S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

maatata

శ్రీనరసింహ శతకము

సీ ధీరతఁ బరుల నిందింపనేర్చితిఁగాని
తిన్నగా నినుఁ బ్రస్తుతింపనైతి
పొరుగు కామినులందు బుద్ధి నిల్పితిఁగాని
నిన్నునే సతము ధ్యానింపనైతి
పొరికి ముచ్చటలైన మురిసివింటిని గాని
యెంచి నీకథలాల- కించనైతి
కౌతుకంబునఁ బాతకము గడించితిఁగాని
హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి
తే అవనిలో నేను జన్మించి నందుకేమి
సార్థకము గానరాదాయె స్వల్పమైన
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ కథలు -శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ

కానీ, దాన్ని తెగేసి ప్రోత్సహిస్తూ శ్రీపాదవారు జూనియరూ కాదు, అల్లుడు అన్న కథ రాశారు. తహస్సీలుదారు గాదు -వర్తకుడు, వెలుగు-చీకటి నలుగుర్ని పోషిస్తున్నానిప్పుడు అన్న కథలు పాఠకులలో స్వతంత్ర వృత్తిమీద ఆసక్తిని, గౌరవాన్ని కూడా పెంపొందించాయని నాటికీ నేటికీ విజ్ఞులు వక్కాణిస్తున్నారు. వీరేశలింగం పంతులుగారు అన్నా, బంకించంద్ర ఛటోపాధ్యాయగారు అంటేనూ శాస్ర్తీగారికి చెప్పనలవిగాని యిష్టం. వీరేశలింగం పంతులుగారినే తనకథలలో ఒక పాత్రగా ప్రవేశపెట్టి రంజుగా; సంఘ శ్రేయోభిముఖంగా కొన్ని కథలను ఆయన నడిపించాడు. స్ర్తి జనోద్ధరణ మాత్రమే గాదు-స్ర్తిల మీద అపారమైన ప్రేమాభిమానాలతో శ్రీపాదవారు ఎక్కువ భాగం కథలు రాశారు.

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com

మోక్షానికి మార్గం భగవద్గీత

దీని ఆవశ్యకత కలియుగంలోనే ఎక్కువగా ఉంటుందనే తలంపుతో అందించాడు. నిజంగానే గీతామృతాన్ని లోకానికి అందించాడు. సంసార సాగరంలో ఈదులాడేవాడు దీనిని తప్పక చదవాలి. ఈ సంసార సాగరంలో మునిగిపోయేవాడికి, లేదా మునిగిపోతున్నవాడికి నిస్సంశయంగా యిది ఒక నావే!
ఈ గీతాసారాన్ని విపరీతంగా అధ్యయనం చేసిన మహనీయుడు, గొప్ప నాటక కర్త కీ.శే. కాళ్ళకూరి నారాయణరావుగారు తమ భక్త చింతామణి నాటకంలో మొదటి రంగంలోనే నాయకుడైన బిల్వమంగళుని నోటిమీదుగా-
కష్ట్భరితంబు బహుళ దుఃఖ ప్రదంబు
సార రహితంబునైన సంసారమందు
భార్యయను స్వర్గమొకటి కల్పనము జేసె
పురుషుల నిమిత్తము పురాణ పురుషుండు!

డా అక్కిరాజు సుందర రామకృష్ణ

అనంతం-43

రాగ్యా వైపు చూస్తూ-
రాగ్యా దగ్గిరకి వెళ్ళాడు.
దేవర చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు.
‘‘పరిత్తితి గ్రెహిచ్చే అడుగుతుండాఁవు! సెప్పు సాఁవీ’’ అని, దేవరకి మళ్ళీ దణ్ణం పెట్టాడు నగ్గూరాం.
‘‘ఇనుకోండి రా...సెప్తుండాను.’’
అందరూ దేవరవైపు ఆసక్తిగా చూస్తున్నారు!
‘‘శలాకి పిల్ల! శందురుడి పేరుండ సక్కదనాల పిల్ల.’’
‘‘శాందినీ గాదు గదా’’అన్నాడు నగ్గూరాం.
‘‘అవున్రొరే.. నగ్గూరాంగా! శాందినీనే జోగిన్ని సెయ్యాల’’అని దేవర తేల్చి చెప్పాడు.
‘‘నా కూతుర్నా’’
‘‘అవున్రొఁరే.. ’’అన్నాడు దేవర.
అంతే-
‘‘దేవరా..!’’అంటూ నగ్గూరాం గావుకేక పెట్టి,-

