S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దాలవంతెన

ఈ చిత్రంలో కనిపిస్తున్న అద్దాల వంతెనకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఈ అద్దాల వంతెన అత్యంత ఎతె్తైనది, పొడవైనదికూడా. వంతెనపై నడవాల్సిన ప్రదేశం (అడుగుభాగం) అంతా మందమైన గాజుతో చేసినదే. చైనాలోని హూనన్ ప్రావిన్స్‌లో జాగ్జియాజీ గ్రాండ్ క్యానన్‌లో ఇది కన్పిస్తుంది. పర్యాటకులకు ఇది పెద్ద ఆకర్షణగా మారింది.

భారతి

చికెన్ కర్రీ...సీగల్

ఈ సీగల్‌కు చికెన్ కర్రీపై మనసుపడింది. వేల్స్‌లోని ఓ చికెన్ రెస్టారెంటవద్ద తిరుగుతున్న ఈ పక్షి ఉన్నట్లుండి ఓ డస్ట్‌బిన్‌లో చికెన్ కర్రీని గమనించి అందులోకి దూకేసింది. తీరా దానికి చికెన్‌పీస్‌లు దొరకలేదు. కానీ చికెన్‌టిక్కా మసాలా గ్రేవీలో ఇది పూర్తిగా ములిగిపోయింది. తెల్లగా మెరిసిపోవాల్సిన సీగల్ మసాలా ఒంటపట్టించుకుని ఇదిగో ఇలా తయారైంది. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న కార్మికులు దీనిని గమనించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. సీగల్స్ ఆహారంకోసం ఎంతకైనా తెగిస్తాయని తెలుసుగా. అవసరమైతే మనుషుల చేతుల్లోని ఆహార పదార్థాలనూ అవి దొంగిలిస్తాయి.

భారతి

వెలుగుల సిడ్నీ

ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో పలు ఉద్యానవనాలు, జంతుప్రదర్శన శాలలు నెల్లాళ్లుగా విద్యుద్దీప కాంతులతో మిలమిల మెరిసిపోతున్నాయి. ఏటా మే చివరివారంనుంచి జూన్ మూడోవారం వరకు ఈ వెలుగుల పండుగను జరుపుకుంటారు. కొత్త ఆలోచనలు, విద్యుత్‌కాంతులు, ప్రదర్శనలు ఈ వేడుక ప్రత్యేకతలు. సిడ్నీ ఒపెరాసహా ప్రధాన కూడళ్లన్నీ ఇలా మెరిసిపోతున్నాయి. ప్రఖ్యాత తొరంగ జూలో ఏర్పాటు చేసిన ఏనుగు, ఎకిడ్నా విద్యుత్ వెలుగుల బొమ్మలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

భారతి

జిల్లాల్లోనూ పరిశ్రమలు రావాలి: కెటిఆర్

హైదరాబాద్: పారిశ్రామికీకరణ కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కారాదని, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆయన శనివారం ఇక్కడ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. తెలంగాణ పారిశ్రామిక విధానం నేడు దేశదేశాల్లో ప్రశంసలు పొందుతోందని, ఎన్నో దేశాలకు చెందినవారు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. అత్యంత వేగవంతంగా, పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. తెలంగాణలోని సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ యువతకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పడాలన్నారు.

రెండోసారి బాధ్యతలకు రఘురాం రాజన్ నో

ముంబయి: రెండోసారి పదవిలో కొనసాగేందుకు తనకు ఇష్టం లేదని రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ శనివారం తన అంతరంగాన్ని బహిర్గతం చేశారు. ఆయన తీసుకున్న కీలక నిర్ణయం బ్యాంకింగ్ రంగంలో ఇపుడు చర్చనీయాంశమైంది. తన తర్వాత ఆర్‌బిఐ గవర్నర్‌గా వచ్చే వ్యక్తి మంచి ఫలితాలను సాధించాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఆర్‌బిఐ నుంచి తప్పుకున్నాక ఈ ఏడాది సెప్టెంబర్ 4 తర్వాత తాను మళ్లీ బోధనా రంగంలో కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా, ఆర్‌బిఐ పదవి నుంచి రఘురాం రాజన్‌ను తప్పించాలని ఇటీవల బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి పదే పదే ప్రధానికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే.

టి.సర్కారుపై ఒత్తిడి తెస్తాం: లోకేష్

హైదరాబాద్: మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ల విషయమై ఇచ్చిన హామీలను అమలు చేసేలా తెలంగాణ సర్కారుపై ఒత్తిడి తెస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ తెలిపారు. ఇక్కడ శనివారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలను ఆయన సమీక్షించారు. అన్ని నియోజకవర్గాలకూ పార్టీ ఇన్‌చార్జిలను నియమించాలని, హైదరాబాద్, వరంగల్‌లో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

ముద్రగడ ఆరోగ్యం బాగానే ఉంది..

హైదరాబాద్: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని ఎపి మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం తెలిపారు. ముద్రగడ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు.

వాస్తుశాస్త్రంతో టి.సర్కారు పాలన!

హైదరాబాద్: తెలంగాణలో రాజ్యాంగం ప్రకారం కాకుండా- వాస్తు నమ్మకాలపై ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ శనివారం ఇక్కడ జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆరోపించారు. వాస్తుదోషాలంటూ ప్రజలను మభ్యపెడుతూ తెరాస పాలన సాగుతోందన్నారు. కేంద్రం ఎంతగా ఆదుకుంటున్నా కొందరు తెరాస మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు కుటుంబ పాలన సాగుతోందన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడానికి ఎంతో దూరం లేదన్నారు. ఇక్కడ తమకు 14 శాతం ఓటుబ్యాంకు ఉందన్నారు.

కర్నాటకలో క్యాబినెట్ ప్రక్షాళనకు సోనియా ఓకే

బెంగళూరు: కర్నాటక మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎట్టకేలకు పచ్చజెండా ఊపారు. మంత్రివర్గం ప్రక్షాళన విషయమై కర్నాటక సిఎం సిద్ధరామయ్య, కెపిసిసి అధ్యక్షుడు పరమేశ్వర్ శుక్ర, శనివారాల్లో దిల్లీలో సోనియా, రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌లతో మంతనాలు జరిపారు. తన ప్రతిపాదనలకు సోనియా శనివారం ఆమోదం తెలిపారని, ఒకటి రెండు రోజుల్లో కొత్త మంత్రివర్గం జాబితాను గవర్నర్‌కు సమర్పిస్తానని సిఎం తెలిపారు.

డ్రగ్‌ స్కాంలో నటి మమతా కులకర్ణి

ముంబయి: రూ.2వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ కుంభకోణంలో బాలీవుడ్‌ నటి మమతాకులకర్ణి పేరును మహారాష్ట్ర పోలీసులు చేర్చారు. మమతా కులకర్ణికి ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే పది మంది అరెస్టయ్యారు. డ్రగ్‌ రాకెట్‌కు మమత, ఆమె భర్త విక్కీ ప్రధాన సూత్రధారులని తేలిందని థానే పోలీసు అధికారి పరమ్‌వీర్‌ సింగ్‌ వెల్లడించారు. కెన్యాకు చెందిన కులకర్ణి భర్త గోస్వామి డ్రగ్‌ మాఫియా కేసులో యూఏఈలో అరెస్టయ్యాడు. 2013లో వీరి వివాహం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పోలీసులు డ్రగ్స్‌ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు.

Pages