S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

పెగడపల్లి, మే 15: పెగడపల్లి మండలం బతికపెల్లి గ్రామానికి చెందిన మండ నర్సయ్య(65) అనే రైతు ఆదివారం విద్యుత్‌ఘాతంతో మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నర్సయ్య గ్రామసమీపంలోని తన వ్యవసాయ పొలంలో ఉన్న చెట్లను కొట్టివేసేందుకు ఇంటి నుండి వెళ్లాడు. చెట్టును కొడుతున్న సమయంలో నర్సయ్యకు దాహం వేయ్యడంతో తన పొలం పక్కనే ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన గజ్జి తిరుపతి అనే రైతు వ్యవసాయ బావి వద్దకు నీరు తాగడానికి వెళ్లాడు. నీరు తాగడం కోసం విద్యుత్ మోటార్‌ను స్టాట్ చేయగా స్టాటర్ డబ్బా వల్ల షాక్ తగలడంతో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

వైద్యం ముసుగులో ఘరానా మోసం

రామగుండం, మే 15: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం అవినీతి... అక్రమాలకే కాకుండా వైద్యం ముసుగులో ఘరానా మోసాలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లోని అమాయకులను, వారి రోగాల అవసరాలన్ని ఆసరాగా చేసుకుంటున్న కొంత మంది డాక్టర్లు వైద్యం పేరుతో నిలువు దోపిడీకి తెగబడుతున్నారు. ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోయిన ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరికి ఈ పట్టణం వైద్య వ్యాపారానికి అడ్డాగా మారిందని అనడంలో ఏ మాత్రం సందేహ పడాల్సిన అవసరం లేదు.

ప్రశాంతంగా ‘ఎంసెట్’

కరీంనగర్, మే 15: ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ ఉమ్మడి ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 18,019 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 17,289 మంది పరీక్ష రాసారు. 730 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజర్ అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 11,816 మందికిగాను 11,378 మంది పరీక్ష రాయగా, 438 మంది గైర్హాజర్ అయ్యారు. అలాగే మెడిసిన్, అగ్రికల్చర్ విభాగాల్లో కలిపి 6,203 మందికిగాను 5,911 మంది పరీక్ష రాయగా, 292 మంది గైర్హాజర్ అయ్యారు. ఇంజనీరింగ్ పరీక్షలో 96శాతం, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలో 95శాతంగా నమోదైంది.

నేడు డయల్‌యువర్ కార్యక్రమం రద్దు, ప్రజావాణి యదాతథం

ముకరంపుర (కరీంనగర్), మే 15: ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నేడు రద్దు పరిచినట్లు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం యదావిధిగా కొనసాగుతుందని జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి జిల్లా యంత్రాంగంతో సహకరించాలని కోరారు.

బాలికపై అత్యాచారం?

ఎల్లారెడ్డిపేట, మే 15: మండలంలోని నారాయణపూర్‌లోని ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లే క్రమంలో పంచాయతీ పెద్దలు రంగప్రవేశం చేశారని తెలిసింది. పంచాయతీ నిర్వహించి బాలిక శీలానికి రూ.50వేలు ఖరీదు కట్టినట్లు సమాచారం. ఈ తతంగమంతా గ్రామ పోలీసుల కనుసన్నల్లోనే జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాల్సింది పోయి యువకుడికే పోలీసులు అండగా నిలుస్తున్నారని వాపోతున్నారు. పంచాయితీ నిర్వహించిన పెద్దలు రూ.30వేలు తీసుకొన్నారని పేర్కొన్నారు. పంచాయతీ తీర్పునకు కట్టుబడి ఉండాలని హెచ్చరించినట్లు బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు.

రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే సహించేది లేదు

నిజామాబాద్, మే 15: ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో రైతుల భూములను తెరాస ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నాలు చేస్తోందని, దీనిని కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం సహించబోదని శాసన మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్‌అలీ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రాణహిత-చేవేళ్ల పథకం కింద జిల్లాలో 20, 21, 22 ప్యాకేజీలు ఉండగా, ప్రభుత్వం కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని లక్షా 45వేల ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే 22వ ప్యాకేజీని రద్దు చేసిందన్నారు.

తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లే..

వేల్పూర్, మే 15: నవమాసాలు మోసి, కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పిన నా తల్లిదండ్రుల ఆశీస్సులు, నియోజకవర్గ ప్రజల దీవెనలే తనను ఈ స్థాయికి చేర్చాయని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తన స్వగ్రామమైన వేల్పూర్‌లోని మినీ స్టేడియం ఆధునికీకరణ, నూతనంగా నిర్మించతలపెట్టిన గ్రామ పంచాయతి భవనం, మోతె గ్రామ పంచాయతి భవనం, హైస్కూల్‌లోని ఆరు అదనపు గదుల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం వేల్పూర్‌లోని గ్రామ పంచాయతి ఆవరణలో సర్పంచ్ నీరడి భాగ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం!

నిజామాబాద్, మే 15: అనేక ప్రతీకూల పరిస్థితులకు ఎదురీదుతూ ఆరుగాలం శ్రమించి వ్యవసాయోత్పత్తులు పండించిన రైతాంగానికి గిట్టుబాటు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, సేకరించిన పంట ఉత్పత్తులకు సంబంధించి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు అనుకూలించకపోవడంతో ఈసారి రబీ సీజన్‌లో అతి తక్కువ మంది రైతులు వరి పంటను సాగు చేశారు. జిల్లా యంత్రాంగమైతే వరి సాగును పూర్తిగా విడనాడాలని ప్రచారం చేసింది. అయినప్పటికీ బోరుబావుల్లో కొద్దోగొప్పో నీరు ఉన్న రైతులు సాంప్రదాయంగా వస్తున్న వరి పంటనే సాగు చేశారు.

ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్-2016

ఇందూర్, మే 15: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఎంసెట్ ప్రవేశ పరీక్ష సందర్భంగా కలెక్టర్ యోగితారాణా పరీక్షా కేంద్రాల్లో పర్యటించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించగా, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షా తీరును పర్యవేక్షించారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 7371అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 20పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కంఠేశ్వర్, మే 15: రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని నిజామాబాద్ రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.

Pages