S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..!

సంగారెడ్డి టౌన్, జూలై 2: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఒర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో కాంగ్రెస్ నాయకుల కండ్లకు కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు. జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. శనివారం టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులుగా పదవులు అనుభవించారు తప్పా చేసిన అభివృద్ధి ఎమిటో చూపించాలని డిమాండ్ చేశారు.

బిసి కళ్యాణలక్ష్మి పథకానికి.. తహశీల్దార్లే విచారణ అధికారులు

సంగారెడ్డి టౌన్, జూలై 2: బిసి కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధిత తహసీల్దారులే విచారణ అధికారులుగా ఉంటారని బిసి సంక్షేమ శాఖ అధికారి జి.ఆశన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు జివో నంబర్ 18 జారీ చేసిందన్నారు. కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను స్వీకరించి అట్టి దరఖాస్తులపై విచారణ చేపట్టే బాధ్యత సంబంధిత మండలాల తహసీల్ధార్లపై ఉంటుందన్నారు. శాసన సభ్యులు ఆమోదం తెలిపిన పట్టికను బిసి సంక్షేమ శాఖ అధికారికి మంజూరు నిమిత్తం పంపించాలని, పరిశీలించిన తరువాత చెక్కులు తయారు చేసేందుకు బిల్లులను ఖజాన శాఖకు పంపించాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

సంగారెడ్డి టౌన్, జూలై 2: వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే సైనికులని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల వద్దకు తీసుకువెళ్లి పార్టీకి పూర్వవైభం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డిలోని పిఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు, పూడిక తీతల పేరిట రాష్ట్రంలో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగమవుతున్నాయని అన్నారు.

శామీర్‌పేటలో ఉగ్రవాద అనుమానితుల విచారణ

హైదరాబాద్, జూలై 2: హైదరాబాద్‌లో భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలన్న కుట్ర కేసులో అరెస్టయిన ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను రాజధాని శివార్లలోని శామీర్‌పేటలో ఒక విశ్రాంతి భవనంలో ఎన్‌ఐఏ(నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ) బృందాలు విచారిస్తున్నాయి. ఐదుగురు నిందితులు మహమ్మద్ ఇలియాస్ యజ్దానీ, మహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇర్ఫాన్, హబీబ్ మహ్మద్ , అబ్దుల్ బిన్ అహమ్మద్ అలియాస్ ఫహాద్‌లను గ్రూపుగా, ఒక్కొక్కరిగా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. వీరు ఇంకా ఏ ప్రదేశాల్లో పేలుడు పదార్థాలు ఉంచారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా స్థానికంగా వీరికి ఎవరెవరు సహకరించారో అడుగుతున్నారు.

కృష్ణా పుష్కరాలకు రూ.426 కోట్ల నిధులు

మహబూబ్‌నగర్, జూలై 2: జిల్లాలో వచ్చే ఆగస్టు మాసంలో జరిగే కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం రూ.426కోట్ల నిదులను ఖర్చు చేయనుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం రెవెన్యూ సమావేశ మందిరంలో కృష్ణా పుష్కరాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలకు సంబందించిన అన్ని పనుల్లో నాణ్యత ఉండాలని, నాణ్యతకు తిలోదకాలు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకారం

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 2: మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పార్టీలకు అతీయితంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కోరారు. శనివారం పట్టణంలోని బ్రహ్మణవాడి, రాంనగర్ వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించారు. హరితహరంలో భాగంగా అయా వార్డుల్లో వివిధ రకాల మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కోట్లాది రూపాయాలు ప్రభుత్వం మంజూరి చేసిందని తెలిపారు.

కెసిఆర్ దౌర్జన్యానికి భయపడను

మహబూబ్‌నగర్, జూలై 2: ముఖ్యమంత్రి కెసిఆర్ దౌర్జన్యానికి దిగుతున్నాడని ఆయన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని భయం పట్టుకుందని అందుకే టిఆర్‌ఎస్ చిల్లరగాళ్లతో దౌర్జన్యాలు చేయిస్తున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్ నాయకులు చేసిన హల్‌చల్‌కు నాగం స్పందిస్తూ ముఖ్యమంత్రి దౌర్జన్యాలకు భయపడనని, ఆయన తింటున్నటువంటి అవినీతి డబ్బును కక్కించేందుకే రాజ్యాంగబద్దంగా ప్రజాస్వామ్యంగా కోర్టుకు వెళ్లాలనన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత ప్రచారం

ఆదిలాబాద్, జూలై 2: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, హెల్మెట్ వాడకంపై చైతన్యం తీసుకవచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రవాణాశాఖ, ఆర్టీసి తదితర శాఖలతో జిల్లాకలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతప్రమాదాల నివారణపై సమీక్షించి, పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు పెద్దఎత్తున ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రమాదాలు నివారించడానికి జూన్ 2 నుండి నో హెల్మెట్‌నోపెట్రోల్ అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు.

పాలారు చెక్‌డ్యామ్ ఎత్తుపై తమిళుల నిరసన

కుప్పం, జూలై 2: ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోగల కంగుంది పంచాయతీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకుంది. పాలారు నదిపై చెక్‌డ్యామ్‌ల ఎత్తు తగ్గించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఈ చెక్‌డ్యాం ఎత్తును ఐదు అడుగుల నుంచి 12 అడుగులకు పెంచడాన్ని తమిళనాడు సిఎం నిరసన వ్యక్తం చేశారు.

హెల్మెట్ ఉంటేనే పెట్రోల్..

ఆదిలాబాద్, జూలై 2: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వాడకంపై ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చేందుకు పెట్రోల్ బంక్ యజమానులు పూర్తిగా సహకరించాలని, ఇందుకోసం జిల్లాలో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోసేందుకు యజమానులు కఠిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో పెట్రోల్ బంక్ యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని, అందుకు కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని అన్నారు.

Pages