S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకాపా నేతలకు తెలంగాణ ప్రాజెక్టు పనులా?

హైదరాబాద్, మే 2: తెలంగాణలో ప్రాజెక్టు పనులను వైకాపా నేతలకు అప్పగించడంతో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ల నాటకం ప్రజల ముందు బట్టబయలైందని టిటిడిపి వర్గింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. వైకాపా పార్టీ నేతలకు వేల కోట్ల ప్రాజెక్టు పనులు అప్పగించి, మరోవైపు ఆంధ్రావాళ్లు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ హరీశ్‌రావు ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

విద్యాసంస్థల్లో వసతులు కల్పిస్తాం

హైదరాబాద్, మే 2: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో జూలై 31వ తేదీ నాటికి సిసి కెమేరాలు, బయోమెట్రిక్ అటెండెన్స్ పరికరాలను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, ఎమ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వి.రమణారావు, సాంకేతిక విద్యా బోర్డు కార్యదర్శి యువిఎస్‌ఎన్.మూర్తి తదితరులతో కలిసి సోమవారం సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 1,350 విద్యాసంస్థలు ఉన్నాయని, వాటిలో చదువుతున్న 5 లక్షల మంది విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించామని చెప్పారు.

కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి

హైదరాబాద్, మే 2: మారిషస్ కమర్షియల్ కేసులో హైకోర్టు ఆదేశానుసారం కేంద్ర మంత్రి వై సత్యనారాయణ చౌదరి నాంపల్లిలోని 12వ, అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు సోమవారం హాజరయ్యారు. చౌదరిపై ఏప్రిల్ 12న నాన్ బెయిలేబుల్ వారంట్ జారీ అయిన విషయం విధితమే.

రాయలసీమకు దక్కాల్సిన నీటిపై కెసిఆర్‌ను ప్రశ్నించే దమ్ముందా?

మాచర్ల, మే 2: రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తున్న తరుణంలో ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన రెడ్డి విమర్శించారు. సోమవారం గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించిన ‘కరవు దీక్ష’లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీటిని ప్రాజెక్టుల పేరుతో దారి మళ్లిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు.

అన్ని స్కూళ్లలో వ్యాయామ విద్య

హైదరాబాద్, మే 2: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుండి వ్యాయామ విద్యను తప్పనిసరి చేస్తున్నామని కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. ఇప్పటికే పాఠ్యాంశాల రూపకల్పన పూర్తయిందని, ప్రతి పాఠశాలలోనూ వ్యాయామ విద్యను బోధించేందుకు ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు లేనిచోట్ల ఇతర ఉపాధ్యాయులు ఈ అంశాన్ని బోధించేలా వారికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

రాజధాని డిజైన్లు మారుతున్నాయి

విజయవాడ, మే 2: రాజధాని అమరావతిని నిర్మించే సంస్థను ఖరారు చేసేపనిలో రాష్ట్ర ప్రభుత్వం బిజీ అయింది. అత్యుత్తమ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకూ రాజధాని అమరావతికోసం చేసిన పని అంతా ఒక ఎత్తు, ఇకముందు జరిగేది మరో ఎత్తు అని అన్నారు. అత్యుత్తమ రాజధానిని నిర్మించేందుకు ప్రపంచం మెచ్చే డిజైన్లను తయారుచేసే ఆర్కిటెక్ట్‌లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యామని చెప్పారు. ఈ డిజైన్లను జ్యూరీ ఎంపిక చేస్తుందన్నారు.

జగన్ ధర్నాకు స్పందన కరవు

హైదరాబాద్, మే 2: కరవుపై వైఎస్.జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ధర్నా అట్టర్ ఫ్లాప్ అయిందని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. మాచర్లలో జగన్ తలపెట్టిన ధర్నాకు వైకాపా నాయకులు తప్ప ప్రజలెవరూ రాలేదన్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రిని కలిసిన జగన్ రాష్ట్ర కరవుపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 369 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించిందని, కరవు నివారణకు నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిందని చెప్పారు. కరవు నివారణలో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందన్నారు.

‘ఎమ్మార్’ కేసులో సిబిఐకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, మే 2: కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ లిమిటెడ్‌కు గతంలో జరిగిన భూ కేటాయింపులకు సంబంధించి తనపై సిబిఐ నమోదు చేసిన నేరారోపణలను కొట్టివేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారి బిపి.ఆచార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారణకు స్వీకరించిన జస్టిస్ రాజా ఎలంగో సిబిఐకి నోటీసులు జారీ చేశారు. ఎమ్మార్‌కు జరిగిన భూ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.43 కోట్ల నష్టం వాటిల్లేలా వ్యవహరించారంటూ ఆచార్యపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

హోదాకోసం ఢిల్లీకి అఖిలపక్షం

హైదరాబాద్, మే 2: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్ళాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎపి శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పరిశ్రమలు వస్తాయని, కేంద్రం నుంచి నిధులు లభిస్తాయని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే పోరాటానికి తాము వెంట వస్తామని ఆయన తెలిపారు.

బెంగళూరులో మహిళ కిడ్నాప్

బెంగళూరు, మే 2: ఈశాన్య బెంగళూరులో 22ఏళ్ల యువతిని పట్టపగలే అపహరించుకుపోయిన ఘటన విస్మయానికి గురిచేసింది. ఆమెను అపహరించుకుపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పేయింగ్ గెస్ట్ హాస్టల్ ముందు ఫోన్‌లో మాట్లాడుతున్న యువతిని వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి చేతులతో ఎత్తుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లాడు. కొద్దిసేపటి తరువాత ఆమెను వదిలేసి అతను పారిపోయాడు. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నేను ఫోన్ మాట్లాడుతుండగా అతను వెనుకనుంచి వచ్చి పట్టుకున్నాడు.. నేను గట్టిగా అరవటంతో నా నోరు మూశాడు..

Pages