికోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల పేర్లను కొలీజియంకు పంపే ముందు ఆ దరఖాస్తులను పరిశీలించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్ తిరస్కరించారు. ఇందుకు సంబంధించి సవరించిన నిబంధనల ముసాయిదా (మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్)లోని క్లాజు పట్ల చీఫ్ జస్టిస్ ఠాకూర్ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

హింసతో విజయం సాధించలేరు

వాషింగ్టన్, జూలై 3: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదుల భయాందోళనలు కలిగించే ప్రచారం, హింస విజయవంతం కాలేవని అమెరికా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అన్నారు. బంగ్లాదేశ్‌లోని ఒక రెస్టారెంట్‌పై దాడికి దిగిన ఉగ్రవాదులు కొంతమందిని బందీలుగా చేజిక్కించుకొని, అందులోని 20 మందిని ఊచకోత కోసిన నేపథ్యంలో హిల్లరీ బంగ్లాదేశ్ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఉగ్రవాద సంస్థలపై పోరాడుతున్న మిత్ర దేశాలవైపున అమెరికా దృఢచిత్తంతో నిలబడుతుందని హిల్లరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐఎస్‌ఐఎస్, జిహాదిజంపై పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

స్వాతి హంతకుడిని ఉరితీయండి

చెన్నై, జూలై 3: తమిళనాడులో ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతిని హత్య చేసిన దోషికి ఉరిశిక్ష వేయాలని ఆమె కుటుంబం ఆదివారం డిమాండ్ చేసింది. నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో 24 ఏళ్ల స్వాతిని హతమార్చిన నిందితుడు రామ్‌కుమార్ (22)ను పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. స్వాతి హంతకుడికి కఠినాతి కఠిన మైన శిక్ష విధించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రామ్‌కుమార్‌కు మరణ దండన విధించాలని స్వాతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పెళ్లి ప్రతిపాదనను అంగీకరించనందువల్లే రామ్‌కుమార్ ఆమెను దారుణంగా హతమార్చాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నదాతల ఆశలు పదిలం

గోవిందరావుపేట, జూలై 3: మండలంలోని రైతులకు కల్పతరువైన లక్నవరం చెరువులోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చిచేరుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల 13 అడుగుల నీటి మట్టం ఉన్న లక్నవరం చెరువు నీరు 21.5 అడుగులకు చేరింది. 25 అడుగుల నీటిమట్టానికి చేరితే ఖరీఫ్ పంటకు ఢోకా ఉండదు. అయితే, వాతావరణం వర్షాలకు అనుకూలంగా ఉందనే సమాచారంతో ఇక ఖరీఫ్ పంటకు ఇబ్బందులు లేనట్లేననే ధీమాలో సాగుకు అన్నదాతలు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే నారు పోసి సాగుకు సిద్ధమైన రైతులు మరో 20 రోజులలో నాట్లు వేసేందుకు ముందుకు సాగుతున్నారు.

లోక కళ్యాణం కోసమే శాకంబరీ ఉత్సవాలు

నక్కలగుట్ట, జూలై 3: చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో లోక కల్యాణం కోసం శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి అంజనీదేవి తెలిపారు. ఆదివారం దేవస్థాన ప్రధానార్చకులు భద్రకాళిశేషుతో కలసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజనీదేవి మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీనుండి 19వ తేదీ వరకు, 15 రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. దేవాదాయశాఖ, రెవెన్యూ, పోలీసుశాఖల సహాయ సహకారాలతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

హరితహారంలో అంతా భాగస్వాములు కావాలి

నరుూంనగర్, జూలై 3: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఆదివారం నగరమేయర్ నన్నపునేని నరేందర్‌తో కలిసి ప్రశాంత్‌నగర్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని, లక్ష్యాన్ని సాధించాలంటే ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని, కార్యాలయాలు, విద్యాలయాలను చెట్లతో పచ్చగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు.

పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు

నక్కలగుట్ట, జూలై 3: పోలీసు శాఖలోని వివిధ విభాగాలలో స్ట్ఫైండరీ, క్యాడెట్ ట్రైనీ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా అన్నారు. ఆదివారం కెయు మైదానంలో ఎస్సై ప్రిలిమినరి రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏడవ రోజు రూరల్ పోలీసుల అధ్వర్యంలో 1086 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు, 800, 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, హై, లాంగ్ జంప్‌లలో పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ఆదివారం వర్షం లేకపోవడంతో కెయు మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు సజావుగా సాగాయని అన్నారు.

ఉప సభాపతికి ఘన స్వాగతం

నరుూంనగర్, జూలై 3: వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ శాసనసభ ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డికి నగర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం ఒకరోజు జిల్లా పర్యటనకు వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డికి హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో నగరమేయర్ నన్నపునేని నరేందర్, జిల్లా తెరాస అధ్యక్షులు తక్కళ్లపెల్లి రవీందర్ రావు, కార్పొరేటర్‌లు, తెరాస నాయకులు, కార్యకర్తలు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు.

కరవు మండలాలకు నష్టపరిహారం

నర్సంపేట, జూలై 3: కరవు మండలాలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎడ్ల అశోక్‌రెడ్డి మాట్లాడారు. గత సంవత్సరం వరంగల్ జిల్లాలో మొత్తం 30 మండలాలు కరవుతో అల్లాడగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 11 మండలాల్లో కరవు ఉన్నట్లు ప్రకటించి ఎంపిక చేసిందని చెప్పారు. ఎంపిక చేసిన కరవు మండలాలకు సైతం నష్టపరిహారం అందించకపోవడం సరి కాదన్నారు.

ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించినా..ప్రాజెక్టులు కట్టి తీరుతాం

వరంగల్, జూలై 3: ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రైతుల ప్రయోజనం కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సర్య్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్దికోసమే మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఆ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ జీవో ప్రకారం నష్టపరిహారం అందిస్తామన్నారు. అయితే, మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతాన్ని రైతులు కూడా నమ్మడం లేదన్నారు.

Pages