S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్యాణ లక్ష్మి లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు

హైదరాబాద్, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వమే పథకాల విధివిధానాలు రూపొందించాలని, వీటిని అధికారులు అమలు చేయాలని సూచించారు. రెండింట్లోనూ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యమై పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో పేదోళ్లంతా టిఆర్‌ఎస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

మాటలు ఘనం.. చేతలు శూన్యం

న్యూఢిల్లీ,జూన్ 18: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రెండేళ్ల పాలనలో మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని సి.పి.ఎం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. వీరభద్రం శనివారం విలేకరులతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన, తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై పార్టీ కేంద్రకమిటీ సమావేశంలో చర్చిస్తున్నామన్నారు. తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర కమిటీకి నివేదిక సమర్పించినట్లు ఆయన చెప్పారు. చంద్రశేఖరరావు చెబుతున్న బంగారు తెలంగాణా సాధన గురించి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయకుండా బంగారు తెలంగాణాను ఎలా సాధిస్తారని వీరభద్రం ప్రశ్నించారు.

సబ్‌కా సాథ్.. వట్టి బూటకం

హైదరాబాద్, జూన్ 18: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్..సబ్‌కా వికాస్’ అంటూ ప్రజలను మభ్యపెడుతోందని, ఇది వట్టి బూటకమని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్ర సర్కార్ ఎవరికీ చేయూతనివ్వలేదని..ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అభివృద్ధి ముసుగులో పాలకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో 2013లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో 50వేల మంది ముస్లింలు వలస వెళ్లారని, కేంద్ర ప్రభుత్వం కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా పంపించలేకపోయిందన్నారు.

కేశవదాసు విగ్రహాన్ని నెలకొల్పండి

హైదరాబాద్, జూన్ 18: వెండి తెరకు తొలి గేయాన్ని రాసిన చందాల కేశవదాసు విగ్రహాలను ఖమ్మం జిల్లా కేంద్రంలో, ఆయన సమాధి ఉన్న నాయకనగూడెంలో ఏర్పాటు చేయాలని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.కేశవదాసు నల్గొండ జిల్లా కోదాడ సమీపంలోని తమ్మరబండ పాలెంలో ప్రతిష్టాత్మకమైన సీతారామచంద్ర దేవాలయం నిర్మించారు. ఆయన రాసిన తొలి గేయాన్ని ఆయన సమాధి వద్ద శిలాఫలకంపై చెక్కించాలని, అదేవిధంగా తొలి తెలంగాణ జాతీయ గీతాన్ని రాసిన రావెళ్ల వెంకట్రామారావు విగ్రహాన్ని కూడా నెలొకొల్పాలని, ఖమ్మంలోని జిల్లా గ్రంథాలయ సంస్థకు ఆయన పేరు పెట్టాలని గౌరీశంకర్ ప్రభుత్వాన్ని కోరారు.

లోకం తీరు! (కథ)

విజయవాడలో ఓ అడ్రసు కాగితం పట్టుకుని సందుల్లో అపార్ట్‌మెంట్ల పేర్లు చదువుతూ, అలా చూసుకుంటూ తన వేలు విడిచిన మేనమామ ఇంటి కోసం ఎండన పడి తిరుగుతున్నాడు వంశీ.
అమ్మకి దూరపు బంధువైన చలపతిరావుని కలవమని ఆమె ఎన్నాళ్లగానో అతనికి చెబుతోంది. వీలైతే అతన్ని ఒకసారి తీసుకురమ్మని కూడా చెబుతోంది. తీరిక లేక వంశీయే అతన్ని తీసుకురాలేకపోయాడు.

