S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్సిటీలో అక్రమాలపై నేటి నుండి విచారణ

నాగార్జున యూనివర్సిటీ, జూన్ 16: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వివిధ శాఖలలో అక్రమాలు జరిగాయని పత్రికలలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ గురువారం నుండి విచారణ చేపట్టనుంది. ఇష్టానుసారం జరిగిన సిబ్బంది నియమకాలు, అనర్హులకు పదోన్నతులు కల్పించటం వంటి పలు అక్రమాలపై పలు కథనాలు రావటంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. దీనిపై రాష్ట్ర కళాశాల, సాంకేతిక శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. వర్సిటీలో జరిగిన అక్రమాలపై వర్సిటీలో వచ్చిన కథనాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.

టివిలో అయనా చూపించండి

ప్రత్తిపాడు, జూన్ 16: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష గురువారం 8వ రోజుకు చేరుకోవడంతో కిర్లంపూడి మండలంలో ఆందోళన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తమ నాయకుడిని చూడడానికి వెళ్ళనీయకుండా పోలీసులు నిరోధించడం అన్యాయమని, కనీసం టివీల ద్వారానైనా ముద్రగడను తమకు చూపించాలని కిర్లంపూడి మండలంలోని సింహాద్రిపురం మహిళలు అడ్డురోడ్డుపై బైఠాయించారు.

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుచానూరు, జూన్ 16: కలియుగ ప్రత్యక్షదైవంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పట్టపుదేవేరి అయిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి స్వామివారు పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ కృష్ణస్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు.

ఉద్యమంలోకి కృష్ణారెడ్డి

కడప, జూన్ 16:రాయలసీమ జిల్లాల్లో మావోయిస్టుల అగ్రనేతగా రాష్ట్ర కమిటీ సభ్యునిగా విప్లవ ఉద్యమాల్లో పాల్గొన్న గజ్జల కృష్ణారెడ్డి అలియాస్ రమణారెడ్డి (58) గురువారం కర్నూలులో రాయలసీమ జోన్ ఐజి శ్రీ్ధర్ వద్ద లొంగిపోయారు. ఆయన జిల్లాలోని వీరపునాయునిపల్లె మండ లం అనిమెలకు చెందిన రిటైర్డ్ టీచర్ గజ్జల చెన్నారెడ్డి కుమారుడు. ఆయన తల్లి చిన్నతనంలో మరణించగా చెన్నారెడ్డి 15 ఏళ్ల క్రితం మరణించాడు. గజ్జల కృష్ణారెడ్డి విద్యార్థి దశ నుంచి రాడికల్స్, మావోయిస్టుల ఉద్యమంలో పాల్గొంటూ కడప బాలుర డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువులకు అర్ధాంతరంగా స్వస్తి పలికి 1976 నుంచి ఆయన విప్లవ ఉద్యమంలో కొనసాగారు.

జిల్లాలో ఐదు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు

అనంతపురం, జూన్ 16 : జాతీయ రహదారుల అభివృద్ధి చర్యల్లో భాగంగా ఓవర్ బ్రిడ్జిలతోపాటు మరో మూడు టోల్‌గేట్లు నిర్మించే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా పరిధిలోని 42వ నంబర్ జాతీయ రహదారిలోని ఉరవకొండ- అనంతపురం-కృష్ణగిరి మార్గం, అనంతపురం-మదనపల్లి మధ్య ఐదు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. వీటిలో ముదిగుబ్బ శివారులోని రైల్వే క్రాసింగ్‌పై రూ.83.03 కోట్లతో ఒక ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు.

ఢీ

అనంతపురంటౌన్, జూన్ 16: అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యుల తరహాలో తెలుగుదేశం ఎంపి జె.సి.దివాకరరెడ్డి, ఎమ్మెల్యే వి.ప్రభాకరచౌదరిలు గురువారంనాటి అనంత కౌన్సిల్ సమావేశంలో ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో ప్రసంగాలు చేశారు. వారు సభలో ఉన్నంతసేపు కౌన్సిల్‌లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోను నెలకొంది. కౌన్సిల్‌లో పోలీసులు ప్రవేశించి ఎలాంటి పరిస్థితినైనా అదుపుచేసే క్రమంలో సిద్ధమయ్యారు. నిబంధనల ప్రకారం కౌన్సిల్ హాలులోకి పోలీసుల ప్రవేశం నిషిద్ధం. అలాగే బయటి వ్యక్తులు కూడా పోలీసులు ఉన్నా సభలోనే ఉండిపోయారు.

జూలై ఆఖరుకు అందరికీ రేషన్ కార్డులు

హైదరాబాద్, జూన్ 16:అర్హులైన లబ్దిదారులందరికీ జూలై ఆఖరు నాటికి రేషన్ కార్డులు అందజేయనున్నట్టు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి నిర్దేశిత కోటా ప్రకారం బియ్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలని అన్నారు. పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర అధికారులతో మంత్రి ఈటల గురువారం పౌర సరఫరాల శాఖపై సమావేశం జరిపారు. ఆన్‌లైన్ ద్వారా ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ విధానం ద్వారా బియ్యం సేకరణ, జిహెచ్‌ఎంసి పరిధిలో చౌక ధరల దుకాణాల్లో ఈ పాస్ వ్యవస్థ పనితీరుపై చర్చించారు.

రేవంత్ భద్రతపై ఆలోచించండి

హైదరాబాద్,జూన్ 16: తనకు పోలీసు భద్రతను పెంచాలంటూ తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఎ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ విషయమై ఆలోచించి అవసరమైన నిర్ణయాన్ని తీసుకోవాలని హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది. అనంతరం ఈ కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసును గురువారం న్యాయమూర్తి ఏ రాజశేఖరరెడ్డి విచారించారు. తనకు భద్రత పెంచాలని, గన్‌మెన్‌ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖకు ఈ ఏడాది మార్చి 14వ తేదీన లేఖ రాశానని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. తనకు టిఆర్‌ఎస్ ప్రభుత్వ నుంచి ముప్పు పొంచి ఉందని ఆరోపణ చేశారు.

గుత్తాపై స్పీకర్‌కు ఫిర్యాదు?

హైదరాబాద్, జూన్ 16: పార్టీ ఫిరాయించిన నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిపై అనర్హత అస్త్రం ప్రయోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో తెరాస సాగిస్తోన్న ఫిరాయింపుల రాజకీయాలను జాతీయ స్థాయిలో చర్చ చేయాలన్న దిశగా అడుగులు వేస్తోంది. తమ పార్టీ గుర్తుపై గెలిచి, ఇటీవలే కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరిన లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనుంది.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు రూ. 530 కోట్లు

హైదరాబాద్, జూన్ 16: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ. 530 కోట్లు ఖర్చు చేసినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని బిసీలు, ఇబిసిలకు కూడా వర్తింప చేయడంతో దీనికి రూ. 738 కోట్లు కేటాయించినట్టు ముఖ్యమంత్రి వివరించారు. ఈ పథకాన్ని బిసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అదేశించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా పెండ్లికి ముందే ఆడపిల్లల చేతికి చెక్కు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Pages