S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

సీ. వదన బాణాసన వ్యక్తముక్తము లైన పలుకుల న్యదువాఁడి బాణతతుల
బరమర్మల క్ష్యముల్ పాయక భేదించు చుండెడి దుర్జన యోధపరుల
కదనుండ కున్నది కరుణ యార్ణపమక్ష జయము సత్యంబును శమము శౌచ
మును నివి యెద నిల్చునది శత్రు షడ్వర్గ జయమందునది శుద్ధ శాంత బుద్ధి
తే. మదముఁ గామముఁగ్రోధంబు మత్సరంబు
లోభమును మోహమును నను లోని సహజ
వైరి వర్గంబు నొడిచిన వాఁడ యొడుచు
నశ్రమంబున వెలుపలి మహితతతుల

యమహాపురి 32

రేవతి చప్పున వీధి తలుపు మూసింది. డ్రాయింగ్ రూం దాటి బెడ్రూంలోకి వెళ్లింది. ఇంకా మూసే ఉన్న అటాచ్డ్ బాత్రూం వైపే చూస్తూ- ‘‘వచ్చిన వాళ్లు వెళ్లారుకానీ, స్నానమైందా?’’ అంది.
‘‘ఇలా స్నానమైంది. అలా బెల్లు మ్రోగింది. వచ్చిందెవరో తెలియక- మళ్లీ బాత్రూంలో దూరాను’’ అంటూ బయటకొచ్చాడు సుందరం నడుం తువ్వాలుతో కప్పుకుని.
ఐదడుగుల ఎనిమిదంగుళాల నిండైన విగ్రహం. వ్యాయామంతో తీర్చిదిద్దినట్లున్న శరీరం. అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో- పచ్చని మేనిపై నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. నీటి చుక్కలు లేకపోయినా- కాలి పిక్కలు కూడా బంగారంలా మెరుస్తున్నాయి.

వసుంధర

అసమానతలపైనే నా పోరాటం

హాజీ ఆలీ దర్గావారు మహిళను రెండవ తరగతి పౌరురాలిగా పరిగణిస్తున్నారు. దీనిపైనే నా పోరాటం అని భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ అంటున్నారు. శని శింగనాపూర్‌లో మహిళల ఆలయ ప్రవేశ విజయంతో ఆమె ముస్లిం మహిళలను హాజీ ఆలీ దర్గాలోకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన తదుపరి ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఆలయాల్లో, దర్గాలలో మహిళల ప్రవేశంపై ఆమె చేస్తున్న పోరాటానికి ప్రతీకారదాడులు ఎదురైనా.. జైళ్లలో పెట్టినా.. బెదిరింపులు వచ్చినా మొక్కవోని ధైర్యంతో పోరాటం సాగిస్తున్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ మీడియాతో తన మనోగతాన్ని వెల్లడిస్తూ 2011 నుంచి దర్గాలోకి మహిళల రాకను నిషేధించారు.

హరివంశం 123

కాని ఈ జన సమృద్ధికి చాలిన చోటు మీరు చూపిన ప్రాంతంలో లేదు. ఈ వైశాల్యం సరిపోదు. జలధి ఇంకా కాస్తచోటు మనకు సమకూరిస్తే ఆఘమేఘాలమీద మీరు కోరినట్లు చేయగలను, అది ఎంత పని?! అని విన్నవించుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు సాగరుణ్ణి అర్థించాడు మాకు ఇంకా స్థలం కావాలని.
జగన్నాథుడి ప్రార్థన జలధి అతిక్రమించగలదా? నాలుగు వైపులా పనె్నండు యోజనాలు తన సలిలాలు ఉపసంహరించుకున్నాడు సముద్రుడు. దీన్ని చూసి విశ్వకర్మ ఎంతో ఆశ్చర్యం పొందాడు. ఆనందంతో కృష్ణదేవుణ్ణి ప్రశంసించాడు. ఇక తన శిల్ప చాతుర్యమంతా చూపి ఒక పరమ సుందర విభవాభిరామమైన నగరాన్ని అక్కడ వెలయించాడు.

