S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

07/20/2016 - 04:37

మన వైద్యులలో అధిక శాతానికి వైద్య వృత్తిని సాగించే అర్హతలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించడం ఆశ్చర్యకరం కాదు. నకిలీ వైద్యుల గుట్టు నిరంతరం రట్టు అవుతూనే ఉంది. ఈ రట్టవుతున్న వాస్తవాలను ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది. ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలో అల్లోపతి డాక్టర్లుగా సేవ చేస్తున్నవారిలో ముప్పయి ఒక్కశాతం కేవలం పాఠశాల విద్యను పూర్తిచేసి ఉన్నారట.

07/18/2016 - 23:37

ప్రజలు గెలిచారు. ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రజాగళానికి మరింతగా విలువ పెరిగింది. నియంతలు, నియంతృత్వాలకు ఇది కాలం కాదు. సమస్యల పరిష్కారానికి తిరుగుబాట్లు శరణ్యం కాదన్న వాస్తవం మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం కోసం కొనే్నళ్ల క్రితం అరబ్బు దేశాల ప్రజలు తిరగబడి ‘నియంతా..నువ్వెంత,,’అన్న రీతిలో తరిమికొట్టిన చారిత్రక క్షణాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.

07/18/2016 - 02:43

అం తర్గత భద్రతకు అవరోధాలు ఏర్పడుతుండడం శనివారంనాడు న్యూఢిల్లీలో, రాష్టప్రతి భవనం ప్రాంగణంలో జరిగిన ‘అంతర్ రాష్ట్ర మండలి’ సమావేశానికి నేపథ్య వైపరీత్యం! ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశంలో అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాల మధ్య నిఘా విభాగాల మధ్య సమన్వయం పెంపొందాలన్నది ఆయన ప్రసంగంలోని ప్రధాన ఇతివృత్తం!

07/16/2016 - 08:28

బిజెపి రాష్ట్ర నేతల్లో పరివర్తన వచ్చింది. అంతే కాదు సమయమూ కలిసి వచ్చిందన్న భావన కలిగింది. 20 ఏళ్ళలో ఎప్పుడూ లేనంతగా బలమైన ప్రతిపక్షం లేకుండా రాజకీయ శూన్యత ఏర్పడినందున, దానిని తమకు అనుకూలంగా మలచుకోవాలన్న ఆరాటమూ ఆరంభమైంది. ముప్పయి ఏళ్ళుగా తోక పార్టీగానే ముద్ర పడినందున, ఇక స్వతహాగా బలపడాలన్న ఆలోచన చేస్తున్నారు బిజెపి నాయకులు. తోక పార్టీ అనే ముద్రను తొలగించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.

07/16/2016 - 08:25

ఫ్రాన్స్‌లోని సముద్ర తీర పట్టణం నైస్‌లో జిహాదీ ఉగ్రవాది గురువారం రాత్రి సృష్టించిన బీభత్సకాండ ఆత్మాహుతి ప్రక్రియ అంతర్జాతీయంగా విస్తరించిపోతుండడానికి మరో పాశవిక సాక్ష్యం. కేవలం ఒక ఉగ్రవాది ఎనబయి నలుగురిని హత్య చేయగలగడం ఆత్మాహుతి జిహాదీ ప్రక్రియ భయంకర స్వభావానికి నిదర్శనం.

07/15/2016 - 03:07

బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా థెరేసా మాయ్ బుధవారం పాలనా బాధ్యతలను స్వీకరించడం మార్గెరట్ థాచర్ స్ఫూర్తిని మరోసారి స్ఫురింపచేస్తోంది. థాచరమ్మ వలె మాయమ్మ కూడ మహిళ కావడం గురించి బ్రిటన్‌లో మాత్రమే కాక అంతర్జాతీయంగా ప్రచారవౌతోంది. శతాబ్దుల బ్రిటన్ ప్రజాస్వామ్య రాజ్యాంగ పథ ప్రస్థాన రథానికి మహిళ సారథ్యం వహించడం ఇది రెండవసారి మాత్రమే కావడం ప్రచారానికి కేంద్ర బిందువు.

07/14/2016 - 06:11

తెలుగు రాష్ట్రాలలో నకిలీ పోలీసులు హల్‌చల్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని హైవేలలో ఎక్కువ సంచారం ఉండని ప్రాంతాలలో లారీ డ్రైవర్ల దగ్గర, ద్విచక్రవాహనదారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా మహిళలు కనబడితే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొందరికి ప్రజలు దేహశుద్ధిచేసినా బుద్ధి రావడంలేదు. వీటిని అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వుంది.

07/14/2016 - 06:06

అరుణాచల్‌ప్రదేశ్‌లో నిరుడు డిసెంబర్ 17వ తేదీన నెలకొని వుండిన ప్రభుత్వాన్ని యధాపూర్వకంగా పునరుద్ధరించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం మరో రాజ్యాంగ విప్లవం. ఈ తీర్పు ఫలితంగా ఈ సంవత్సరం జనవరి 26న అమలులోకి వచ్చిన రాష్టప్రతి పాలన రద్దయిపోయింది. రాష్టప్రతి పాలన విధించడానికి పూర్వం ముఖ్యమంత్రిగా ఉండిన నబమ్ తుకీ సర్వోన్నత నిర్దేశంతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

07/13/2016 - 07:02

అర్థరాత్రి, అపరాత్రి షాపింగ్‌లకు, సినిమాలకు ఎంతమంది వెళ్లగలరు? ఈ సమయంలో ఆడవారు, వృద్ధులు ఈ సదుపాయాన్ని ఎంతవరకు ఉపయోగించుకోగలరు? మన యింటి పక్కన మనకు కావలసినవి దొరకవు కదా. మరి లోకల్ బస్సులను రాత్రంతా నడుపుతారా? అందరికి స్వంత వాహనాలు ఉండవు. దీనివల్ల నిరుద్యోగం నివారించబడుతుందా? రాత్రి తెల్లవార్లు షాపులు తెరచి ఉండటం వల్ల కరెంటు ఖర్చు ఎంతవుతుందో కదా.

07/13/2016 - 06:59

దండయాత్రల ద్వారా 300 సం వత్సరాలు భారతీయ సంపత్తిని దోచుకునిపోయి, తిరిగి 12వ శతా బ్దం అంతం నుంచి దేశంలోనే స్థిరపడి,హిందువులను నానావిధాల బాధిస్తున్న వారి దేవాలయాలను ధ్వంసంచేస్తున్న విదేశీ ముస్లిం పాలకులను ఎదిరించి హిందువుల ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించిన రాజ్యాలు విజయనగరం (1336), హిందు పదపద షాహి పేరుతో మరాఠా సామ్రాజ్యం (1674), సిక్కు రాజ్యాలు (1710).

Pages