S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

09/19/2019 - 02:39

నమ్రితా చాందినీ అన్న వైద్య విద్యార్థిని మృతదేహం లభించడం పాకిస్తాన్‌లో హిందువులపై జరుగుతున్న బీభత్సకాండలో భాగం. సింధు ప్రాంతంలోని ‘ఘోటకీ’ జిల్లాకు చెందిన ఈ బాలిక ‘లార్కానా’లోని ‘అసిఫా’ దంత వైద్యకళాశాల విద్యార్థిని. మంగళవారం హాస్టల్ గదిలో ఆమె మృతదేహం లభించిందట! పాకిస్తాన్‌లో మత, భాషాపరమైన ‘అల్పసంఖ్య’ ప్రజలపై భయంకర అత్యాచారాలు కొనసాగుతుండడం 1947లో పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి నడుస్తున్న కథ.

09/18/2019 - 02:06

నల్లమల అటవీ ప్రాంతంలో ‘యురేనియం’ ఖనిజం ‘తవ్వకాలకు’ వ్యతిరేకంగా స్థానికులు ప్రధానంగా ‘చెంచులు’ ఉద్యమిస్తుండడం ‘వాణి జ్య ప్రపంచీకరణ’ వ్యవస్థ పట్ల కొనసాగుతున్న నిరసనకు నిదర్శనం. ‘వాణిజ్య ప్రపంచీకరణ’ ఆకుపచ్చతనాన్ని, హరిత వనాలను వనవాసీ ప్రజల బతుకులను హత్యచేయడానికి దాపురించిన ‘రాక్షసి గొడ్డలి’..

09/17/2019 - 02:26

విదేశీయ భాషలు మన మాతృభాషలను దిగమింగి వేయకుండా నిరోధించడానికి వీలుగా ఒక ‘జాతీయ అనుసంధాన భాష’ను రూపొందించుకోవాలని దేశ వ్యవహారాల మంత్రి అమిత్ షా హితవు చెప్పడం విచిత్రమైన పరిణామం. ఆంగ్లం మొత్తం భారతీయ భాషల స్వరూపాన్ని ఇదివరకే దిగమింగి ఉంది, జాతీయ స్వభావాన్ని దశాబ్దుల క్రితమే చెఱచివేసింది. ఇది మొదటి వైపరీత్యం.

09/13/2019 - 22:13

మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న ఒక ‘గ్రహం’లో నీటి నిక్షేపాలు నెలకొని ఉన్నట్టు ఐరోపా అమెరికా అంతరిక్ష పరిశోధక శాస్తవ్రేత్తలు గురువారం ధ్రువీకరించడం సరికొత్త ఆవిష్కరణ. మన భూమిని పోలిన ఈ ‘మహాభూమి’- సూపర్ ఎర్త్- మన భూగోళానికి నూట పదకొండు కాంతి సంవత్సరాల దూరంలో నెలకొని ఉందట!

09/13/2019 - 03:50

గోవంశ పరిరక్షణకు సమగ్రమైన బిల్లును రూపొందించి, పార్లమెంటుకు సమర్పించి చట్టం చేసినట్టయితే ప్రజలు సంతోషిస్తారు, ప్రకృతి సంతోషిస్తుంది, వ్యవసాయ భూమి పరిపుష్టం అవుతుంది. ఆవులను దూడలను కోడెలను పెయ్యలను ఎద్దులను పెంచడం వల్ల వ్యవసాయానికి కావలసిన సహజమైన ఎఱువులు లభిస్తాయి. ఫలితంగా వ్యవసాయ భూమి నిరంతరం పరిపుష్టం అవుతుంది. వ్యవసాయం విష రసాయనాల ఎఱువుల నుంచి, కాలుష్యం నుంచి విముక్తం అవుతుంది.

09/12/2019 - 04:28

నేపాల్‌లో ఇంధన తైలం ధరలు లీటరుకు రెండు రూపాయలు చొప్పున తగ్గిపోవడం మంగళవారం నాటి పరిణామం. భారత నేపాల్ దేశాల మధ్య ఇంధనం సరఫరా చేసే ‘గొట్టపు మార్గం’- పైప్‌లైన్- పనిచేయడం ఆరంభం కావడం ఇందుకు కారణం. మన బిహార్‌లోని మోతీహారీ నుంచి నేపాల్‌లోని నారాయణీ ప్రాంతంలోని ‘అమ్‌లేఖ్ గంజ్’వరకు ఏర్పడిన ఈ గొట్టపు మార్గం ఉభయ దేశాల మధ్య సరికొత్త స్నేహ వారధి.

09/11/2019 - 01:42

జమ్మూ కశ్మీర్‌లో విధించిన ‘నియంత్రణల’ను సడలించాలని ఐక్యరాజ్యసమితి ‘మానవ అధికార మండలి’- హ్యూమన్ రైట్స్ కౌన్సిల్- వారు పిలుపునివ్వడం విచిత్రమైన వ్యవహారం. మన దేశంలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న రాజ్యాంగ బద్ధమైన సార్వభౌమ అధికార అనుగుణమైన ప్రజాహితకరమైన కార్యక్రమాలకు ఐక్యరాజ్యసమితి ‘మండలి’ వారు ‘బాధతో’ స్పందించడం హద్దులను అతిక్రమించిన అభినయం.

09/10/2019 - 02:09

తెలుగు భాషా ప్రాంతీయ అధ్యయన కేంద్రం కర్నాటకలోని మైసూరు నుంచి తెలుగు నేలకు తరలిరావడం హర్షణీయ పరిణామం. మహాకవి తిక్కన క్రీస్తుశకం పదమూడవ శతాబ్దిలో వేదవ్యాసుని సంస్కృత మహాభారతంలోని పదహైదు పర్వాలను తెలుగులో వ్రాశాడు. ‘విక్రమ సింహపురి’గా వినుతికెక్కిన నెల్లూరు మహాకవి తిక్కన సోమయాజి జీవించిన ప్రాంతం.

09/06/2019 - 21:47

మన ఫ్రభుత్వం 2015లో ఆరంభించిన ‘ప్రాచ్యదిశా కార్యాచరణ’- యాక్ట్ ఈస్ట్- ‘దూర ప్రాచ్య దిశా కార్యాచరణ’- యాక్ట్ఫ్‌ర్ ఈస్ట్-గా పరిణతి చెందడం ప్రధాని నరేంద్ర మోదీ బుధ, గురువారాలలో జరిపిన రష్యా పర్యటనలో ప్రస్ఫుటించిన ప్రధాన ఇతివృత్తం.

09/06/2019 - 00:18

అంగడి తిండిని అదే పనిగా తినడంవల్ల చిత్ర విచిత్ర వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందన్నది ధ్రువపడిన వాస్తవం. చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌లు, చిప్పులు, సుగర్ కాండీలు, హోమ్ బర్గర్‌లు, పింజల్‌లు, సాస్‌లు, విష రసాయన పరిమళాల- ఆర్ట్ఫిసియల్ ఫ్లేవర్‌లు- శీతల పానీయాలు, వంటలు మెరిసిపోయేందుకు వాడుతున్న రంగులు వంటివి ‘అంగడి తిండి’-జంక్‌ఫుడ్-లో కొన్ని మాత్రమే!

Pages