మాంగల్యానికి ‘మరో ముడి’

వివాహంలో వరుడు వధువు మెడలో కట్టే ‘మంగళసూత్రా’నికి లేక ‘మాంగల్యతంతు’నకే ‘మాంగల్యం’ అనేది సంక్షిప్తనామం.
‘వివాహం’లో వరుడు వధువు మెడలో ‘మాంగల్యం’ కడుతూ మూడు ముళ్లు వేయడం అనాదిగా వస్తున్న అద్భుత సంప్రదాయం.
మూడు ముళ్లు వేయడం ఎందుకు- అంటే, ఒక్కొక్క ముడితో ఒక్కొక్క వాగ్దానం చెయ్యలి కాబట్టి.

- సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి

ఆణిముత్యాలు

ఆలస్యం, శ్రమ, మందకొడితనం, భేదభ్రాంతి, మిధ్యాత్మత, నర్మోక్తి, ద్రోహం, పరదూషణ, గర్వం, భయం అనేవి మనిషిని పట్టి పీడించే చెడుగుణాలు.
ఆలస్యంవల్ల అమృతం కూడా విషమవుతుందన్నారు పెద్దలు. అందువల్ల అనుకున్న పని తొందరగా చేసుకోవడం మంచిది. చూద్దాంలే, చేద్దాంలే అని బద్ధకిస్తే నిస్సందేహంగా కార్యహాని జరుగుతుంది. ఏ పనైనా శ్రమ పడకుండా సాధ్యం కాదు. ఎక్కువో తక్కువో శ్రమపడాల్సిందే. శ్రమ పడకుండా ఫలితం పొందాలనుకోవడం హర్షణీయం కాదు. ఫలితం లభిస్తున్నప్పుడు శ్రమ లెక్కలోకి రాదు. నిజానికి శ్రద్ధతో పనిచేస్తే శ్రమ తెలియదు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు

నలుగురు హీరోయిన్లతో...

యామిని, భావన, రుహిణి, వర్ష హీరోయిన్లుగా శ్రీ సాయి గణపతి క్రియేషన్స్ పతాకంపై ‘అంజన’రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కొండా విజయ్‌కుమార్ క్లాప్ కొట్టగా, దర్శకులు సుకుమార్ సోదరుడు విజయ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత వై.కోటిబాబు, నిర్మాత శివ (అపురూప్), ఆర్టిస్ట్ భద్రం, జబర్దస్త్ అప్పారావులతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కె.యం.రాధాకృష్ణ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అంజన రామకృష్ణ మాట్లాడుతూ..

మహాభారతం నా చివరి సినిమా

తెలుగు పరిశ్రమలో దాసరి నారాయణరావుకు ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడికి స్టార్ ఇమేజ్‌ని తీసుకువచ్చింది ఆయనే. దర్శకుడిగానే కాక నటుడు, రచయిత, నిర్మాత, పంపిణీదారుడు- ఇలా పలు రంగాల్లో తనదైన ఇమేజ్‌ను సృష్టించుకున్న దాసరి ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు పెద్దదిక్కులా మారారు. 1972లో ‘తాతా-మనవడు’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన సుమారుగా 150 చిత్రాలకు దర్శకత్వం వహించి పలు చిత్రాల్ని నిర్మించారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఇంటర్వ్యూ..
పవన్‌తో సినిమా అన్నారు, ఎప్పుడు?

-శ్రీ

నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తా

తెలుగులో ‘ఏ మాయ చేసావె’ సినిమాతో నెగెటివ్ పాత్రతో ఎంట్రీ ఇచ్చి ‘ఎస్సెమ్మెస్’ చిత్రంతో హీరోగా మారాడు సుధీర్‌బాబు. ఆ తరువాత పలు చిత్రాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్‌బాబు బావ అయిన సుధీర్ తాజాగా ‘్భగీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సుధీర్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా సుధీర్ తన అనుభవాలను మీడియా పంచుకున్నారు. ఆ విశేషాలు ఆ మాటల్లో...

15న రైట్ రైట్ పాటలు

సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వెంకటేశ్వర్లు నిర్మిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఇటీవలే పాటల చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, తన కెరీర్‌లో భిన్నమైన చిత్రంగా నిలిచిపోతుందని, ఇదొక కొత్త ప్రయత్నమని, అందరూ స్టైలిష్ సినిమాలు చేస్తుంటే, తాను మాత్రం సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు చేస్తున్నానని అన్నారు.

Pages