S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో పెట్టుబడులపై జపాన్ ఆసక్తి

టోక్యో, మే 29: భారతీయ వౌలికరంగాభివృద్ధిని జపాన్ మదుపరులు దగ్గరగా గమనిస్తున్నారని, ఈ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారని, భారత్‌లోని వివిధ రంగాల్లో పెట్టుబడులతో వస్తామని చెబుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం జపాన్‌కు చేరిన జైట్లీ.. అక్కడ జపాన్ బహుళవ్యాపారరంగ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ సిఇఒ మసయోషి సన్‌తో సమావేశమయ్యారు. ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ నుంచి భారత్‌లోకి భారీగా పెట్టుబడులను పట్టుకురావడమే లక్ష్యంగా జైట్లీ ఈ పర్యటనను చేస్తున్నారు.

కోల్ ఇండియా లాభం రూ. 4,248 కోట్లు

న్యూఢిల్లీ, మే 29: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో స్వల్పంగా పెరిగి 4,247.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 4,238.55 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే స్టాండలోన్ ఆధారంగా క్రిందటిసారితో చూస్తే 44.8 శాతం పెరిగి 9,629.23 కోట్ల రూపాయల నుంచి 13,950.12 కోట్ల రూపాయలకు ఎగిసింది. ఇక సంస్థ మొత్తం ఏకీకృత ఆదాయం 21,402.75 కోట్ల రూపాయలకు చేరింది. నిరుడు ఇది 21,339.55 కోట్ల రూపాయలుగా ఉంది.

ఈసారి వడ్డీరేట్లు యథాతథం

న్యూఢిల్లీ, మే 29: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వచ్చే నెల 7న జరిపే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే వీలుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో మాత్రం మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లు తగ్గేందుకు వీలుందని అభిప్రాయపడింది. రిటైల్ ద్రవ్యోల్బణం మున్ముందు మరింతగా తగ్గుముఖం పడుతుందని, వచ్చే ఏడాది మార్చికల్లా 4.5 శాతానికి తగ్గవచ్చని ఓ రిసెర్చ్ నోట్‌లో మోర్గాన్ స్టాన్లీ చెప్పింది. కాగా, గత నెల ఏప్రిల్‌లో నిర్వహించిన ద్రవ్యసమీక్షలో రెపో రేటును ఆర్‌బిఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించినది తెలిసిందే.

‘వర్షాభావంతోనే పప్పుల ధరలకు రెక్కలు’

లక్నో, మే 29: పప్పు్ధన్యాల ధరలు పెరగడానికి కారణం.. గడచిన రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, విదేశాల నుంచి పడిపోయిన పప్పు దిగుమతులేనని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. రిటైల్ మార్కెట్‌లో పప్పు ధరలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో పాశ్వాన్ పైవిధంగా స్పందించారు. ‘పప్పు్ధన్యాల ధరలు పెరగడానికి పలు కారణాలున్నాయి. గడచిన రెండేళ్లుగా తగ్గిన వర్షపాతంతో పంటల దిగుబడి గణనీయంగా దిగజారింది. మరోవైపు దేశంలోకి విదేశాల నుంచి వచ్చే పప్పు దిగుమతులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్.. ప్రీ క్వార్టర్స్‌కు సెరెనా

పారిస్, మే 29: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరింది. కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసిన ఆమె మూడో రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ను 6-4, 7-6 తేడాతో ఓడించింది. క్వార్టర్స్‌లో స్థానం కోసం ఆమె ఉక్రెయిన్‌కు చెందిన 18వ సీడ్ ఎలినా స్విటోలినాను ఢీ కొంటుంది. మూడో రౌండ్‌లో స్విటోలినా మాజీ చాంపియన్ అనా ఇవానోవిచ్‌పై విజయభేరి మోగించింది.

‘జికా’ భయం!

పారిస్, మే 29: సెరెనా విలియమ్స్‌ను జికా వైరస్ భయం వెంటాడుతున్నది. ఆగస్టులో రియో ఒలింపిక్స్ జరగనుండగా, అక్కడ తీవ్రమవుతున్న జికా వైరస్ సమస్య ఆందోళన కలిగిస్తున్నదని సెరెనా చెప్పింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మూడో రౌండ్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ను ఓడించిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ బ్రెజిల్‌ను జికా వైరస్ కుదిపేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా జికా వైరస్ తీవ్రంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానాన్ని ఆక్రమించిందని ఆమె పేర్కొంది.

విజయమే లక్ష్యం

జకార్తా, మే 29: క్వాలిఫయర్స్‌తో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని భారత స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ చెప్పింది. ఈ ఈవెంట్ కోసం జకార్తా వచ్చిన ఆమె పిటిఐతో మాట్లాడుతూ ఫిట్నెస్ సమస్యలేవీ ప్రస్తుతం బాధించడం లేదని చెప్పింది. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న నేపథ్యంలో జకార్తా ఓపెన్ వామప్ ఈవెంట్‌గా ఉపయోగపడుతుందని తెలిపింది. కాలి మడమ గాయం కారణంగా ఇటీవల చాలా టోర్నీలకు గైర్హాజరైన సైనా ఈ సీజన్‌లో ఒక్క టైటిల్ కూడా గెల్చుకోలేకపోయింది. అయితే, మహిళల టీం ఈవెంట్ ఉబేర్ కప్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

రియోకు సీమ క్వాలిఫై

న్యూఢిల్లీ, మే 29: భారత వెటరన్ డిస్కస్ త్రోయర్ సీమా పునియా రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం కాలిఫోర్నియాలోని సలినాస్‌లో జరుగుతున్న పాట్ యంగ్స్ త్రోయర్స్ క్లాసిక్ ఈవెంట్‌లో పాల్గొన్న 32 ఏళ్ల సీమ 62.62 మీటర్ల దూరానికి డిస్కస్‌ను విసిరి ఒలింపిక్స్ అర్హతగా నిర్దేశించిన 61 మీటర్ల దూరాన్ని సులభంగా పూర్తి చేసింది. రియోకు అర్హత సంపాదించింది. ఈ క్రమంలో భాగంగా ఆమె 2008 ఒలింపిక్ డిస్కస్ త్రో చాంపియన్ స్ట్ఫోనీ బ్రౌన్ ట్రాఫ్టన్‌ను రెండో స్థానానికి నెట్టి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 2004 ఒలింపిక్స్‌లో పాల్గొన్న సీమ 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ పోటీపడింది.

Pages