-గోపరాజు నాగేశ్వరరావు

హిందూమత దివ్యత్వం

మతపరమైన ఘర్షణలు మరియు యుద్ధాలు, మత మార్పిడులు మరియు మత ప్రచారము సమాంతరంగా సాగే కలియుగంలో ప్రస్తుతం మనము జీవిస్తున్నాము. మత విశ్వాస ప్రచారం చేయడానికి టీవీ, సమావేశాలు మరిఅయు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం వంటి సాధానాలు అన్నీ ఉపయోగించబడుతున్నాయి. ‘‘ఎందుకీ ఘర్షణలు మరియు యుద్ధాలు జరుగుతున్నాయి’’ అని ప్రశ్నిస్తే, వారి మతం శాంతియుతమైనదని పేర్కొంటూ ఇతర మత విశ్వాసాలను నిందిస్తారు.

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562

పరమహంస బోధామృతము

153. సమారాధనకు పలువురు ఆహ్వానింపబడినపుడు వారు చేయు గోల విశేషముగా వినవచ్చును. కాని యా గందరగోళము అంతయు వారు భోజనము ఆరంభించునంతవరకే. వడ్డన అయిన భోజనము ప్రారంభించుసరికి శబ్దము ముప్పాతిక పాలు అణిగిపోవును. ఇక బూరెలు వచ్చును- వడ్డన సాగిన కొలది శబ్దము క్షీణించుచుండును. మజ్జిగ దగ్గరకు జర్రుకొను శబ్దముదక్క మరేదియు వినబడదు. భోజనములు అయినంతనే ఇక వారు చేయు పని నిద్రపోవుటయే.

సుందరకాండ

అశోక వనం కనబడింది. అంటే సుఖ స్వరూపం కనబడింది. దాని వలన తాను చూడనిదేదో చూడవలసినదేదో తెలిసింది. ఇంతకంటె ఏం కావాలి. కనుక. రహస్యమేమిటంటే- స్వామి సీతను వెదుకలేదు. సీతే స్వామికి కనబడింది వెదుకుతున్నానని అనుకొన్నంత సేపు ఆవిడ కనబడలేదు. మహాకవుల కావ్యాలలో ‘మరణం’ అని ఒక అవస్త ఉంటుంది. మరణం అంటే చావు కాదు. మూర్చ. మరణ స్థితి వంటి స్థితి. అప్పుడు తన శరీరం తన వశంలో ఉండదు. తన యింద్రియాలు తన అదుపులో ఉండవు. తన మనస్సు తన స్వాధీనంలో ఉండదు. ఇట్టి స్థితి అందులో ఉన్న నాయికకు కలుగుతుంది. ఆ క్షణంలో నాయిక దర్శనం కలుగుతుంది. తిరిగి ఆమె జీవిస్తుంది. అంటే- తిరిగి ఆమె యింద్రియాలుఆమె ఆధీనమవుతాయి.

స్వాధ్యాయ సందోహం-201

ఆచార్యుడే ఉత్తముడయితే బాలుర జీవితమే సమున్నతస్థాయి నందుకొంటుంది. అంతేకాదు తల్లిదండ్రులవలన సంక్రమించిన కుసంస్కారాలు కూడ ఆ బాలురనుండి తుడిచిపెట్టుకుపోతాయి.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

మహాభారతంలో ఉపాఖ్యానాలు -107

పూర్వం కాయవ్యుడు అనే ఎరుకలవాడు ఉండేవాడు. అతను వృత్తి చేత దోపిడీదొంగ. కాని నిజజీవితంలో అతను బుద్ధిమం తుడు, శూరుడు, చదువుకున్న వాడు, కౄరత్వం లేనివాడు. అతనికి నాలుగు వర్ణాశ్రమాలలో ఉన్న ధర్మాల గురించి క్షుణ్ణంగా తెలుసు. బ్రహ్మజ్ఞానం కలవాడు. గురువులను పూజించే వాడు. అతను ఒక క్షత్రియునికి, నిషాదికి జన్మించాడు. కనుక క్షత్రియ ధర్మాలను చక్కగా నిష్ఠతో పాటించే వాడు. కనుక అతను దస్యుడయినా సిద్ధి పొందాడు. అతను ప్రతిదినం ఉదయం సాయంత్రం సమయాలలో అరణ్యమృగాలను ఉత్తేజపరిచేవాడు. అతనికి వివిధ జాతుల మృగాల స్వభావాలన్నీ చక్కగా తెలుసు. అందరి ఆటవికులలో అతను నిపుణుడు.

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి

Pages