S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

11/01/2019 - 21:18

టిబెట్‌తో మన దేశానికి అనాదిగా సంబంధం ఉంది! టిబెట్ స్వా తంత్య్ర ఉద్యమానికి మన ప్రభుత్వం బహిరంగంగా మద్దతును ప్రకటించడం వర్తమాన చారిత్రక అనివార్యం. మన జమ్మూ కశ్మీర్‌లో నిరంతరం జోక్యం కల్పించుకుంటున్న చైనా నియంతలను నోరుమూయించడానికి ఈ ‘చారిత్రక అనివార్యం’ దోహదం చేయగలదు. జమ్మూకశ్మీర్‌తో వేల సంవత్సరాలుగా చైనాకు సంబంధం లేదు, జమ్మూకశ్మీర్ అనాదిగా మన దేశపు భూభాగం.

11/01/2019 - 02:03

తినడం మనుగడ కోసం అన్నది పాతకథ. తినడం మానవ జీవన ప్రధాన లక్ష్యంగా మారి ఉండడం నడుస్తున్న వ్యథ.. కొనగలవారు రోజంతా తింటూనే ఉన్నారు. కొనలేనివారు పండ్లు గింజుకొని పస్తులుంటున్నారు. వాణిజ్య ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్- మన నెత్తికెత్తిన వైపరీత్యం ఇది! వండనవసరం లేదు, వండడం కోసం వంగి లేచి శ్రమ పడనవసరం లేదు. వండేవారు వేఱుగా ఉన్నారు, వడ్డించేవారు వేఱుగా ఉన్నారు.

10/31/2019 - 01:42

జిహాదీ బీభత్సకాండకు ‘స్ఫూర్తి’ ప్రాంగణమైన సౌదీ అరేబియాతో మన సంబంధాలు ‘వాణిజ్య అనివార్యం’గా మారి ఉండడం మన ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో జరిపిన రెండురోజుల పర్యటనకు నేపథ్యం. ఉభయ దేశాల మధ్య ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ వికసించడానికి భూమిక ఏర్పడిందన్న ప్రచారం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ, ఇరవై తొమ్మిదవ తేదీలలో మోదీ జరిపిన పర్యటన సందర్భంగా ప్రస్ఫుటించిన ప్రధాన అంశం.

10/30/2019 - 02:06

జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉండడం నడుస్తున్న చరిత్ర. సూర్యుని వెలుగును చూడని గుడ్లగూబలవలె దేశంలోని ‘కొంతమంది’ జమ్మూకశ్మీర్‌లో మానవ అధికారాలకు విఘాతం ఏర్పడిపోయిందని విలపిస్తున్నారు. ఈ అంతర్గత శత్రువుల ఏడుపుల ‘ఎక్కిళ్ల’ ధ్వనులు దేశ సరిహద్దులను దాటుకొని అంతర్జాతీయ వేదికలపై మరింత వికృతంగా వినిపిస్తున్నాయి.

10/29/2019 - 00:11

స్వచ్ఛతకు శరత్ ఋతువు సనాతన ప్రతీక. తుది మొదలు లేకుండా ఎప్పుడూ ఉన్నది, ఉంటున్నది, ఉండబోయేది ‘సనాతనమైనది’... ‘సనాతనం’అని అంటే ఇలా శాశ్వతమైనది. అందువల్ల ‘శరత్‌కాలం’ స్వచ్ఛతకు శాశ్వతమైన ప్రతీక. వర్ష ఋతువులో నీరు ఆకాశాన్ని శుభ్రం చేస్తోంది, భూమిని పరిశుభ్రం చేస్తోంది. ‘‘ఆపః పునన్తు పృథివీం...’’- ‘‘నీరు భూమిని పరిశుద్ధం చేయడం’’- సనాతన స్వచ్ఛతకు సహజ వ్యవస్థ.

10/25/2019 - 21:25

బ్రిటన్ రాజధాని లండన్ సమీపంలోని ఒక వాహనం- ట్రక్-లో ముప్పయి తొమ్మిది మంది చైనీయుల మృతదేహాలు బయటపడడం భయంకర విషాదం. ఈ చైనా పౌరులను ‘‘ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎందుకు హత్య చేశారన్న’’ విషయమై బ్రిటన్ ప్రభుత్వం పరిశోధనను ఆరంభించిందట. బల్గేరియా దేశానికి చెందిన ఈ ‘ట్రక్కు’లోని పెద్ద ‘శీతల పేటిక’- రిఫ్రిజరేటర్-లో ఈ మృతదేహాలను కనుగొన్నారట.

10/25/2019 - 00:42

వోటరుల పరిణతి మరింతగా ప్రస్ఫుటించడం మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలలో నిహితమై ఉన్న ప్రధాన అంశం. సమాఖ్య రాజ్యాంగ వ్యవస్థలో జాతీయస్థాయి సమస్యలు వేఱు, ప్రాంతీయ స్థాయి సమస్యలు వేఱు, పరిష్కారాలు కూడ వేఱు వేఱు. అందువల్ల జాతీయస్థాయి లోక్‌సభ ఎన్నికలలో ఇచ్చిన తీర్పులను ఆయా రాష్ట్రాలలో ‘వోటరు’లు శాసనసభ ఎన్నికలలో సైతం పునరావృత్తం చేస్తారని భావించడం కేవలం రాజకీయ భ్రమ!

10/24/2019 - 01:36

సిక్కు మత సంస్థాపకుడు నానక్ గురుదేవుని ధర్మప్రచార క్షేత్రమైన ‘కర్తార్‌పూర్’ను సందర్శించనున్న ‘తీర్థయాత్రికుల’ నుండి పదునాలుగు వందల రూపాయల చొప్పున ‘పన్ను’ వసూలు చేయాలని పాకిస్తాన్ నిర్ణయించడం ఆ ప్రభుత్వ బీభత్సకాండకు మరో ఉదాహరణ, మతపరమైన అసహిష్ణుతకు మరో నిరూపణ!

10/23/2019 - 01:00

ప్రభుత్వేతర రంగంలోని వైద్యశాలలు, విద్యాలయాలు ‘దోపిడీ కేంద్రా లు’గా, నిర్లక్ష్యపు నిలయాలుగా, అమానవీయతకు ఆటపట్టులుగా, పైశాచిక దురహంకార ప్రవృత్తికి పట్టుకొమ్మలుగా మారి ఉండడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’ మన నెత్తికెత్తిన వైపరీత్యం. దశాబ్దుల తరబడి మన నెత్తికెక్కిన ఈ వాణిజ్య-కార్పొరేట్- వైద్యశాలలలో, వాణిజ్య విద్యాశాలలలో క్రూరత్వం కొలువుతీరి ఉండడం బహిరంగ రహస్యం. ఈ క్రూరత్వం ఐరోపా వారి స్వభావం.

10/22/2019 - 01:35

దేశంలో దాదాపు యాబయి నాలుగు కోట్ల ఆవులు, ఎద్దులు, పెయ్య లు, కోడెలు, ఇతర పాడిపశువులు జీవిస్తున్నట్టు వెల్లడికావడం ఆందోళన కలిగించదగిన వాస్తవం. ప్రతి జిల్లాలోను కనీస స్థాయిలో పశుసంపద మానవుల సంఖ్య కంటె ఇరవై శాతం ఎక్కువ ఉండాలన్నది ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’ ఉన్నత న్యాయస్థానం 2012 ఆగస్టులో వ్యక్తం చేసిన అభిప్రాయం. జనాభా కంటె పశుసంతతి తగ్గిపోయి ఉండడం దేశమంతటా కొనసాగుతున్న దుస్థితి.

Pages