S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

04/23/2016 - 04:16

జాతికి సేవచేసినందుకు నన్ను శిక్షించారు, నా గౌరవాన్ని నా అధికారాన్ని నా ఉద్యోగాన్ని దోచుకున్నారు-అని సైనిక అధికారి లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ వాపోయాడు. చేయని నేరానికి ఆయన ఎనిమిదేళ్లుగా నిర్బంధంలో ఉన్నాడు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌రైలులో జరిగిన పేలుళ్లను ఆయనే జరిపించినట్టు ప్రచారమైంది. మాలేగావ్ పేలుళ్ల అభియోగంలో కూడ ఈ సైనికాధికారి ప్రధాన నిందితుడు.

04/21/2016 - 23:50

ఉత్తరఖండ్‌లో రాష్టప్రతి పాలనను ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రద్దు చేయడం మన ప్రజాస్వామ్య చరిత్రలో మరో రాజ్యాంగ విస్ఫోటనం. హైకోర్టు తీర్పు తుది నిర్ణయం కాకపోవచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారు సర్వోన్నత న్యాయస్థానంలో ఈ తీర్పును సవాలు చేసే అవకాశం ఉంది. అందువల్ల గురువారంనాడు హైకోర్టు నిర్దేశించిన విధంగా ఏప్రిల్ 29వ తేదీన ఉత్తరఖండ్ శాసనసభలో బలాబలాల పరీక్ష జరుగుతుందా?

04/20/2016 - 22:03

వివిధ వస్తువులపై సుంకాలను తగ్గించాలని మన ప్రభుత్వంపై తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా ప్రాంత దేశాలు ఒత్తడి తెస్తున్నాయట. సుంకాలను రద్దు చేయాలని కనీసం బాగా తగ్గించాలని ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య సమాఖ్య పేరుతో చెలామణి అవుతున్న ఈ దేశాల వారు కోరుతున్నారట. పదహారు దేశాల ఈ విస్తృత ప్రాంతీయ సమాఖ్యలో మనదేశానికి సభ్యత్వం ఉంది.

04/19/2016 - 23:48

మనదేశానికి తరలి వస్తున్న విదేశాల పెట్టుబడుల-్ఫరిన్ డైరెక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్-ఎఫ్‌డిఐ-లో అత్యధిక శాతం ‘సేవల రంగం’లో వినియోగమవుతున్నాయన్నది రెండు దశాబ్దుల అనుభవం. ఈ వాస్తవం 2015లో మరోసారి ధ్రువపడడం కొనసాగుతున్న వైపరీత్యం. 1994లో మనదేశంలో ప్రపంచీకరణకు అంకురార్పణ జరిగినప్పటి నుంచి ఈ వైపరీత్యం కొనసాగుతోంది.

04/18/2016 - 23:34

ఆ అమ్మాయి నిజం చెప్పింది కాబట్టి కశ్మీర్ లోయలో విచ్ఛిన్న వహ్ని జ్వాలలు చల్లారుతున్నాయి. సైనిక దళాలను అప్రతిష్ఠ పాలు చేయడానికి జిహాదీలు చేసిన మరో ప్రయ త్నం బెడిసికొట్టింది. జిహాదీ బీభత్సకారుల బెదిరింపులకు హడలిపోయి ఆ బాలిక వౌనం వహించి ఉండినట్టయితే కశ్మీర్ లోయ ప్రాంతాన్ని గత ఐదారురోజులుగా ముంచెత్తుతున్న విచ్ఛిన్న కల్లోల కీలలు మరింతగా ఎగసిపడి వుండేవి!

04/18/2016 - 06:24

ప్రపంచం వేడెక్కుతోందన్నది దీర్ఘకాల పరివర్తనకు సంబంధించిన వైపరీత్యం. మనదేశంలో మరీ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది అతి తక్కువ వ్యవధిలోనే ముంచుకొస్తోంది. వేసవి నిప్పుల కొలిమిగా మారింది. వేసవి అగ్నిగుండం అయింది. ఆకాశం నిప్పులను వర్షిస్తోంది. ప్రపంచంలో సగటున మరోపాతికేళ్లలో పెరగనున్న ఉష్ణోగ్రత తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్లలోనే పెరిగిపోతోందన్నది ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వ్యథ.

04/16/2016 - 00:05

పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వభావంలో మార్పు వస్తుందన్న భ్రమ మరోసారి తొలగిపోయింది. మన ప్రభుత్వం ఈ భ్రమకు పదేపదే గురి అవుతుండడం నడచిపోతున్న విచిత్ర ప్రహసనం..మన ప్రభుత్వం విశ్వసించడం, పాకిస్తాన్ ప్రభుత్వం ఈ భ్రమకు పదేపదే గురి అవుతుండడం నడచిపోతున్న విచిత్ర ప్రహసనం. మన ప్రభుత్వం విశ్వసించడం, పాకిస్తాన్ ప్రభుత్వం వంచించడం పునరావృత్తమవుతున్న ఘటనాక్రమం.

04/14/2016 - 23:08

ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపిఎల్-మహారాష్టల్రో నిర్వహించ తలపెట్టిన క్రికెట్ ఆటల పోటీలను ఇతర ప్రాంతాలకు తరలించాలని ముంబయి హైకోర్టు ఆదేశించడం నీటి కొరత తీవ్రత గురించి పాలకులకు మరోసారి గుర్తుచేస్తోంది. ఇలా తరలించడంవల్ల మహారాష్ట్ర ప్రాంతపు మంచినీటి సమస్యకు సమగ్ర పరిష్కారం లభించబోదని హైకోర్టు స్పష్టం చేయడం కూడ ప్రభుత్వాలకు లభించిన న్యాయాభిశంసన.

04/14/2016 - 05:22

మన దేశానికీ అమెరికాకూ మధ్య రక్షణ సదుపాయాల సహకారపు ఒప్పందం-లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ కుదరడం అనివార్యమైన దౌత్య పరిణామం. 2014 మే 26న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం పాలనా బాధ్యతలను స్వీకరించినప్పటినుంచి దేశ రక్షణకు పెరుగుతున్న ప్రాధాన్యం ఈ అపూర్వ పరిణామానికి ప్రాతిపదిక!

04/13/2016 - 07:34

మంచినీరు దొరకని నోళ్లు ఎండిపోతున్నాయి. నీటిచుక్క మిగలని భూగర్భం బీటలు పారిపోతోంది. కేరళ నుంచి కశ్మీర్ వరకు గుజరాత్ నుంచి అరుణాచల్ వరకూ దేశమంతటా ఇదే కథ నడుస్తోంది. ఇదే వ్యథ కనబడుతోంది. ఖాళీ కుండలు, మండే గుండెలు మరుభూమిగా మారిన ఒకప్పటి హరిత ప్రాంతాలు ...ఇది తక్షణ సమస్య, పరిష్కారానికి నోచని దీర్ఘకాల సమస్య కూడ! మహారాష్టల్రో మంచినీటి సమస్య మహా విషాదంగా మారింది.

Pages