S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాగంలా పల్స్ సర్వే

విజయవాడ, జూన్ 18: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను నిజమైన లబ్ధిదారులకు చేర్చడం కోసమే స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇది ప్రజలందరి సంపూర్ణ వివరాలకోసం చేపడుతున్న సర్వే అని, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాబోదన్నారు. ప్రభుత్వం ఈనెల మూడవ వారంలో చేపట్టనున్న స్మార్ట్ పల్స్ సర్వేపై శనివారం మధ్యాహ్నం తన నివాసం నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భవిష్యత్‌లో ఆధార్ సంఖ్యలేని ప్రజలకు ప్రభుత్వపరంగా ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందబోవని సిఎం స్పష్టం చేశారు.

వెలగపూడే శాశ్వతమా?

గుంటూరు, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణం తాత్కాలికమా? శాశ్వతమా? అనేది అంతుపట్టడం లేదు. ముఖ్యమంత్రి పదే పదే తాత్కాలిక భవనాలేనని చెబుతున్నా, చేసే ఖర్చు, నిర్మాణాల తీరు చూస్తే శాశ్వత భవనాలను తలపిస్తున్నాయి. ఓవైపు 750 కోట్ల రూపాయల వ్యయంతో తాత్కాలిక సచివాలయ భవనాలను కడుతుండగా, దాని ఎదురుగానే అసెంబ్లీ భవన సముదాయాన్నీ ఇటీవలే ప్రారంభించారు. దీనికి అంచనా వ్యయంపై స్పష్టత రాలేదు. వచ్చే శాసనసభ సమావేశాలు రాజధాని ప్రాంతంలో నిర్వహిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.

విశాఖలో కాశ్మీరం!

విశాఖపట్నం, జూన్ 18: కాశ్మీర్ పేరు చెబితే స్పురించేది తియ్యటి యాపిల్స్. మనకు సదా అందుబాటులో ఉండే యాపిల్స్ అత్యధిక శాతం కాశ్మీర్, సిమ్లా ప్రాంతాల నుంచే దిగుమతి అవుతుంటాయి. మనం తినే యాపిల్స్‌ను మనమే పండిస్తే పోలా అన్న అలోచన స్పురించడంతో మన శాస్తవ్రేత్తలు ఆ దిశగా అడుగులు వేశారు.. విజయం సాధించారు. చింతపల్లిలోని ఆచార్య రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్తవ్రేత్తలు చేసిన ప్రయోగాలు ఫలించాయి. యాపిల్ సాగుకు అనువైన వాతావరణం మన రాష్ట్రంలోనే ఉందని, ఆ దిశగా విస్తృత ప్రయోగాలు చేసి విజయం సాధించారు. ప్రయోగాత్మకంగా కొద్దిపాటి వ్యవసాయ క్షేత్రంలో పండించిన యాపిల్ మొక్కలు మొగ్గతొడిగి కాయ రూపు దాల్చాయి.

పొద్దుతిరుగుడు పువ్వుల పరిమళం

రాజకీయాల్లో నైతిక విలువలు నేతిబీర చందం. రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారుతున్నాయని, తాము విలువల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నామని, అసలు తామొక్కరే నైతిక మడి కట్టుకున్నామని ఎవరైనా చెబితే, సదరు నైతికమూర్తుల వ్యక్తిత్వాన్ని నిలువునా శంకించాల్సిన రోజులివి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈమధ్య ఫిరాయింపు రాజకీయాలపై వాపోయారు. రాజకీయాలు ఇంతగా దిగజారాయని మహా ఆవేదన చెందారు. కానీ, ఈ రాష్ట్రంలో అలాంటి పవిత్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందే తన పార్టీ అన్న విషయం ఆయనకు తెలియకపోవడం ఆశ్చర్యం.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144

నిర్వాసితులపై సర్కారీ ప్రచారపు దాడి

రెండు రాష్ట్రాల్లో పరిపాలన నడిచినా, నత్తలా సాగినా, సాగకపోయినా ‘అభివృద్ధి’ మాత్రం పరుగులు తీస్తున్నది. ఓసారి అటు ఓమాటు ఇటు, అభివృద్ధి తక్కెడ ఎక్కువ తక్కువలు రెండు వేపులా సమంగా.
ఇక్కడే కాదు, దేశం మొత్తం మీద అభివృద్ధి మంత్రం వీస్తున్నది. పాలకులు దానిమీద తమ ప్రాణాలు నిలుపుకుంటున్నారు. అదేపనిగా దాని నామ స్మరణం. దానినే రామనామంలా పఠిస్తున్నారు.

