S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదనపు నిధుల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 2 : గ్రామీ ణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కోసం కేంద్రం విడుదల చేసిన రూ. 50 కోట్ల నిధులను ఖర్చు చేసి, అవసరమైన అదనపు నిధుల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లిఫ్టు ఇరిగేషన్, తాగునీటి పథకాలు, ఉపాధి హామీ పనులు, చేతి పంపులు, సిసి రోడ్లు తదితర అంశాలపై ఆయన శనివారం హైదరాబాద్ నుంచి జిల్లాల వారీగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టక్కర్ మాట్లాడుతూ వచ్చే ఏడాదికి సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పంపాలని తెలిపారు.

శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక సాధ్యమేనా!

కర్నూలు, జూలై 2 : శ్రీశైలం జలాశయంలో ఈ ఏడాది జలకళ కనిపించడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో కురిసే వర్షాల స్థాయిలో ఉత్తర భారతంలో కనిపించవన్న నిపుణుల అభిప్రాయంతో శ్రీశైలం జలాశయం దిగువన ఉన్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల ఫలితంగా దక్షిణ భారత దేశంలో 18 నుంచి 20శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని, ఇదే సమయంలో ఉత్తర భారత దేశంలో సాధారణ వర్షపాతం నమోదు కానుందని గతంలో వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.

నేటి నుంచి నారాయణ వనం శ్రీ పరాశరేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, జూలై 2: టిటిడికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాసరేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. శనివారం సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 3వ తేదీ ఉదయం 9నుంచి 10 గంటల వరకు సింహలగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు వాహనసేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా ఈనెల 9వ తేదీన రథోత్సవం జరుగనుంది.

టిటిడి పథకాలకు రూ.5 లక్షల విరాళం

తిరుమల, జూలై 2: టిటిడి నిర్వహిస్తున్న అన్నప్రసాదం ట్రస్టుకు లక్ష రూపాయలు, బర్డ్ ట్రస్టుకు లక్ష రూపాయలు, హరిటేజ్ రిజర్వేషన్ ట్రస్టుకు 3 లక్షల రూపాయల విరాళాలను టిటిడి ట్రస్టుబోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి శనివారం డిడి రూపంలో టిటిడి ఇ ఓ డాక్టర్ డి. సాంబశివరావుకు అందజేశారు.

శ్రీవారి సేవలో మరో రెండు ఉచిత బస్సులు

తిరుమల, జూలై 2: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కలకత్తాకు చెందిన ప్రకాష్ చౌదరి అనే భక్తుడు రెండు బస్సులకు విరాళంగా అందించారు. శనివారం ఉదయం శ్రీవారి ఆలయం సమీపాన ఉన్న వైభవోత్సవ మండపం వద్ద బస్సులకు సంబంధించిన తాళాలను దాత తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజుకు అందించారు. తిరుమలలో భక్తుల కోసం టిటిడి ఉచిత బస్సులను నడుపుతున్న విషయం విదితమే. అందులో భాగంగా టిటిడి 29 లక్షల రూపాయలతో అశోక్‌లేలాండ్ సంస్థకు చెందిన రెండు చాసిస్‌లను కొనుగోలు చేసింది.

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను మూసివేస్తే ప్రభుత్వ పతనం తప్పదు: ఎఐఎస్‌ఎఫ్ హెచ్చరిక

తిరుపతి, జూలై 2: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన సంక్షేమ వసతి గృహాలను ప్రభుత్వం మూసివేయాలని చూస్తే పతనం తప్పదని ఎఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు పురుషోత్తం, బండి చలపతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలను మూసివేయడాన్ని నిరసిస్తూ శనివారం చెన్నారెడ్డి కాలనీలోని ఎ ఎస్ డబ్ల్యూ ఓ కార్యాలయాన్ని విద్యార్థులతో కలిసి ఎఐఎస్‌ఎఫ్ నేతలు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనేర్చుకోవాలని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న నాయకులు వారి సంక్షేమ వసతి గృహాలను మూసివేయాలని చూడటం సిగ్గుచేటన్నారు.

పాత తరం వైద్యుల అనుభవాలను కొత్తతరం అందిపుచ్చుకోవాలి

తిరుపతి, జూలై 2: పాతతరం వైద్యుల అనుభవాలను నేటి యువ వైద్యులు అందిపుచ్చుకొని రోగులకు సేవలందిస్తే వృత్తికి సార్థకత చేకూరుతుందని ఐ ఎం ఎ తిరుపతి శాఖ అధ్యక్షురాలు, ప్రముఖ మధుమేహ వ్యాధి నిపుణురాలు, హర్షిత హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ కృష్ణప్రశాంతి పిలుపునిచ్చారు. డాక్టర్ బిసి రాయ్ జయంతి, వర్థంతిని పురస్కరించుకొని స్థానిక ఐ ఎం ఎ భవన్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డాక్టర్స్‌డే సందర్భంగా 70 సంవత్సరాలు దాటిన 30 మంది డాక్టర్లను ఐఎంఎ ఆధ్వర్యంలో సన్మానించారు.

ఆల్-ఉమా తీవ్రవాదుల కోసం ముమ్మర గాలింపు

చిత్తూరు, జూలై 2 : చిత్తూరు కోర్టు ఆవరణలో చోటు చేసుకున్న బాంబు పేలుడు ఘటనలో ఆల్-ఉమా తీవ్రవాద సంస్థ ప్రమేయం ఉందని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ సంస్థ నాయకుడు సిద్దిక్ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు సరిహద్దులోని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇటీవల కేరళ కొల్లం కోర్టులోనూ, తమిళనాడు ఇదే తరహాలో బాంబు పేలుడు జరగడం విదితమే.ఈ నేపథ్యంలో తీవ్రవాదుల భరతం పట్టాలన్న కేంద్ర హోం శాఖ తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ధ్రాకారులను ఆదేశించింది.

ఎర్రచందనం దొంగ రవాణాకు సహకరిస్తే కఠిన శిక్షలు

తిరుపతి, జూలై 2: ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాలో సహకరించిన వారికి, పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు తప్పవని ఆ దిశగా చట్టాలు రూపొందించడం జరిగిందని, వీటిపై ప్రతి అధికారి అవగాహన పెంచుకోవాలని రాయలసీమ డి ఐజి ప్రభాకర్‌రావు, అర్బన్ ఎస్పీ జయలక్ష్మిలు అన్నారు. సవరించిన ఎర్రచందనం అక్రమరవాణాల చట్టాలపై పోలీస్, అటవీశాఖ అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమం శనివారం స్థానిక మహిళా విశ్వవిద్యాలయంలోని సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించారు.

హంద్రీనీవా పనులు వేగవంతం చేయండి

అనంతపురం సిటీ, జూలై 2: జిల్లాను సస్యశ్యామలంగా చేయడానికి హంద్రీనీవా ప్రాజెక్టును పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. శనివారం స్థానిక రెవిన్యూ భవన్‌లో హంద్రీనీవా పనులు పురోగతి, భూసేకరణ పనులపై హంద్రీనీవా ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబందించి ప్యాకేజీల వారిగా జరుగుతున్న పనులు, పెండింగ్‌లో ఉన్న భూసేకరణపై సమీక్షించారు. స్ట్రక్చర్లు, అండర్ టనె్నల్స్, అక్విడెన్సుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

Pages