S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే పోటీ చేస్తున్నాను:ప్రజ్ఞా

భోపాల్: తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవటానికి తానేమి ఉగ్రవాదిని కాదని సాధ్వీ ప్రజ్ఞ్ఠాకూర్ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మాలెగావ్ బాంబుదాడుల్లో తన పాత్రలేదని అన్ని న్యాయస్థానాలు, ఏన్‌ఐఏ క్లీన్‌చీట్ ఇచ్చాయని అన్నారు. కాని అన్యాయంగా ఈ కేసులో ఇరికించి చిత్రహింసలకు గురిచేశారని, వారు రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘించారో, నిబంధనల్ని ఎలా తుంగలో తొక్కారో అందరికీ తెలుసునని అన్నారు. దేశ సరిహద్దులు భద్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మెరుపుదాడులకు రుజువులు అడుగుతున్న కాంగ్రెస్‌ను ఓడించాలని అన్నారు.

ఓటమి భయంతోనే ఆరోపణలు

జైపూర్: ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని బీజేపీ నేత ప్రకాశ్ జావడేకర్ అన్నారు. పార్టీ రాజస్థాన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న జావడేకర్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఓటమిని అంగీకరించే ప్రతిపక్షాలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. దేశంలోనే అతి పెద్ద పార్టీగా ఉండే కాంగ్రెస్ తోకపార్టీగా మారిందని అన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు జరగవని కాంగ్రెస్ నేత అశోక్‌గెహ్లోత్ చేసిన ఆరోపణలను ఖండించారు.

శివసేనలో చేరిన ప్రియాంక చతుర్వేది

ముంబయి: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రియాంక్ చతుర్వేది ఈరోజు శివసేనలో చేరారు. బాగా ఆలోచించిన తరువాతే శివసేనలో చేరాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఆమె శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సమక్షంలో చేరారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం:రజనీ

చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. ఆయన ముంబయిలో జరుగనున్న షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లేముందు ఇంటి ముందు మీడియాతో మాట్లాడుతూ తాను అభిమానులను నిరాశపరచలేదని, అసెంబ్లీ ఎన్నికలు ఎపుడు జరిగితే అపుడు పోటీ చేస్తామని తెలిపారు. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మే 23న చూస్తారు కదా అని బదులిచ్చారు.

పాతికేళ్ల వైరాన్ని పక్కనపెట్టి చేతులు కలిపారు..

లక్నో: పాతికేళ్ల వైరాన్ని పక్కన పెట్టి ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి కలిసిపోయారు. మెయిన్‌పురిలో ములాయం సింగ్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూలాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ మాయావతిని గౌరవించాలని అన్నారు. కోనే్నళ్ల తరువాత మాయావతితో వేదికను పంచుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఇది నా కర్మభూమి అని ఇక్కడ నన్ను మరోసారి గెలిపించాలని, మరోసారి తనపై గౌరవాన్ని ప్రేమను చూపాలన్నారు. సభలో మాయావతి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసమే తాము మళ్లీ కలిశామని అన్నారు.

సికింద్రాబాద్ రైల్ నిలయంలో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్: స్థానిక రైల్ నిలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఏడో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. పలు పత్రాలు దగ్ధమయ్యాయి. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి. ఆసిఫ్‌నగర్‌ పరిధిలోని జిర్రాలో ఫర్నీచర్‌ గోదాంలో నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

రాహుల్‌ను ప్రధాని చేయటం నా బాధ్యత:దేవెగౌడ

బెంగళూరు: తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి మళ్లీ పోటీ చేస్తున్నందుకు గల కారణాలను జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రధాని అవ్వటానికి సోనియాకారకురాలని, ఇపుడు రాహుల్‌ను ప్రధాని చేయటం నా బాధ్యత అని అన్నారు. అందరి అభిష్టం మేరకు బరిలోకి దిగానని వెల్లడించారు. రాహుల్‌ ప్రధాని కావడానికి తాను అండగా నిలుస్తానని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకునేది లేదని తేల్చిచెప్పారు.

సాధ్వీపై విపక్షాలు సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుళ్ల కేసులో తన హస్తం ఉందని ఒప్పుకోమని జైల్లో పోలీసులు తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని కన్నీరు పెట్టుకున్న భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీపై విపక్షాలు సంచలన వ్యాఖ్యలు చేశాయి. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ సాధ్వీ ఎన్నికల్లో కాదని జైల్లో ఉండాలని అన్నారు. ఈమెకు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని, బీజేపీ మతం కార్డును ప్రయోగించిందని ఒమర్ ఆరోపించారు. హిందూ, కాషాయ ఉగ్రవాదం వంటి పదాలను వాడి ఓట్లు పొందాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ నేత దిగ్విజయసింగ్‌ ఆరోపించారు.

జైల్లో పోలీసులు హింసించారు..

భోపాల్: బీజేపీ అభ్యర్థిగా సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె భోపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌నేత దిగ్విజయ్ సింగ్‌పై పోటీపడుతున్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి తనను 13 రోజులు పాటు జైల్లో నిర్బంధించి నానా చిత్రహింసలు పెట్టారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఆమె బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆనాడు పోలీసులు పెట్టిన చిత్రహింసలు గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. వెడల్పైన బెల్టుతో కొట్టేవారు. ఒక్క దెబ్బకే శరీరం బాగా వాచేది. రెండో దెబ్బ పడితే చర్చం ఊడివచ్చేది. ఆ దెబ్బలకు కాసేపు నా నాడీ వ్యవస్థ పనిచేసేది కాదు. అసభ్యకరంగా పోలీసులు తిట్టేవారు.

ఆర్‌ఎస్‌ఎస్ అధినేతతో మోహన్ భగవతితో రతన్‌టాటా భేటీ

నాగపూర్: ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవతితో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా భేటీ అయ్యారు. ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవంగా చాలామంది పారిశ్రామికవేత్తలు రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుస్తుంటారు. గత ఏడాది నానాపలేకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా రతన్‌టాటా మోహన్ భగవతితో వేదిక పంచుకున్నారు. ఈ భేటీ రెండవసారి జరగటం ఆసక్తిరేకెత్తించింది. నాగపూర్ నగరంలో రతన్ టాటా మోహన్ భగవత్ ను కలిసి మాట్లాడారు. రెండుగంటల పాటు సాగిన ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగా సాగిందేనని ఆర్ఎస్ఎస్ వర్గాలు వెల్లడించాయి.మోహన్ భగవత్ ను కలిశాక రతన్ టాటా ముంబయికు పయనమయ్యారు.

Pages