‘మాటకు కట్టుబడవలెను’

‘‘డార్లింగ్ గుడ్ న్యూస్. మన కలలు ఫలిస్తున్నాయి.. ’’
‘‘మీ బంధువులెవరన్నా పోయి మనకు ఆస్తి కలిసొస్తుందా? రజనీకాంత్ సినిమాలోలా ఎప్పుడో ఇంటిని విడిచి వెళ్లిపోయిన మీ నాన్న కోట్ల రూపాయల ఆస్తి నీకే చెందుతుందని విల్లు రాశాడా? ’’
‘‘చిలిపి నీ కెప్పుడూ తమాషాలే. అంత కన్నా సంతోషకరమైన వార్త. నేను తల్లిని కాబోతున్నాను. పార్కుల వెంట, ఐ మ్యాక్స్ థియోటర్ల మధ్య పరుగులు మానేసి ఇక మనం పెళ్లి చేసుకోవాలి’’
‘‘వావ్’’
‘‘అదేంటి డియర్ తెలుగు చానల్స్‌లో వంట తినగానే అన్నట్టు వావ్ అంటున్నావ్. నీకిది సంతోషకరమైన విషయమేనా? కాదా? ’’

వౌనమేలనోయి

కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకుని తామెందుకు పార్టీ మారుతున్నామో సుదీర్ఘంగా వివరించారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌లతో పాటు నాయకులంతా తమతమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాత్రం ఇప్పుడు తానేమీ మాట్లాడలేనని ఆవేదనతో ఉన్నట్టు చెప్పారు. పాపం కాంగ్రెస్ నుంచి వీడి వెళుతున్నందుకు భాస్కర్‌రావు ఎంత ఆవేదన చెందుతున్నారో అని అంతా అనుకున్నారు. నిజానికి మిగిలిన నాయకులందరి కన్నా ముందు నుంచే భాస్కర్‌రావు టిఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. మరి ఈ బాధ ఎందుకూ అంటే ?

అమ్మ-చెట్టు

అమ్మ మాతృత్వానికి ప్రతీక
చెట్టు పర్యావరణానికి పతాక
అమ్మ అమృత ఔషధి...
తాగించి మనిషిని చేస్తే...
చెట్టు నిరంతరం
ప్రాణ వాయువునందించే
జీవన నేస్తం...
అమ్మ హాయి నిదురకు
బొమ్మరిల్లు కతలు చెబితే..
చెట్టు చందమామను
కొమ్మలపై దింపి చల్లగాలితో
జోలపాట పాడుతుంది...
అమ్మ తొలి గురువై
అక్షరాలు దిద్దిస్తే...
చెట్టు ఊయలై
పద్యాలు వల్లె వేయిస్తుంది..
అమ్మ బడి బాటకు
ఎండలో గొడుగు పడితే
చెట్టు అటూ ఇటూగా నిలిచి
నీడనిచ్చింది...
అమ్మ కడుపునిండా...
అన్నం పెట్టే అనురాగ దేవత

-మడిపల్లి హరిహరనాథ్ 9603577655

అనుకున్నది అనుకున్నట్లుగా...

కలలాంటి ఒక అద్భుతం జరిగి
కారే కన్నీటి మూలాలు
కదలాడే బొమ్మల్లా ప్రతిబింబిస్తే...
ఆమూలాన్ని సమూలంగా నిర్వీర్యం చేయొచ్చు
గుండె గాయాల కథల్ని ఎక్స్‌రేలా
తెలియజేసే పరిశోధన మొదలైతే
గాయాలకు ఔషధ లేపనం అద్దినట్లే!
కరువు కాటకాలను కాటేసి
రైతుల పెదాలపై చిరునవ్వును చూడగలిగే
మంత్రం లాంటి కొత్త పరికరం రూపొందిస్తే
పుడమి పులకించినట్లే!
దేశ వినాశనానికి పావులుకదిపే
దేశ విద్రోహుల్ని
ఏకకాలంలో తుదముట్టించే
సరికొత్త ఆయుధం మన ముందుకొస్తే
సంబరాల వేడుకలు ఊరు వాడ నిండినట్లే!
హంతకుడి ఆవేశాన్ని కంటిచూపుతో

క్రిటిక్-క్రియేటర్

కథల పోటీలో
సాధారణ ప్రచురణకు
ఎంపికైన రచన
***
వికాస్ ఓ సినిమాకి దర్శకత్వం చేయబోతున్నాడన్న వార్త కొంతమంది నెటిజన్లని ఆకర్షించింది. ఇప్పటిదాకా అతనో ఫిల్మ్ క్రిటిక్. ఒకరిద్దరు నిర్మాతలు కూడా దీన్ని గమనించారు.
* * *
అదో ప్రైవేట్ సంభాషణ.
అందులో ముగ్గురు నిర్మాతలు, ఓ మేధావి వున్నారు.
‘జనానికి ప్రీచ్ చేయటం వేరు. నేరుగా రంగంలోకి దిగటం వేరు. వికాస్‌గాడి ప్రతిభ ఏంటో త్వరలో చూద్దాం’ అన్నాడు రమేష్.
‘ఓ కోటి రూపాయలు పోయినా వాడితో నేనే ఓ సినిమా తీద్దాం అనుకున్నాను’ అన్నాడు మహేష్, అతనో పెద్ద నిర్మాత.

-సృజన్‌సేన్

Pages