S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కలు నాటి ఫలితాలు పొందండి

శ్రీకాకుళం, నవంబర్ 17: ప్రతీ ఇంట మొక్కలు నాటి వాటినుండి వచ్చిన ఫలితాలు పొందాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. శానివారం స్థానిక కంపోస్ట్ కాలనీలో జరిగిన వనం-మనం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనిషి సంపూర్ణమైన ఆరోగ్యం పొందడానికి కావల్సినవి గాలి, నీరు, చెట్లు ప్రధానమైనవి అని అన్నారు. అడవులు అంతరించిపోవడం వలన ప్రకృతి అంతరించిపోతుందని అన్నారు. పూర్వవైభవం కావాలంటే ప్రతీ ఇంటా చెట్లను నాటాలని చెప్పారు.

ప్రజాసంఘాల నాయకులపై కేసులు ఉపసంహరించాలి

శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 17: జిల్లాలో తిత్లీ తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయిన రైతులు, మత్స్యకారులు బాధితులను పరామర్శించి వారికి ఆహారపదార్ధాలు, నిత్యావసర సరుకులు, బట్టలు అందించేందుకు వెళ్లిన దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం, ప్రజా కళామండలి, అమరవీరుల బందు మిత్రుల సంఘం, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు, కార్యకర్తలపై పోలీసులు, ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.

పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి

ఎచ్చెర్ల, నవంబర్ 17: సర్పంచ్‌లు పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారులు పాలన ఆరంభమయిన గ్రామాల్లో పారిశుద్ధ్యపనులు చేపట్టకపోవడం వలన స్థానికులు రోగాల బారిన పడుతున్నారని బీజేపి మండల పార్టీ అధ్యక్షులు మారుపల్లి నారాయణరాజు విమర్శించారు. తక్షణమే తీర గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించేందుకు పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు శ్రద్ధ కనబర్చాలని కోరారు. శనివారం మండల కేంద్రంలో స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని జిల్లా యంత్రాంగం చొరవ చూపి చర్యలు చేపట్టకుంటే గ్రామాల్లో అపరిశుభ్రత నెలకొంటుందని ఆయన స్పష్టం చేశారు.

మడ్డువలస డ్యామ్‌లో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

వంగర, నవంబర్ 17: మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు ప్రధాన గేట్లు దిగువ భాగం బకెట్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తూ పడి మృతి చెందిన సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర విషాధాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామతేజ (19), విజయనగరం పట్టణానికి చెందిన మల్లెల వెంకట దినకర్‌సాయికిరణ్ (19)లు రాజాంలోని జీ ఎం ఆర్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్నారు. వీరిద్దరూ శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు దిగువ భాగంలో గల బకెట్ పోర్సన్ వద్ద సెల్ఫీ తీసుకున్న సమయంలో ప్రమాదవశాత్తూ కాలుజారి అత్యంత లోతుగా ఉన్న నీటిలో మునిగి చనిపోయినట్టు పోలీసులు తెలిపారు.

వలసపోతున్న దళితవాడలు

పాలకొండ (టౌన్), నవంబర్ 17: ఆర్థిక ఇబ్బందులు తాళలేక దళిత వాడలు వలసపోతున్నాయని జిల్లా దళిత మహిళాశక్తి అధ్యక్షురాలు జి.మరియమ్మ అన్నారు. శనివారం మండలంలోని రాజుపేట గ్రామంలో మహిళలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తమ సామాజిక వర్గాన్ని ఆదుకొనేందుకు ప్రత్యేక పథకాలను చేపట్టాల్సిన అవశ్యకత ఉందన్నారు. కులవృత్తి లేక సాగు చేసేందుకు భూమి కూడా లేకపోవడంతో చేసేందుకు కూలి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు చేతివృత్తులు చేసుకొనేందుకు ప్రత్యేకంగా ఆర్థిక సహకారం ప్రభుత్వం అందించాలన్నారు.

స్వైన్‌ఫ్లూపై అవగాహన

హిరమండలం, నవంబర్ 17: స్వైన్‌ఫ్లూ వ్యాధిపై అవగాహనా సదస్సును శనివారం గులుమూరు గ్రామంలో నిర్వహించారు. చొర్లంగి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఈవో గణపతిరావు మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ వ్యాధిని గుర్తించి వాటి నివారణా చర్యలు చేపట్టవచ్చునన్నారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిపై భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మల్లేశ్వరరావు, కాంచన తదితరులు పాల్గొన్నారు.

విహారాలకు వెళ్లి... విషాదాల్లోకి

పాలకొండ, నవంబర్ 17: జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో వంగర మండలంలో ఉన్న మడ్డువలస ప్రాజెక్టు ప్రాంతం ఒకటి. ఇక్కడికి కొద్ది కిలోమీటర్ల దూరంలో జీ ఎం ఆర్ ఐటీ ఇంజనీరింగ్ కళాశాల ఉండడంతో విహారానికి ఎక్కువగా చదువుతున్న యువతీ యువకులు వస్తుంటారు. తెలిసీ తెలియని వయస్సులో హెచ్చరిక బోర్డులను కూడా ఖాతరు చేయకుండా ఆ ప్రాంతంలో మునిగేందుకు ప్రయత్నం చేయడంతో ఈతరాని వీరు మృత్యువాత పడుతున్నారు. తిరిగి రాని లోకాలకు చేరి ఎన్నో ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిలిస్తున్నారు.

మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించాలి

ఒంగోలు, నవంబర్ 17 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని రానున్న ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని రాష్ట్ర అటవీశాఖా మంత్రి శిద్దా రాఘవరావు బూత్ కన్వీనర్లుకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎ-1 ఫంక్షన్ హాలులో దర్శి నియోజక వర్గ పరిధిలోని దర్శి, ముండ్లమూరు మండలాలకు చెందిన బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్ద పీఠ వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు.

Pages