S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

04/26/2018 - 23:03

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించడం ‘సమా ఖ్య కూటమి’ వల్ల సంభవించిన విప్లవ పరిణామం. సమాఖ్య కూటమి ఏర్పడవలసి ఉంది. కానీ జాతీయ స్థాయిలో మళ్లీ ‘మిశ్రమ రాజకీయ’ శకాన్ని స్థాపించడానికై ‘వలసిన’ నాయకత్వం కోసం మాత్రం పోటీ ఆరంభమైంది.

04/26/2018 - 03:55

ఆశారామ్ బాపు అనే లైంగిక బీభత్సకారుడికి యావజ్జీవ కారాగృహవాస దండన లభించడం ‘్ధర్మాచార్యుల’ వేషంలో జనవంచనకు ఒడిగడుతున్న దుర్మార్గులకు మరో గుణపాఠం. పదహారేళ్ల బాలికను తన లైంగిక బీభత్సకాండకు బలిచేసిన కామపిశాచి ఈ ఆశారామ్- నరరూప రాక్షసుడు! దుర్మార్గులుగా చెలామణి అవుతున్న దుర్మార్గులను సమాజం నిరసిస్తోంది, అసహ్యించుకొంటోంది, అభిశంసిస్తోంది, శిక్షిస్తోంది!

04/25/2018 - 04:00

మేఘాలయలో ఇరవై ఏడేళ్లుగా అమలులో ఉన్న ‘సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టా’న్ని ఉపసంహరించుకొనడం ఈశాన్య ప్రాంతాలలో శాంతిభద్రతలు మెరుగుపడుతుండడానికి చిహ్నం కావచ్చు. జనంలో జాతీయతా నిష్ఠ పెరగడం ఇలా శాంతిభద్రతలు మెరుగుపడడానికి కారణం కావచ్చు! 2000వ సంవత్సరంతో పోల్చినప్పుడు ఈశాన్య ప్రాంతంలో విద్రోహ ఘటనలు, దేశ వ్యతిరేక బీభత్స ఘటనలు ప్రస్తుతం ఎనబయి ఐదు శాతం తగ్గిపోయాయన్నది ఆధికారిక ధ్రువీకరణ.

04/23/2018 - 23:43

మన ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల ఇరవై ఏడవ, ఇరవై ఎనిమిదవ తేదీల్లో చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం జరుపనుండడం ‘కుహనా పారవశ్యంతో కుతికెలు నిండిన’ వారికి మరో గొప్ప చర్చనీయాంశం!

04/21/2018 - 00:01

సముద్రాలలో నెలకొని ఉన్న చిన్న దేశాల ఆర్థిక సౌష్టవాన్ని పరిరక్షించడం, పర్యావరణాన్ని సంరక్షించడం ‘కామన్‌వెల్త్’ దేశాల ప్రధాన కార్యక్రమం కావాలన్నది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదన.

04/19/2018 - 23:34

లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించడం రాజకీ య సౌలభ్యం మాత్రమే, ప్రజాస్వామ్య స్వభావం కాదు. పదే పదే ఎన్నికలు జరగడం వల్ల పాలకుల దృష్టి ‘పాలన’ పైనుంచి ‘ప్రచారం’ వైపు మరలడం అనివార్యం. ‘పాలన కుంటుపడుతోంది. ప్రగతి వేగం మందకొడి తనానికి గురవుతోంది’ అన్నది తరచూ వినబడుతున్న వాదం. ఇందులో యథార్థం లేకపోలేదు. కానీ ‘ఏకకాలం ఎన్నికల’ కోరిక వెనుక దీనికి మించిన మరో అంశం దాగి ఉంది. అదీ రాజకీయ సౌలభ్యం.

04/18/2018 - 23:41

లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించడం అసాధ్యమన్నది ‘్భరత న్యాయ వ్యవహారాల మండలి’ వారి విచిత్ర ప్రతిపాదనల సారాంశం! మధ్యంతరంగా ఎన్నికలను జరపడాన్ని నిరోధించడానికి వీలుగా ఈ ‘మండలి’ చేసిన ప్రతిపాదనలు మరిన్ని మధ్యంతర విన్యాసాలకు దారితీయగలవు. అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలను ‘మండలి’ వారు రూపొందించడం మరో విచిత్రం! ‘మండలి’ వారు బహుశా గమనించని మరో విచిత్రం ఉంది.

04/17/2018 - 23:45

మక్కా మసీదు పేలుడు దుర్ఘటనకు సంబంధించి అభియోగంలో అసీమానంద స్వామి, మరో నలుగురు నిందితులు నిర్దోషులన్న నిజం నిగ్గుతేలడం సత్యానికి సంభవించిన విజయం, తరతరాల జాతీయ స్వభావానికి సంభవించిన విజయం.

04/17/2018 - 00:00

కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు వైద్యసేవలు అందించేందుకు ప్రభు త్వం ‘కార్మికరాజ్య బీమా సంస్థ’ (ఇ.ఎస్.ఐ.కార్పొరేషన్)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పలు ఆసుపత్రుల్లో ప్రభుత్వరంగ, ప్రభుత్వేతర కర్మాగారాల్లోని కార్మికులకు వైద్యసేవలందించాలి. ప్రతి కార్మికుడి వేతనం నుండి వందకు రూపాయి డెబ్బయి అయిదు పైసలు, యాజమాన్యం నాలుగు రూపాయల డెబ్బయి అయిదు పైసలు వెరసి ఆరురూపాయల ఏభై పైసలు సంస్థకు జమ అవుతుంటాయి.

04/16/2018 - 23:52

మినీ ఒలింపిక్స్’ కామనె్వల్త్ క్రీడలకు తెరపడింది. భారత క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ విజయ కేతనాన్ని ఎగురవేయగలని భారత క్రీడాబృందం నిరూపించింది. పతకాల పట్టికలో మూడో స్థానానికే ఇంతగా మురిసిపోవాలా? అదే అత్యుత్తమమని కేరింతలు కొట్టాలా? ఏదో ఘన కార్యాన్ని సాధించామని భుజాలు చరచుకోవాలా? నిజమే..

Pages