S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేయి చాచలేను.. బిచ్చమెత్తలేను

న్యూఢిల్లీ, మే14: ‘నేను జాతిపిత మహాత్మా గాంధీ మనుమడిని, తల దాచుకునేందుకు ఒక ఇంటికోసం వెతుకుతున్నాను, సహాయంకోసం ప్రభుత్వాన్ని లేదా ఇతరులను చేయిచాచి అడగలేను, బిచ్చమెత్తలేను’ అని మహాత్మా గాంధీ మనుమడు కనుభాయి రాందాస్ గాంధీ (87) చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ తనంత తాను ముందుకు వచ్చి ఏదైనా సహాయం చేస్తే తీసుకుంటాను లేకపోతే ఇలాగే ఈ ఆశ్రమంలోనే ఉంటామని ఆయన అంటున్నారు. కనుభాయి రాందాస్ గాంధీ, ఆయన భార్య శివలక్ష్మి గాంధీ (85) ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని గురువిశ్రాం వృద్ధాశ్రమంలో తలదాచుకుంటున్నారు.

ఐరాస పోస్టర్ పోటీలో భారతీయ యువతికి బహుమతి

ఐక్యరాజ్య సమితి, మే 14: అణు నిరాయుధీకరణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పోస్టర్ పోటీలో విజేతలయిన ముగ్గురిలో 22 ఏళ్ల భారతీయ చిత్రకారిణి అంజలీ చంద్రశేఖర్ ఉన్నారు. శాంతి కపోతం ఒకటి అణ్వాయుధాన్ని చీల్చుకుని ఎగురుతున్నట్లుగా ఉన్న అంజలి వేసిన చిత్రానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ ప్రశంసలు కూడా లభించాయి. ఇదే కాకుండా చెన్నైకి చెందిన బాలిక ‘బ్రేక్ ఫ్రీ’ అనే టైటిల్‌తో వేసిన చిత్రానికి సైతం ప్రశంసా పత్రం లభించింది.

వాళ్లకు సిగ్గు లేదు!

కోల్‌కతా, మే 14: జాదవ్ పూర్ యూనివర్సిటీ విద్యార్థినులపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలిప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘జాదవ్‌పూర్ విద్యార్థినులు స్థాయికి తగినట్లుగా ఉండరు. వారికి బిడియం లేదు. ఎప్పుడూ మగ విద్యార్థులతో కలిసి తిరిగే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు’’ అంటూ అవాకులు పేలారు. గత వారం యూనివర్సిటీలో ఒక సినిమా ప్రదర్శన సందర్భంగా ఏబీవీపీ, లెఫ్ట్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన సందర్భంలో ఏబీవీపీ విద్యార్థులు విద్యార్థినులను వేధించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన దిలీప్, అక్కడి విద్యార్థినులే స్థాయికి తగినట్లుగా వ్యవహరించరని అన్నారు.

‘నరుూమ్’ దుస్తుల్లో మరోసారి మెరిసిన మిషెల్లీ

వాషింగ్టన్, మే 14: ఇండో-అమెరికా ఫ్యాషన్ డిజైనర్ నరుూమ్ ఖాన్ రూపొందించిన దుస్తుల్లో అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా మరోసారి మెరిసిపోయింది. నార్డిక్ దేశాల నాయకుల గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆమె నరుూమ్ రూపొందించిన దుస్తుల్లో తళుక్కుమన్నారు. మిషెల్లీకి అత్యంత ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్లలో నరుూమ్ ఒకరు. అందుకే ఆమె ఇంతకుముందు 2009లో కూడా నరుూమ్ రూపొందించిన దుస్తులను ధరించి తొలిసారి ప్రభుత్వ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు సాధారణంగా ఏదో ఒక దేశాధినేతకు విందును ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఎన్‌ఎస్‌జిలో చేరికకు భారత్ సిద్ధం

వాషింగ్టన్, మే 14: క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ సంస్థ (ఎంటిసిఆర్) నిర్దేశించిన అర్హతలను భారత్ సాధించిందని, అణు పదార్థాల సరఫరాదారుల గ్రూప్ (ఎన్‌ఎస్‌జి)లో చేరడానికి సిద్ధంగా ఉందని అమెరికా ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బి శుక్రవారం ఇక్కడ ఈ విషయం చెప్పారు. భారత్‌కు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో సభ్యత్వం కల్పించడాన్ని చైనా, పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత సంవత్సరం భారత్‌లో పర్యటించిన సందర్భంగా చేసిన ప్రకటనను కిర్బి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

