S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

06/21/2016 - 04:33

హైదరాబాద్ నుంచి తాత్కాలిక అమరావతికి అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలిపోనున్న మహాపథం పొడవునా గందరగోళం కొలువుతీరి ఉంది. ఈ గందరగోళం రాజాధాని ప్రస్థాన ప్రహసనాన్ని అడుగడుగునా నిలదీస్తోంది. తాత్కాలిక రాజధాని నిర్మాణం వాయువేగ మనోవేగాలతో జరిగిపోతోందన్నది జరిగిన ప్రచారం. తాత్కాలిక రాజధానికి తరలిపోవడం ఎందుకన్నది ప్రధానమైన ప్రశ్న.

06/20/2016 - 05:16

పట్ట్భద్ర స్థాయి కళాశాలలలో ప్రవేశించదలచిన వారు అఖిల భారత స్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలన్న ప్రతిపాదన విద్యా ప్రమాణాలను పెంచడానికి దోహదం చేసింది. ఉన్నత విద్యా విధాన అధ్యయన సంఘం వారు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని ఈ ప్రతిపాదన-ఆలస్యంగా అయినా అంకురించడం అద్భుతమైన విషయం.

06/18/2016 - 00:18

గోద్రా దగ్ధకాండ జరిగిన తరువాత గుజరాత్‌లో హింసాకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తున్న న్యాయప్రక్రియలో ఇది మరో ఘట్టం. ఆహమ్మదాబాద్ సమీపంలోని గుల్‌బర్గ్‌లో దహనకాండ జరిపిన నేరస్థులకు శుక్రవారం అహమ్మదాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం కారాగార శిక్షను విధించడం దేశంలో పరిఢవిల్లుతున్న సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ స్ఫూర్తికి నిదర్శనం.

06/16/2016 - 23:35

ద్రవ్యోల్బణ వైచిత్రికి టమోటా పండ్ల ధరలు పెరుగుతుండడం విలక్షమైన ఉదాహరణ. ‘‘ఈరోజు పత్రిక చదివావా? పది రూపాయలకు మూడు కిలోల టమోటాలు ఇస్తున్నారట..’’ అని ‘‘గృహ సహాయిక’’ గృహిణిని పరీక్షించి మూడు నెలలు కాలేదు. నిన్న నేడు పది రూపాయలకు రెండు టమోటాలు రావడం లేదు. అరటి పండ్ల కంటె, మామిడి పండు కంటె ఎర్రని టమోటా ప్రాధాన్యం పెరిగిపోయింది.

06/16/2016 - 05:20

ఎయిర్ ఇండియా- పౌరవిమాన సంస్థకు చెందిన వాటాలను భారీగా విక్రయించాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం ఊపందుకుంటున్న పెట్టుబడుల ఉపసంహరణకు మరో నిదర్శనం. ఎయిర్ ఇండియా ఏళ్ల తరబడి నష్టాలను గడించడం ఈ వాటాలను అమ్మడానికి కారణం కావచ్చు.

06/15/2016 - 03:40

రాష్ట్ర రహదారి రవాణా సంస్థ-ఆర్టీసీ-కి చెందిన మిగులు భూములను వాణిజ్య కలాపాలకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ శివారులలోని వేల ఎకరాల భూములను ప్రభుత్వేతర సంస్థలు కాజేశాయి. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకోసం వేల ఎకరాలు వ్యవసాయ భూములను సేకరిస్తోంది.

06/13/2016 - 23:40

ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం-ఐఎస్‌ఐఎస్- జిహాదీ ముఠాకు చెందిన ఉగ్రవాది అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం జరిపిన భయంకర హత్యాకాండ అంతర్జాతీయ బీభత్సకాండలో భాగం. గతంలో అల్‌ఖాయిదా, తాలిబన్ తండాలు ఇటీవల బొకోహరామ్ వంటి ముఠాలు చెలరేగాయి. ఐఎస్‌ఐఎస్ తన కలాపాలను మొదలుపెట్టిన తరువాత ఈ ముఠా అంతర్జాతీయ బీభత్సకాండకు కేంద్ర బిందువైంది. సిరియాలోను ఇరాక్‌లోను ఈ ముఠా జరుపుతున్న పోరాటం ముసుగు మాత్రమే.

06/13/2016 - 04:46

రహదారి భద్రత, రాకపోకల నియంత్రణ వ్యవహారాల జాతీయ మండలిని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మన ప్రజాస్వామ్య వైచిత్రికి మరో ఉదాహరణ. జాతీయ ప్రయోజనకరమైన పరిష్కారాల పట్ల అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయం కలిగి ఉండడం ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనమన్నది నిరాకరించజాలని వాస్తవం. మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతి పెద్దది. పరిణతికి ప్రతిరూపంగా మన రాజ్యాంగ వ్యవస్థ ప్రసిద్ధి కెక్కింది.

06/10/2016 - 23:49

స్వదేశీయ పరిజ్ఞానంతో బిటి పత్తి విత్తనాలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం పరిశోధన ప్రక్రియను వేగవంతం చేస్తోందట. మహికో మొన్‌సాంటో బయోటెక్ ఇండియా లిమిటెడ్-ఎమ్‌ఎమ్‌బి- వంటి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల గుత్త్ధాపత్యం నుండి బిటి పరిజ్ఞానాన్ని విముక్తం చేయడానికి ఈ పరిశోధనలు ఉపయోగపడనున్నట్టు ప్రచారం అవుతోంది.

06/10/2016 - 05:30

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పార్లమెంటు-కాంగ్రెస్- ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించిన చారిత్రక పరిణామం. నరేంద్ర మోదీ ప్రసంగ ప్రభావ తరంగాలు విస్తరిస్తుండిన సమయంలోనే అంతర్జాతీయ దృష్టిని మరింతగా ఆకట్టుకున్న మరో మహా పరిణామం అమెరికాలో సంభవించింది. హిల్లరీ రోథమ్ క్లింటన్ సాధించిన సంస్థాగత ఘన విజయం ఈ సమాంతర పరిణామం.

Pages