S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదో నమ్మకం..

ఆటగాళ్లలో చాలా మందికి ఏదో ఒక అలావాటు లేదా నమ్మకం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎదుటివారికి హాస్యాస్పదంగా కనిపించే చాలా నమ్మకాలు ఎంతో మందిలో కనిపిస్తాయ. ప్రపంచ మాజీ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఇందుకు అతీతుడేమీ కాదు. అతనికీ ఓ వింత నమ్మకం ఉంది. మ్యాచ్‌లు ఆడే ప్రతిసారీ అతను తన వాటర్ బాటిల్‌ను కుర్చీకి మధ్యగా ఉంచుతాడు. నీళ్లు తాగిన తర్వాత మళ్లీ అదే ప్రదేశంలో దాన్ని ఉంచుతాడు. ఒక్క అంగుళం కూడా అటూ ఇటూ జరగకుండా ప్రతిసారీ ఒకే చోట వాటర్ బాటిల్‌ను ఉంచితే విజయం తనేదనని అతని నమ్మకం. ఇదేం విడ్డూరం అంటూ ఎవరైనా నవ్వినా అతను పట్టించుకోడు.

అతని దేహంలో విదేశీ మోజులున్నాయి

వారి దేహంలో
విదేశీ మోజులున్నాయి
ఆర్కిటెక్టులు, ఆహ్వానాలతో
ఆకర్షిస్తున్నాడు.
హైటెక్‌లతో హంగులు దిద్దుతున్నాడు
స్మార్ట్‌గా స్మైల్ ఇస్తూ సైలెన్స్ చేస్తున్నాడు
కామ్‌గా కారిడార్లు అంటూ కాటేస్తున్నాడు
సింపుల్‌గా సింగపూర్ అంటూ
ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు
ఫైల్స్‌తో పోజులిస్తూ ఫొటోలు దిగుతున్నాడు
ఒప్పందాలు అంటూ వాటేసుకుంటున్నాడు
పెట్టుబడులు అంటూ
పరుగులు పెట్టిస్తున్నాడు
రాజధాని పేరుతో రమ్మంటున్నాడు
విదేశీయుల్ని బొక్కేయ్యమంటున్నాడు
మాస్టర్ ప్లాన్స్‌తో కాటేస్తున్నాడు
పచ్చని పొలాల్ని పీకేస్తున్నాడు

-తంగిరాల-సోని 96766 09234

చిరస్మరణీయం

అర్జెంటీనాలో సాకర్‌కు ఎంతో ఆదరణ. చిన్నతనం నుంచే ఫుట్‌బాల్‌తో ఆటలాడడం, జాతీయ జట్టుకు ఎంపిక కావాలని నిరంతరం శ్రమించడం అక్కడ ప్రతి ఒక్కరికీ అలవాటు. జాతీయ జట్టుకు మ్యాచ్‌లు ఆడడం చాలా గొప్ప. ఇక ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగితే, అంతకంటే కావాల్సింది ఏముంటుంది. అందుకే, కేవలం ఒక్క నిమిషమైతేనేం... అర్జెంటీనా తరఫున ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆడిన మార్సెలో ట్రోబియానీ తన జన్మ ధన్యమైందని పులకించిపోయాడు. ప్రపంచకప్ సాకర్ చరిత్రలోనే అతనిదే అత్యల్ప కెరీర్. కానీ, ఒకసారి మైదానంలోకి దిగానన్న సంతృప్తి అతనికి మిగిలింది.

- సత్య

స్వేదనాదం

చెమట చుక్కనెప్పుడూ చులకన చెయ్యొద్దు
నుదుటి మీద రాతనే మార్చగలదు -
నుదురుపై మొలిచిన చెమట!
సేవకుడూ, కర్షకుడూ, శ్రామికుడూ.. వీళ్లంతా
భ్రమల్లో బతకరు - శ్రమలోనే జీవిస్తారు!!
స్వేదం - ఒక వేదం...
కరకురాయిని పిండి చేసి
బీడు భూమిని పండించే మనోజ్ఞ రాగం
శ్రమైక జీవన సౌందర్యానికి నిలువెత్తు సత్యం
నరనరాన బిరాబిరా పరిగెత్తే రక్తఘోష నాదం
నెత్తురు - చెమట నాణేనికి రెండు ముఖాలు
సత్తువని ఒకటి అందిస్తే
శత్రువుని రెండోది తరిమేస్తుంది!!
స్వేదాన్ని చిందించేవాడు -
ఆశల సౌధాన్ని చేరుకుంటాడు
సౌభాగ్యానందుకుంటాడు!