భారత సరిహద్దుల్లో మరిన్ని చైనా బలగాలు

వాషింగ్టన్, మే 14: చైనా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుందని, భారత సరిహద్దుల్లో మరిన్ని సైనిక బలగాలను మోహరించిందని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ తెలిపింది. చైనా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల తన సైనిక స్థావరాల్లో ప్రత్యేకించి పాకిస్తాన్‌లో సైనిక బలగాలను పెంచుతోందని అమెరికా హెచ్చరించింది. భారత సరిహద్దులకు దగ్గరలో చైనా తన సైనిక బలగాలను పెంచినట్లు తాము గమనించామని అమెరికా రక్షణ శాఖ ఉప సహాయ మంత్రి (తూర్పు ఆసియా) అబ్రహాం ఎం డెన్మార్క్ వెల్లడించారు.

ఆందోళనలో ఎఫ్‌పిఐలు

న్యూఢిల్లీ, మే 14: భారత్ ఈ వారం మారిషస్‌తో పన్ను సవరణ ఒప్పందంపై సంతకం చేయడం పట్ల విదేశీ పోర్ట్ఫులియో మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎఫ్‌పిఐ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి వారి ఆందోళనలపై చర్చించింది. విదేశీ పోర్ట్ఫులియో మదుపరులు గురువారం రెవెన్యూ విభాగ కార్యదర్శి హస్ముక్ అధియాతో సమావేశమై తమ ఆందోళనలతో పాటు ‘గార్’ (జనరల్ యాంటీ ఎవైడెన్స్ రూల్స్), పన్ను ఒప్పందాలకు సంబంధించిన ఇబ్బందులపై విస్తృత చర్చలు జరిపారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ట్వీట్ చేశారు.

పొగాకు రైతులను ఆదుకుంటాం

ఒంగోలు, మే 14: పొగాకు రైతులకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభు త్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శనివారం మంత్రి త్రోవగుంట, ఒంగోలు-2, టంగుటూరు పొగాకు వేలం కేంద్రాలను సందర్శించారు. అక్కడ పొగాకు బేళ్లను పరిశీలించారు. పొగాకు రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు ఉత్పత్తుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు చుండూరి రంగారావు, అధ్యక్షుడు చుంచు శేషయ్య మాట్లాడుతూ పొగాకు వేలం కేంద్రాల్లో కిలో పొగాకుకు సరాసరిన 125 నుండి 128 రూపాయల వరకు ధర లభిస్తుందన్నారు.

సంస్కరణల జోష్

ముంబయి, మే 14: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం లాభాల్లో ముగిశాయి. మదుపరులు సంస్కరణల జోష్‌లో ఉండగా, వరుస రెండు వారాల నష్టాల నుంచి సూచీలు తేరుకున్నాయి. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివాలా బిల్లు ఆమోదం పొందడం మార్కెట్ సెంటిమెంట్‌కు బలం చేకూర్చిందని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పారిశ్రామికోత్పత్తి పడిపోయినా, రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినా మదుపరులు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఫలితంగానే అంతకుముందు రెండు వారాలు నష్టాల్లో కదలాడిన సూచీలు.. గడచిన వారం లాభాలను అందుకోగలిగాయని వారు విశే్లషిస్తున్నారు.

‘మరింత పెరగనున్న మొండి బకాయిలు’

న్యూఢిల్లీ, మే 14: బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) వచ్చే ఏడాది మార్చికల్లా 6.9 శాతానికి ఎగబాకవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. నిరుడు సెప్టెంబర్ నాటికి వాణిజ్య బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 5.14 శాతంగా ఉన్నాయని, ఈ ఏడాది సెప్టెంబర్‌కు 5.40 శాతానికి పెరగవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నివేదికను ఊటంకిస్తూ 2015-16 వార్షిక నివేదికలో ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను మొండి బకాయిలు ప్రమాదంలో పడేసినది తెలిసిందే.

Pages