S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

03/08/2016 - 05:05

జనగణమన గీతం ఏదో ఒక చలనచిత్ర గీతమని తమిళనాడులోని ప్రభుత్వేతర విద్యాలయాలలోని బాల బాలికలు భావిస్తున్నారట! జనగణమన గీతం జాతీయ గీతం అన్న వాస్తవాన్ని మదరాసు ఉన్నత న్యాయస్థానం ఇప్పుడు గుర్తు చేయవలసి వచ్చింది! ఒకప్పుడు పాఠశాలల్లో మాత్రమే కాదు సార్వజనిక స్థలాలలో సమావేశాలలో జాతీయ గీతం ప్రతిరోజు వినబడేది.

03/07/2016 - 04:34

నాలుగు రాష్ట్రాల్లోను, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోను త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలు సుదీర్ఘమైన మరో ప్రజాస్వామ్య ప్రక్రియ.

03/04/2016 - 23:26

రెండు తెలుగు రాష్ట్రాల సభాపర్వాలు ప్రారంభంకాబోతున్నాయి. అంతా ఉత్కంఠ. సుమారు ఐదురోజుల తేడాతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం కానుండగా, 10న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.

03/04/2016 - 23:23

ఛత్తీస్‌గఢ్‌లో పదహారు మంది గ్రామీణులను మావోయిస్టులు బుధవారం నాడు హత్య చేయడం భద్రతా వైఫల్యానికి ఘోరమైన సాక్ష్యం. తెలంగాణ, ఛత్తీగఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో అనేక రోజులుగా ఉమ్మడి గాలింపులు జరుపుతున్న ఉభయ రాష్ట్రాల పోలీసులు ఈ దారుణాన్ని ముందుగా పసికట్టలేకపోవడం మారణ కాండకు దారితీసిన విపరిణామం.

03/04/2016 - 06:21

కరుడు కట్టిన జిహాదీ బీభత్సకారిణి ఇస్రాత్ జహాను నిర్దోషిగా నిరూపించడానకి మాజీ దేశ వ్యవహారాల మంత్రి పళనియప్పన్ చిదంబరం కుట్ర చేయడం జాతీయ వైపరీత్యం. నేరస్థులు పాలకులుగా నిర్దోషులుగా ఏళ్ల తరబడి ‘చెలామణి కావడం’ వాస్తవానికి జరిగిన ఘోరమైన వక్రీకరణ. ఈ వక్రీకరణకు సూత్రధారి చిదంబరమన్నది ఇప్పుడు బయటపడిన నిజం! చిదంబరం జరిపిన దుశ్చర్యలో వివిధ నేరాలు ఇమిడి ఉన్నాయి.

03/03/2016 - 05:40

తమిళనాడు శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికలు భారతీయ జనతాపార్టీ ప్రాబల్య ప్రభావాల పటిమను నిగ్గు తేల్చనున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో లభించిన పరిమిత విజయం భాజపా శ్రేణులలో విశ్వాసాన్ని పెంచాయి. కానీ తమిళనాడు పార్టీ ప్రాధాన్యం మాత్రం పెరగలేదు. పెరగలేదనడానికి అన్నాడిఎమ్‌కె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత భాజపాను దూరంగా వుంచడం ఒక ఉదాహరణ మాత్రమే!

03/02/2016 - 04:46

మనదేశంతో తమ దేశపు మైత్రీ బంధం పునఃపటిష్టమైనట్టు నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ ప్రకటించడం ఉభయ దేశాల ప్రజలకు హర్షం కలిగిస్తున్న పరిణామం. గత అక్టోబర్ 11వ తేదీన ఖడ్గ ప్రసాద్ శర్మ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే నాటికి నేపాల్‌తో మన స్నేహసంబంధాలు కొడిగట్టిపోయాయి.

03/01/2016 - 06:19

వ్యవసాయ భూమికపై సర్వ సమగ్ర ఆర్థిక వికాసం నూతన వార్షిక ఆదాయ వ్యయ ప్రణాళిక-బడ్జెట్-ఇతివృత్తం! 2016-2017వ ఆర్థిక సంవత్సరానికి రూపొందిన బడ్జెట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనసులోని మాటకు ప్రతిబింబంగా ప్రస్ఫుటించింది. ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన కర్షక సమ్మేళనంలో నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం, 29వ తేదీన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్‌లో ప్రతిధ్వనించింది!

02/29/2016 - 07:01

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ. అందుకు కారణం అంతర్జాతీయంగా దానికి ఉన్న అర్థబలం, అంగబలం, సాయుధ సంపత్తి. అన్ని విధాలా అగ్రపథాన నిలిచిన అగ్రరాజ్య అధ్యక్ష పీఠం నిరుపమానం. దీన్ని అధిరోహించే వ్యక్తికి తిరుగులేని అధికారం ఉంటుంది. మొత్తం ప్రపంచాన్ని అన్ని విధాలుగా ఆకట్టుకునే మార్గాలూ అందుబాటులో ఉంటాయి. ఇలాంటి సమున్నత పదవికి ఎన్నిక జరగడం అంటే మామూలు మాట కాదు.

02/26/2016 - 23:37

దేశంలో ఎన్నికల జాతరకు ఎప్పుడూ కొదవుండదు. జాతీయ ఎన్నికలు పూర్తయితే అసెంబ్లీ ఎన్నికలు అవీ ముగిస్తే..స్థానిక ఎన్నికలు..మళ్లీ చక్రం తిరుగుతుంది. ఎన్నికల్లో జయాపజయాలు సహజమేననుకునే వారికి నిరంతరం సువర్ణావకాశం అందివస్తూనే ఉంటుంది.

Pages