S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసమ్మతి జ్వాలలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తమకే సీట్లు కేటాయిస్తారని ఆశపడ్డవారికి అధిష్ఠానం మొండి చేయి చూపించడంతో నాయకులు రగిలిపోతున్నారు. అన్ని పార్టీల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. బీజేపీ, టీడీపీలోనూ అసమ్మతి జ్వాలలు హెచ్చుమీరాయి. కనీస కేడర్ లేని వారిని అభ్యర్ధులుగా ఎలా రంగంలోకి దించుతారని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎవరికి వారు స్వతంత్ర అభ్యర్ధులుగా రంగంలోకి దిగుతుండగా, మరికొంత మంది పార్టీలకు రాజీనామాలు చేసి, వేరే పార్టీల్లో చేరుతున్నారు. తమ నేతకే టిక్కెట్ వస్తుందని భావించిన కార్యకర్తలు టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీ ఆఫీసుల్లో గడబిడ సృష్టిస్తున్నారు.

నేడు తుది జాబితా

న్యూఢిల్లీ, నవంబర్ 16: తెలంగాణ శాసనసభకు పోటీ చేసే మిగతా 19 మంది పార్టీ అభ్యర్థుల పేర్లను శనివారం ప్రకటిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా ప్రకటించారు. కుంతియా శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు న్యాయం చేస్తామని అన్నారు. జనగామ శాసనసభ టిక్కెట్ ఆశిస్తున్న పొన్నాల గత మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాగే సనత్‌నగర్ నియోజకవర్గం టిక్కెట్ విషయంలో సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డికి కూడా న్యాయం జరుగుతుందని కుంతియా భరోసా ఇచ్చారు.

టీఆర్‌ఎస్ గూటికి అరవింద్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 16: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు గడ్డం అరవింద్‌రెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రగతి భవన్‌కు వచ్చిన గడ్డం అరవింద్‌రెడ్డి మెడలో కేసీఆర్ గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, కేసీఆర్‌తో విభేదించి 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మంచిర్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానన్న బేషరతు హామీ మేరకు ఆయన్ను తిరిగి పార్టీలో చేర్చుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

ఒకే వర్గానికి పెద్దపీట

న్యూఢిల్లీ, నవంబర్ 16: తెలంగాణ శాసన సభకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు. రేణుకాచౌదరి శుక్రవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ కురుమ, యాదవ తదితర వెనుకబడిన కులాలు, కమ్మ సామాజిక వర్గానికి టిక్కెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఒకే వర్గానికి పెద్ద పీట వేశారని ఆమె తీవ్ర ఆరోపణ చేశారు. కాంగ్రెస్‌లో పరిస్థితి ఇలాగే కొనసాగితే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని రేణుకా చౌదరి ప్రకటించారు.

బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు

హైదరాబాద్, నవంబర్ 16: బీజేపీ, టీఆర్‌ఎస్‌కు సిద్ధాంతపరమైన విరోధం ఉండటంతో భవిష్యత్‌లో మోదీతో కలిసే ప్రసక్తేలేదని అపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఇక్బాల్ మినార్‌ను కట్టిందీ కేసీఆరేనని గుర్తు చేశారు. షాదీ ముబారక్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, రంజాన్, బక్రీదు పండుగలకు చేయూత వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఆయనేన్నారు. తనకు తెలిసి కేసీఆర్‌ను మించిన లౌకికవాది మరొకరు లేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మైనార్టీ నాయకుడు అబిద్ అలీ ఖాన్, ఖలీల్ ఉర్ రెహమాన్ తమ అనుచరులతో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ

అమరావతి, నవంబర్ 16: సీబీఐ ఎంట్రీని రద్దు చేస్తూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థకు కోర్టు ఆదేశాల మేర ఏ రాష్ట్రంలో అయినా విచారించే అధికారం ఉందని పలువురు వాదిస్తుంటే సీబీఐ ఏర్పాటైన నాటి చట్టం ప్రకారం ఆ సంస్థ ఢిల్లీకే పరిమితమని రాష్ట్రాల్లో విచారణ జరపాలంటే అందుకు ఆయా ప్రభుత్వాల అనుమతి తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల కాలంలో సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో న్యాయ నిపుణులు, మేధావుల సూచన మేరకు సాధారణ సమ్మతిని రద్దుచేస్తూ జీవో జారీ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు.

తేలని జనగామ జగడం

హైదరాబాద్: మహాకూటమిలో భాగస్వామ్యపక్షమైన తెలంగాణ జన సమితికి సీట్ల కేటాయింపుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయేంత వరకూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతే మళ్లీ చర్చిద్దామని ఉత్తమ్ ఆయనకు చెప్పి టీజేఎస్ కార్యాలయం నుంచి వెనుదిరిగారు.

తాత, నానే్న నాకు స్ఫూర్తి

హైదరాబాద్, నవంబర్ 16: కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి చుండ్రు (నందమూరి) సుహాసిని 17వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ అభ్యర్ధిగా ఖరారు చేసిన వెంటనే ఆమె చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి నందమూరి హరికృష్ణను గుర్తుచేసుకున్నారు. టీడీపీకి ఆయన ఎంతో సేవ చేశారని, చిన్నప్పటి నుండి తనకు రాజకీయాలంటే చాలా ఇష్టమని, తన తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, మామయ్య చంద్రబాబు తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారని అన్నారు.

కొంత సమయమివ్వండి

* తెరచుకున్న అయ్యప్ప ఆలయం * తృప్తి దేశాయ్‌ని అడ్డుకున్న పోలీసులు, భక్తులు

దేశ భవిత నిర్ణేతలు విద్యార్థులే

విద్యాదానం మహాదానం, విద్య కోసం అర్థించువాడు విద్యార్థి’ అన్నారు మన పెద్దలు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా విద్యను నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఏదో ఒక కొత్త విద్యను నేర్చుకుంటూనే వుంటారు. ఈ కారణంగా ప్రతి ఒక్కరినీ విద్యార్థిగానే భావించాలి. కానీ, నేడు విద్యార్థి అనే పదానికి పరిమితి కుదించి పాఠశాల, కాలేజీ, యూనివర్సిటీలలో చదివేవారినే విద్యార్థులుగా పిలుస్తున్నారు. పూర్వకాలంలో ఐదు సంవత్సరాలు నిండితేకానీ అక్షరాభ్యాసం చేయించి పాఠశాలల్లో చేర్చేవారు కాదు. ప్రస్తుతం ట్రెండ్ మారింది.

-- కామడి సతీష్‌రెడ్డి 98484 45134

Pages