- పుష్ప గుర్రాల

దీక్ష విరమించిన ముద్రగడ కొడుకు, కోడలు

రాజమహేంద్రవరం, జూన్ 18: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి గత వారం రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలలో దీక్ష చేస్తున్న పద్మనాభం కుమారుడు ము ద్రగడ గిరి, కోడలు సిరి శనివారం రాత్రి 10గంటలకు దీక్ష విరమించారు. ఈ సందర్భంగా గిరి, సిరితోపాటు ముద్రగడ వియ్యంకుడు శివాజీ విలేఖర్లతో మాట్లాడుతూ వైద్యుల సూచనల మేరకు దీక్ష విరమించినట్టు తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలో సరైన సదుపాయాల్లేవని, నలుగురికీ కలిపి ఒకే గదిని కేటాయించారని, ఒకే బాత్రూమ్‌ను వినియోగించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్ర ప్రభుత్వం కూడా తెలంగాణ తరహాలో సమీక్షించాలి

హైదరాబాద్, జూన్ 18: ఆంధ్రా ఆర్టీసి ఆర్థిక స్థితిగతులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తరహాలో ఏపి ప్రభుత్వం కూడా ఆర్టీసిలో అధికారులతో విసృత స్ధాయి సమావేశం నిర్వహించాలని ఏపిఎస్‌ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి వి దామోదరరావు డిమాండ్ చేశారు. ఆర్టీసి ఎండి సాంబశివరావు ఆర్టీసి అభివృద్ధికి మెరుగైన చర్యలు తీసుకుంటున్నారని, కాని పూర్తిస్థాయి వాస్తవ వివరాలు తెలుసుకునేందుకు ఒక సదస్సును నిర్వహించాలని కోరారు. విభజన తర్వాత ఆంధ్రా ఆర్టీసి అనేక ఆర్థిక ఇబ్బందులకు లోనైందన్నారు.

ఖాళీలపై రోస్టర్ సిద్ధం

హైదరాబాద్, జూన్ 18: ఆంధ్రప్రదేశ్‌లో భర్తీ చేయబోతున్న 10వేల పోస్టులపై రాష్ట్రప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వివిధ శాఖల్లో ఏయే కేటగిరి పోస్టులను భర్తీ చేయబోతున్నదీ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు సమాచారం ఇచ్చింది. ఇప్పటికే పోస్టుల రోస్టర్‌ను సిద్ధం చేసిన అధికారులు వారం రోజుల్లో నోటిఫికేషన్లు జారీ చేయనున్నారని తెలిసింది.

మచిలీపట్నంలో బాంబు కలకలం!

మచిలీపట్నం, జూన్ 18: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం రాత్రి బాంబు కలకలం సృష్టించింది. కర్ణాటక ముఖ్యమంత్రి, గవర్నర్‌కు లీగల్ అడ్వైజర్‌గా భావిస్తున్న వికాస్ భాను సోడే అమ్మమ్మ చలమలశెట్టి సంజీవమ్మ స్వస్థలం మచిలీపట్నం. ఈమె మాచవరంలో నివశిస్తోంది. గత మూడు నెలల నుండి వికాస్ భాను సోడే ప్రతినెలా మూడో శనివారం తన అమ్మమ్మ ఇంటి పక్కనున్న ఆంజనేయస్వామి గుడిలో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం కూడా వైద్య శిబిరం నిర్వహించారు. ఈయనకు కర్ణాటకలో ప్రాణహాని ఉన్నట్టు సమాచారం.

తొలకరి వచ్చింది.. ఉత్సాహం తెచ్చింది

హైదరాబాద్, జూన్ 18: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాల మూలంగా తొలకరి జల్లులు కోస్తా, రాయలసీమ అన్ని జిల్లాలతో పాటు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పడుతుండటంతో రైతులు ఆనందపడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తరించాయి. ఈ రుతుపవనాలు మిగిలిన తెలంగాణ జిల్లాల్లో సోమవారం లోపు విస్తరిస్తాయని ఐఎండి శాస్తవ్రేత్త చరణ్‌సింగ్ ప్రకటించారు. గత 20 రోజుల నుండి అక్కడక్కడా కురిసిన వర్షాలు రుతుపవనాల ముందస్తు వర్షాలేనని, ఇక నుండి కురిసే వర్షాలు రుతుపవనాల ప్రభావంగా కురిసే వర్షాలని వివరించారు.

Pages