S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

కర్నూలు అర్బన్, ఏప్రిల్ 30:నగర పాలక సంస్థ, జిల్లా క్రీడా సంస్థ, జిల్లా ఒలింపిక్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పాఠశాల విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేసేందుకు వేసవిలో నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. నగరంలోని 75 ప్రాంతాల్లో 19 క్రీడాంశాల్లో ఈ శిబిరాలను మే 2 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించేందుకు శిక్షకులు సిద్ధమయ్యారు. ఈ శిబిరాలను మూడు క్యాటగిరీలుగా విభజించారు. ఇందులో కేటగిరి-ఎ వారికి కిట్స్, గౌరవ వేతనం, క్రీడా పరికరాలు, కేటగిరి-బి వారి కిట్స్, గౌరవ వేతనం, కేటగిరి-సి వారికి కేవలం కిట్స్ ఇస్తారు.

అహోబిలంలో పోటెత్తిన భక్తులు

ఆళ్లగడ్డ, ఏప్రిల్ 30: పాములేటయ్య (పావన నరసింహస్వామి) వారాల సందర్భంగా అహోబిల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. పాములేటయ్యకు వెళ్లాలన్న సంకల్పంతో శుక్రవారం రాత్రి నుండే తమ తమ వాహనాల్లో కొందరు, ఎగువ అహోబిలంకు వెళ్లి కొందరు నడుచుకుంటూ వెళ్లి తెల్లవారుఝాము నుండే భక్తులు పాములేటయ్య స్వామిని దర్శించుకొని తమ మొక్కుడులను తీర్చుకొని తిరిగి ఎగువ అహోబిలం చేరుకొని తమ బంధుమిత్రాదులతో కలిసి ఆరుబయట చెట్ల కింద భోజనాలు చేసి వస్తారు. శనివారం ఎగువ అహోబిలంలో స్వయంభువుగా వెలసిన నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవారు, దిగువన వెలసిన శ్రీ ప్రహ్లాద వరద స్వామిని దర్శించుకొని పూజలు చేశారు.

శ్రీప్రహ్లాదరాయలకు ప్రత్యేక పూజలు

మంత్రాలయం, ఏప్రిల్ 30: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శనివారం పీఠాధి పతులు శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీప్రహ్లాదరాయలకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. బృందావన ప్రతిమను, ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలను వెండి, బంగారు పల్లకిలో ఉంచి మఠం ప్రాకారంలో ఊరేగించారు. శ్రీ మూలరామాదేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ధర్శనం కలిగించారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరాయలను గజవాహానం, కొయ్య, వెండి, బంగారు రథాలపై అదిష్టించి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు.

సీమ సమస్యలపై ఢిల్లీలో గళమెత్తుతా..

నంద్యాల రూరల్, ఏప్రిల్ 30: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రధాని నరేంద్రమోదీకి వినపడేలా రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ అంశాలను ప్రస్థావిస్తానని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాయలసీమ హక్కుల బస్సు చైతన్య యాత్ర 70వ రోజు పర్యటనలో భాగంగా నంద్యాల మండలంలోని కానాల, రైతునగరం, గోస్పాడు మండలంలోని గోస్పాడు, యాళ్లూరు గ్రామాల్లో చైతన్య యాత్రను నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం, చైతన్య యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాలు కనపడలేదని విమర్శించారు.

నంద్యాలలో నీటి ఎద్దడికి నిర్లక్ష్యమే కారణం

నంద్యాల, ఏప్రిల్ 30: నంద్యాల పట్టణానికి ఎన్నడూలేని విధంగా నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నం కావడానికి మున్సిపల్ యంత్రాంగం, చైర్ పర్సన్ల నిర్లక్ష్యమే కారణమని కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. నీటి ఎద్దడి నివారణకు రూ.3 కోట్లు నిధుల దుర్వినియోగం జరిగిందని ప్రశ్నించారు. శనివారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభంలోనే వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ నీటి ఎద్దడిపై చైర్‌పర్సన్‌ను నిలదీశారు. నంద్యాల పట్టణానికి తాగునీటి వనరుల వినియోగం మున్సిపల్ యంత్రాంగానికి తెలియదా? అని ప్రశ్నించారు.

సంగమేశ్వరంలో ముమ్మరంగా కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు

పాములపాడు, ఏప్రిల్ 30:సప్తనది సంగమేశ్వరం కృష్ణా నదిలో నిర్వహించే పుష్కరాల పనులను శనివారం ఎస్పీ ఆకే రవికృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకూ జరిగే కృష్ణా పుష్కరాలకు ఎలాంటి అంతరా యం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో 3 నెలల ముందుగానే పనులను ప్రారంభించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 15 రోజులకోసారి పోలీసు శాఖ తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. అనంతరం పుష్కర ఘాట్, ఎగువ పశ్చిమాన కొత్త స్నాన ఘాట్‌లను పరిశీలించారు.

ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్భ్రావృద్ధి

కర్నూలు సిటీ, ఏప్రిల్ 30:ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తూ ఉద్యమస్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ సిఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ శిల్పా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైకాపా చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. సిఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని వివరించారు.

చంద్రబాబు, వెంకయ్యనాయుడువి దొంగ నాటకాలు

కర్నూలు సిటీ, ఏప్రిల్ 30: ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నారని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. సిఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.

సచివాలయం విస్తరణకు అదనంగా 530 కోట్లు

విజయవాడ, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెలగపూడి దగ్గర నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయం విస్తరణ, వౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.530 కోట్లు మంజూరు చేసింది.
జి ప్లస్ వన్ నిర్మాణానికి తొలిదశలో రూ.22.80 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిన విషయం విదితమే. తొలుత జి ప్లస్ వన్‌గా పనులు చేపట్టిన 6 భవనాల సముదాయంలో అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

యథావిధిగా ఉష్ణోగ్రతలు

కర్నూలు, ఏప్రిల్ 30: జిల్లాలో భానుడి భగభగలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎండకు తోడు వడగాలుల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలకు తోడు రాత్రి వేళల్లో కూడా అదే వేడి కొనసాగుతుండటంతో ప్రజలు నిద్రకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో శనివారం సగటున 42.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా నంద్యాలలో అత్యధికంగా 43, కర్నూలులో 42.8, ఆదోనిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. పగలు వీస్తున్న వడగాలుల కారణంగా రాత్రి వేళల్లో 31 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రత ఉందని తెలిపారు. కాగా ఈ వేసవిలో వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Pages