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి 9052116824

కఠిన చర్యలు

రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఐఒసి తీవ్రంగా స్పందించింది. రియో ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లుపై నిషేధాన్ని విధిస్తూ అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) తీసుకున్న నిర్ణయానికే ఐఒసి ఓటు వేసింది. సస్పెన్షన్‌ను అంతర్జాతీయ క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎసి)లో రష్యా అథ్లెట్లు కొందరు సవాలు చేసినప్పటికీ, సానుకూల స్పందన రావడం అనుమానంగానే ఉంది. కాగా, ఈ వ్యవహారంపై వాడా కఠిన చర్యలకు ఉపక్రమించింది. రష్యా డోపింగ్ నిరోధిక ఏజెన్సీ (రష్యాఎడిఎ)ను రద్దు చేసింది.

రియల్ ‘రెజ్లింగ్’

ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తి రోజురోజుకూ మాయమవుతున్నది. రష్యా ఒలింపిక్ ట్రయల్స్‌లో చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రియో ఒలింపిక్స్‌లో పోటీపడే రెజ్లర్లను ఎంపిక చేయడానికి రష్యా రెజ్లింగ్ సమాఖ్య ట్రయల్స్‌ను నిర్వహించినప్పుడు 57 కిలోల విభాగంలో విక్టర్ లెబెడెన్, ఇస్మాయిల్ ముసుకయెవ్ పోటీపడ్డారు. అయితే, బౌట్ మధ్యలో ఇద్దరూ రెజ్లింగ్ పోటీని మరచిపోయి బాహాబాహీకి దిగారు. లెబెడెన్ మొదట ముసుకయెవ్‌ను చేత్తో బలంగా తోశాడు. ఈ సంఘటనతో ఆగ్రహించిన యుసుకయెవ్ ట్రైనర్‌తోపాటు డాగెస్తాన్ ప్రాంతానికి చెందిన అధికారులు, మద్దతుదారులు కూడా రెజ్లింగ్ రింగ్‌లోకి దూకి లెబెడెన్‌తో కలబడ్డారు.

‘జమైకా చిరుత’ వేటాడేనా?

రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ చేస్తున్న ప్ర యత్నాలకు గండి పడింది. కండరాల నొప్పి కారణంగా అతను జమైకా ఒలింపిక్ ట్ర యల్స్ నుంచి వైదొలిగాడు. దీనితో అతను బీజింగ్ ఒలింపిక్స్‌లో పతకాల వేట కొనసాగిం చ గలుగుతాడా? లేదా? అన్నది అనుమానంగా మారింది. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న బోల్ట్ ముచ్చటగా మూడోసారి ‘ట్రిపుల్’ను సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఈ సీజన్‌లో 100 మీటర్ల పరుగును 9.88 సెకన్లలో పూర్తి చేసిన 29 ఏళ్ల బోల్ట్ తన సత్తాను చాటిచెప్పాడు.

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం
అమరావతిలో పని చేయడానికి ఉద్యోగులకు ఒక ట్రైన్ ఏర్పాటు చేశారంట. ఈ రైలు ఉ.10.30కి గుంటూరు చేరితే, ఉద్యోగులు 11 గంటలకు ఆఫీసుకు చేరతారు. 11 గంటలకు విజయవాడ చేరితే 11.30కి ఆఫీసుకు చేరుకుంటారు. సాయంత్రం రైలు విజయవాడలో 5 గంటలకు కాబట్టి 4.30కల్లా స్టేషన్‌లో ఉండాలి. అంటే సగానికి పైగా కాలం రైల్లోనే గడిచిపోతుంది. ఇంత మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రిగారిని, రైల్వే సహాయమంత్రి ప్రభుగారిని అభినందించాల్సిందే. మీరేమంటారు?
చేసే పనేదో రైల్లోనే చేసుకోమంటారేమో చూడాలి.

దృఢ మనస్కులు

దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన దేశభక్తులకు కారాగారంలో తినలేని తిండిని పెడుతూ, అదే సాంఘిక దురాచారాలైన దొంగతనం, దోపిడీలు, మానభంగాలు, దొమీలు లాంటి నికృష్ట నేరాలు చేసిన వారికి రాజభోగాలా? - చదువుతూంటే మనిషై పుట్టిన బ్రిటీష్ దొరలకు మానవత్వం కనుమరుగై ఇంత కాఠిన్యమెలా కలిగిందో అని బాధ వేసింది. మన దేశంలో మన వారిని ఇంత క్షోభపెట్టిన చరిత్రను యథాతథం ప్రపంచానికి విస్తృతంగా ప్రచారం చేయాలి.

ఓం నమో వేంకటేశాయ షూటింగ్ ప్రారంభం

ప్రముఖ నటుడు నాగార్జున హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం శనివారంనాడు షూటింగ్ ప్రారంభమైంది. హాథిరామ్ గెటప్‌లో నాగార్జునపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు షాట్ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు నాగార్జున. ‘వేంకటేశ్వరస్వామి దయతో ఇవాళ ఉదయం షూటింగ్ ప్రారంభమైందని, ఈ అనుభవం చాలా బాగుంది’ అని నాగార్జున ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా, అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Pages