S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారండి..బాగుపడండి

హైదరాబాద్, మే 27: పేద, బడుగు వర్గాల ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసే గుడుంబా తయారీని మానుకుని, మీ అంత మీరే మీలో మార్పు తెచ్చుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ధూల్‌పేట వాసులకు హితవు పలికింది ధూల్‌పేట పునరావాస కమిటీ. కలెక్టర్ రాహుల్ బొజ్జ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. పోలీసులు, ఎక్సైజ్ శాఖల అధికారులతో పాటు జియాగూడ, కార్వాన్, మంగల్‌హాట్, గోషామహల్ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా పాల్గొని ధూల్‌పేట అభివృద్ధిపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

షాబాద్, మే 27: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని చర్లగూడలో జరిగింది. షాబాద్ ఎస్‌ఐ శ్రీ్ధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చర్లగూడ గ్రామానికి చెందిన పడగంటి రవీందర్‌రెడ్డి(40) తనకున్న 4 ఎకరాల పొలంలో పత్తి, మొక్కజొన్న, పంటలు సాగు చేశాడు. గత కొనే్నళ్లుగా వర్షం సరిగ్గా కురియకపోవడంతో పంట దిగుబడి రాలేదు. దీంతో అప్పులు ఎక్కువ కావడంతో ఏం చేయాలో తెలియక బాధపడుతూ తన కుటుంబ సభ్యులతో చెప్పి ఆవేదన చెందుతుండేవాడు. అతని కుమార్తె నిఖితారెడ్డి బిటెక్ చదువుతుండగా, కుమారుడు వంశీధర్‌రెడ్డి పదవతరగతి చదువుతున్నాడు.

గుడిసెలను తొలగించి డబుల్ బెడ్‌రూం ఇళ్లు

రాజేంద్రనగర్, మే 27: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరబోతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. శుక్రవారం అరాంఘర్ చౌరస్తాలోని ఇంద్రారెడ్డినగర్‌లో సుమారు 150 కుటుంబాలు గుడిసెలు వేసుకొని గత ముప్పై ఏళ్లుగా ఉంటున్న ప్రజలు ఎమ్మెల్యేను కలిసి తమ గోడును వెల్లిబుచ్చుకున్నారు. ముప్పై ఏళ్లుగా అరాంఘర్‌లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నామని, ఏ ప్రభుత్వాలు వచ్చినా గుడిసెలను తొలగించడానికి చూస్తున్నారే తప్ప మాకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వెల్లిబుచ్చారు.

నవంబర్ వరకు కంటోనె్మంట్ రోడ్ల మూసివేత వాయదా

అల్వాల్, మే 27: కంటోనె్మంట్‌లో రోడ్ల మూసివేత నిర్ణయాన్ని మరో ఆరుమాసాలు పాటు వాయిదా వేస్తూ కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అధికారికంగా కంటోనె్మంట్ బోర్డు కార్యాలయానికి, బొల్లారంలోని తెలంగాణ మిలటరీ సబ్ ఏరియా కమాండర్ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి.
ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం నవంబరు 30 వరకు రోడ్లను మూసివేయకుండా యథాస్థితిని కొనసాగిస్తారు. జూన్‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానికులతో సమావేశమై సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారని కేంద్రరక్షణ శాఖ అండర్ సెక్రటరీ యస్‌కె ఝా ఉత్తర్వులు జారీచేశారు.

రాష్ట్ర ఆవిర్భావ సంబరాలకు నగరం ముస్తాబు

హైదరాబాద్, మే 27: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ముఖ్యంగా నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వచ్చే నెల 2న జరిగే రాష్ట్ర ఆవిర్బావ ఉత్సవాలకు ట్యాంక్‌బండ్ ప్రాంతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారనుంది. ట్యాంక్‌బండ్ చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న సచివాలయం, జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం, అసెంబ్లీ భవనాలకు ముస్తాబు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

‘స్థారుూ’ ఎన్నికకు 46 నామినేషన్లు

హైదరాబాద్, మే 27: జిహెచ్‌ఎంసి అభివృద్ధి పనులు, పౌర సేవల నిర్వహణతో పాటు పరిపాలన అంశాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెంచేందుకు వచ్చే నెల 8న నిర్వహించనున్న స్థారుూ సంఘం ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారులకు టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్ల నుంచి నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు 46 నామినేషన్లు అందాయి.

ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్ జిత్ దుగ్గల్

ఆదిలాబాద్, మే 27: జిల్లా నూతన ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్ శుక్రవారం లాంఛనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా 18 నెలల పాటు పనిచేసిన తరుణ్ జోషి గ్రేహాండ్స్ గ్రూప్ కమాండెంట్‌గా ఇటీవలే బదిలీకావడంతో కొత్తగా వచ్చిన ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ ఉదయం 8 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో తరుణ్ జోషి నుండి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సాయుధపోలీసుల గౌరవ వందనం స్వీకరించగా పాత ఎస్పీ జోషి జిల్లాలో శాంతిభద్రతలు, మావోయిస్టుల కదలికలు, సామాజిక పరిస్థితుల గురించి కొత్త ఎస్పీకి వివరించారు.

వైభవంగా సాగుతున్న చంఢీయాగం

నిర్మల్, మే 27: రాష్ట్ర దేవాదాయ,గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నివాసంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మినారాయణ హృదయసైత రుతశత చంఢీయాగం శుక్రవారం రెండవ రోజుకు చేరుకుంది. శృంగేరి పీఠాధిపతి జగద్దురువు ఆశీర్వచనాలతో ఈ చంఢీయాగం ప్రారంభం కాగా శృంగేరి ఆస్థాన పండితులు వాసోజు గోపి కృష్ణశర్మ, విరివింటి ఫణి శశాంక్ శర్మల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల మద్య శుక్రవారం ధనయంత్ర యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యాగంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు గౌతంరెడ్డి, మురళిదర్‌రెడ్డి, వినోదమ్మ, దేవేంధర్‌రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఆదివాసీల అభ్యున్నతికి కృషి

కెరమెరి, మే 27: ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపి గెడెం నగేష్ అన్నారు. శుక్రవారం కెరమెరి మండలంలోని జోడేఘాట్ గ్రామాన్ని సందర్శించి అక్కడ నిర్మిస్తున్న పర్యాటక కేంద్రం పనులను పరిశీలించారు. అనంతరం బాబేఝరీ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎంపి నగేష్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి, ప్రతీ ఒక్కరికి ఆరు కిలోల బియ్యం, పాఠశాలల్లో సన్నబియ్యం లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకోవడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ సంస్థాగత పటిష్టతకు కమిటీలు

ఆదిలాబాద్, మే 27: రాబోయే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని, సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు జూన్ మొదటి వారం నుండి మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలు నియమిస్తామని ఆ పార్టీ జిల్లా నూతన ఇంచార్జి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జిల్లా కాంగ్రెస్ నేతలతో శుక్రవారం సమావేశమై పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పునర్వైభవం కోసం పాటుపడాలని, గ్రూపులు లేకుండా పనిచేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

Pages