S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
హైదరాబాద్ సంస్థానం క్రీస్తుశకం 1948లో నిజాం బీభత్స పాలన నుంచి విముక్తం అయిందన్న వాస్తవానికి ఇది సరికొత్త ధ్రువీకరణం. 1947 నాటికి విలీనమైన ఇతర సంస్థానాల వలె ‘హైదరాబాద్’ కూడ 1948లో భారత్‌లో విలీనమైందన్న అబద్ధపు ప్రచారం చేస్తున్నవారికి బుధవారం వెలువడిన తీర్పు తీవ్రమైన అభిశంసన! లండన్‌లోని బ్రిటన్ ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.
ప్లాస్టిక్ పదార్థాలను వాడడం పూర్తిగా మానివేయడం మహాత్ముడైన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీకి దేశ ప్రజలు ఘటించగల నిజమైన నివాళి.
దంతాల కోసం ఏనుగులను, చర్మాలు- గోళ్ల కోసం పులులను, మాంసం కోసం ఇతర వన్యప్రాణులను వేటాడి వధించడం మన దేశంలో వింతేమీ కాదు. ఈ ‘వేట’ నిరంతరం అడ్డూ అదుపులేకుండా సాగిపోతుండడంతో అడవి జంతువుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. వన్యప్రాణుల పరిరక్షణ చట్టాలు పకడ్బందీగా అమలు జరగపోవడంతో కొన్ని జాతుల జంతువుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండగా, మరికొన్ని జంతువులు అంతరించే ప్రమాదం దాపురించింది.
టర్కీ ప్రభుత్వ ప్రతినిధులతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరుపలేదు. ‘ఇస్లాం సహకార సమాఖ్య’- ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్-ఓఐసి- దేశాల ప్రతినిధులు మన అంతర్గత వ్యవహారాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మన ప్రధాని చర్యకు నేపథ్యం. ఇస్లామిక్ సమాఖ్య ప్రతినిధులు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన న్యూయార్క్‌లో ఈ ‘వ్యతిరేక విధానాన్ని’ మరోసారి ఆవిష్కరించారు.
జాతీయ భావనిష్ఠ ప్రగతికి ఏకైక మాధ్యమమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మన ప్రధాని నరేంద్ర మోదీ జరుపుతున్న అమెరికా యాత్ర సందర్భంగా పునరావిష్కృతమైన మహా విషయం.
రోహింగియా తెగకు చెందిన బర్మీయ పౌరులు మన దేశంలో అక్రమంగా తిష్ఠవేసి ఉండడం గురించి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు ధ్యాస సన్నగిల్లిపోతోంది. ఏయే ప్రాంతాలలో ఎనె్నన్ని వేలమంది ‘రోహింగియాలు’ తిష్ఠవేసి ఉన్నారన్న విషయమై గణాంకాలు కూడ సరిగాలేవు. డెబ్బయివేలకు పైగా ‘రోహింగియా’ చొఱబాటుదారులు దేశంలోని వివిధ ప్రాంతాలలో ‘‘శరణార్థులు’’గాను, ఏ ‘హోదా’లేని వారుగాను ఏళ్లతరబడి నివసిస్తూనే ఉన్నారు.
నీ నడిచెడి దారులందు
గరికె పూలు పూస్తున్నవి,
నీ ఇంటికి వెనుక, ముందు
ఊట చెఱువులుంటున్నవి,
చెఱువులందు పరిమళాల
సుమ సరములు వెలసినవి
పరిశుభ్రత సభలు తీరి
పరిసరాలు మురిసినవి..
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన హూస్టన్ నగరంలో ఆదివారం భారతీయ సంతతి సమావేశంలో మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించడం మరో చారిత్రక శుభ పరిణామం! పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండ తీవ్రతను ప్రపంచ దేశాల దృష్టికి తేవడం ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం.
‘లింగమూర్తీ! ఇంకెన్నిసార్లు చెంపలేసుకుంటావు..?’ అని సోమయాజులు అన్నాడట!.. అన్నది గ్రామీణ ప్రాంతంలో అప్పుడప్పుడు వినబడే లోకోక్తి. చేయని పొరబాటుకు అనవసరంగా వివరణ ఇచ్చుకునే వారికి వర్తించే సామెత ఇది. దేశ వ్యవహారాల మంత్రి అమిత్ షాకు ఇప్పుడీ చతురోక్తి అన్వయం అవుతుండడం విచిత్రమైన వ్యవహారం. ‘హిందీ భాషను ఎవ్వరి నెత్తిన కూడ రుద్దబోవడం లేదు..’ అని అమిత్‌షా పదే పదే హామీ ఇస్తున్నారు.
ఎలక్ట్రానిక్ సిగరెట్లుగా పేరుమోసిన ‘ఆవిరి’ సిగరెట్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ఆరోగ్య పరిరక్షణకు దోహదకరం. ‘కల్తీ’ని నిర్మూలించనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు బుధవారం శాసనసభలో ప్రతిజ్ఞచేయడం ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేయగల సమాంతర పరిణామం. కొంటున్న తింటున్న ప్రతి పదార్థం విష రసాయనాలతోను, నాసిరకం పదార్థాలతోను సంకరం అయిపోతుండడం జనం అనుభవిస్తున్న నిరంతర వైపరీత్యం.