S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
మనదేశంలో వేలకోట్ల రూపాయల అవినీతి కలాపాలు నిర్వహించినవారు శిక్షలను తప్పించుకొని విదేశాలకు పారిపోవడం కొనసాగుతున్న ప్రక్రియ... ఈ ‘ప్రక్రియ’ పేరు ప్రపంచీకరణ! విజయమాల్యా, నీరవ్ మోడీ వంటివారు పారిపోయినవారిలో కొందరు మాత్రమే! పారిపోవడం, పారిపోయినవారిని మళ్లీ మనదేశానికి తరలించుకుని వచ్చే ‘తతంగం’ దశాబ్దుల పాటు కొనసాగడం ‘ప్రపంచీకరణ’... స్వేచ్ఛావాణిజ్య అంతర్జాతీయ సూత్రం ప్రాతిపదిక!!
అధ్యయనం, పరిశోధన కేవలం ముసుగులు... ఈ ‘ముసుగు’లను తొడిగిన వివిధ అంతర్జాతీయ ‘బౌద్ధిక’ బీభత్స సంస్థలు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి తరచు వివిధ నిర్ధారణలు చేస్తున్నాయి. ‘మానవ అధికార పరిరక్షణ’- ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్- పేరుతో ఈ తథాకథిత- సోకాల్డ్- స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న నిర్ధారణలు దీర్ఘకాల పథకంలో భాగం. ఈ దీర్ఘకాల పథకం లక్ష్యం మన దేశాన్ని మళ్లీ ఎదగకుండా నిరోధించడం!
మన దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలలో ‘సంస్థాగత ప్రజాస్వామ్యం’ వ్యవస్థీకృతం కాకపోవడం మన ‘‘పరిణత’’ రాజ్యాంగ ప్రక్రియలో నిహితమై ఉన్న ప్రధాన లోపం. లోక్‌సభకు, రాజ్యసభకు రాష్ట్రాల శాసనసభలకు, శాసన మండలులకు జరుగుతున్న ఎన్నికలలో వివిధ పక్షాల తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ‘అభ్యర్థుల’ను ఆయా రాజకీయ పక్షాల ‘అధిష్ఠాన వర్గాలు’ నిర్ణయిస్తున్నాయి.
వివిధ విదేశాల ప్రభుత్వాలు మన అంతర్గత వ్యవహారాలలో తమ ‘వికృత ముఖాల’ను దూర్చుతుండడానికి కారణం ప్రధానంగా మన ప్రభుత్వం దశాబ్దుల తరబడి అనుసరిస్తున్న మెతక విధానం. గత ఐదేళ్లలో మన విదేశాంగ నీతి కొంత ‘కరకు’ తేలినప్పటికీ ప్రపంచ దేశాలు కొన్ని మన పట్ల తేలికభావం వహించి ఉన్నాయి. ‘‘ఇటుక విసరితే రాయితో జవాబు చెప్తాం’’- ఈంట్ కా జవాబ్ పత్థర్ సేదేంగే- అన్నది మన ప్రభుత్వ విధానంలో ఇప్పటికీ ప్రస్ఫుటించడం లేదు.
కల్లోల ‘గాంధారం’ కుదుట పడుతుందా? అన్నది మళ్లీ వినిపిస్తున్న ప్రశ్న... ప్రాచీన ‘గాంధారం’ నేటి అఫ్ఘానిస్థాన్! ఈ గాంధారం చరిత్ర క్రీస్తుశకం ఏడవ శతాబ్ది చివరినుంచి రక్తసిక్తం అవుతూనే ఉంది. ఈ కల్లోల చరిత్రలో వర్తమాన ఘట్టం పద్దెనిమిదేళ్లుగా అమెరికా నాయకత్వంలోని ‘ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి’-నాటో- దళాలు అఫ్ఘానిస్థాన్‌లో ‘శాంతి’ని నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నం!
ప్రభుత్వ పారిశ్రామిక రంగం భాగస్వామ్య పారిశ్రామిక రంగంగా మారుతోంది. ప్రభుత్వ ప్రభుత్వేతర భాగస్వామ్యం- పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్- పిపిపి- గురించి దశాబ్దుల తరబడి పెద్దఎత్తున ప్రచారం జరిగింది! ఈ ‘పిపిపి’ పథకాల స్వరూప స్వభావాలు సామాన్యులకు అర్థం కావు! అర్థమయినట్టయితే పథకాల గొప్పదనం ఏముంది? అందువల్ల మాన్యులు మహనీయులు ఆర్థిక నిపుణులు వివరించాలి!
బర్మా అధ్యక్షుడు యూవిన్ మియాంట్ మన దేశంలో జరుపుతున్న నాలుగురోజుల పర్యటనకు మాధ్యమాలలో ప్రాధాన్యం లభించక పోవడం ఆశ్చర్యకరం కాదు. ఇరుగు పొరుగున ఉన్న మన దేశం, బర్మా- మ్యాన్‌మార్- దేశం పరస్పరం అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండడం క్రీస్తుశకం 1948నుంచి నడుస్తున్న కథ...
నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన రెండువేల నాలుగువందల మతపరమైన కట్టడాల గురించి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం వారు ఆందోళనను వ్యక్తంచేయడం సరికొత్త పరిణామం. అక్రమ నిర్మాణాలు అప్రతిహతంగా కొనసాగుతుండడం ఈ ఆందోళనకు నేపథ్యం.
ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం నాలుగురోజులుగా చెలరేగుతున్న వికృత విధ్వంసకాండ ఫలితం, భయానక బీభత్సకాండ ఫలితం! ‘‘శరణార్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించాలన్న మానవీయ శాసనాన్ని’’ వ్యతిరేకిస్తున్నవారు వారాల తరబడి జరుపుతున్న అల్లర్లకు పరాకాష్ఠ ఈ విధ్వంసకాండ... ఈ మారణకాండ... ఈ బీభత్సకాండ, ఈ పైశాచిక కాండ!
ద్వైపాక్షిక మైత్రీ స్వరాలు మారుమోగడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో జరిపిన రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రస్ఫుటించిన మహావిషయం. ఈ మైత్రీ ధ్వనులు మాథ్యమాలలోను లక్షల మంది ఉత్కంఠ పూరిత అభిమానుల గుండెలలోను పెద్దగా ప్రతిధ్వనిస్తుండడం ఈ రెండు రోజుల ముచ్చట. సోమ, మంగళవారాలలో దాదాపు ముప్పయి ఆరు గంటల పర్యటన వినూతన మైత్రీ చరిత్రకు శ్రీకారమన్నది జరుగుతున్న ప్రచారం.