S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
అమీర్‌ఖాన్ అనే ఆయన ఎమ్‌ఎఫ్ హుస్సేన్‌ను తలపిస్తున్నాడు! మన దేశంలో మత పరమైన అసహిష్ణుత పెరిగిపోయిందని ప్రకటించడం ద్వారా అమీర్‌ఖాన్ నిజానికి మరో ఎమ్‌ఎఫ్ హుస్సేన్‌లాగా ప్రవర్తిస్తున్నాడు...్భరత మాతను నగ్నంగా చిత్రీకరించడంలో కాదు, భరత భూమిని అప్రతిష్టపాలు చేయడానికై నిర్లజ్జగా అభినయించడంలో మాత్రమే!
పాకిస్తాన్ జట్టుతో క్రికెట్ ఆడడానికై శ్రీలంక వెళ్లాలా, ‘చిలీ’కి వెళ్లాలా ఆన్నది ప్రశ్న కాదు. పాకిస్తాన్‌తో మనం ఎందుకు ఆడాలి? ఇదీ దేశప్రజలు అడుగుతున్న ప్రశ్న. పాకిస్తాన్ జట్టుతో మన జట్టు క్రికెట్ ఆట ఆడడానికి వీలుగా భారత క్రికెట్ నియంత్రణా మండలి నడుపుతున్న ప్రహసనం దేశ ప్రజల మనోభావాలను గాయపరుస్తోంది. ఉగ్రవాద బాధితుల గాయాలను మళ్లీ కెలుగుతోంది.
‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ’ వారు బొంబాయి హైకోర్టు వారి తీర్పును సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేయడం విచిత్రమైన పరిణామం. ఇలా సవాలు చేయడంవల్ల స్విట్జర్లాండ్‌నకు చెందిన నెజల్-నెస్లే- సంస్థవారి వాణిజ్య ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగదు! కలుగకుండా ‘భారత ఆహార భద్రతా సంస్థ’-ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ-వారు మిక్కిలి జాగ్రత్త వహించినట్టు ఈ ప్రభుత్వ సంస్థ వారే స్పష్టం చేస్తున్నారు.
తాత్కాలిక ఉద్రిక్తతల మధ్య నిహితమై ఉన్న చారిత్రక స్నేహ బంధాలకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేసియాలో జరిపిన పర్యటన మరో ప్రతీక! మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో శనివారం జరిగిన ‘్భరత-ఆగ్నేయాసియా దేశాల కూటమి’ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణ చైనా సముద్ర జలాలు కల్లోల గ్రస్తం అవుతుండడం నేపథ్యం. ఆదివారం మలేసియా రాజధానిలో పాల్గొన్న మైత్రీ సభలకు ఆ దేశంలో అప్పుడప్పుడు నిక్కి చూస్తున్న భారత వ్యతిరేకత నేపథ్యం!
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయస్టుల కలాపాలు మొదలు కావడం ప్రతీక మాత్రమే. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పోలీసులు పరస్పరం తలపడడం మరో ప్రతీక. ఆరుగురు రాజకీయ నాయకులను అపహరించుకొనిపోయిన మావోయిస్టులు తమ కోరికలు నెరవేర్చేవరకు వారిని విడుదల చేయబోమని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో అపహరణకు గురి అయిన ఈ నాయకులు అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారు కావడం యాదృచ్ఛికం కావచ్చు.
అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య
సౌభాగ్యముల్-అన్న కవివాక్కులు మాజీ
ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలో ఇలా
ధ్రువపడింది. పదేళ్లపాటు ప్రధానమంత్రిత్వం
వహించిన అంతర్జాతీయ స్థాయి అర్థికవేత్త
అపరాధం చేసినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు
లభించడం మన ప్రజాస్వామ్య చరిత్రలో మరో
విపరిణామం. బొగ్గు బొరియల-కోల్‌బ్లాక్స్-ను