S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

02/11/2020 - 01:19

బట్టమేక పిట్ట- ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్-ను పరిరక్షించడం వచ్చేవారం గుజరాత్‌లో జరుగనున్న అంతర్జాతీయ వన్యప్రాణి సదస్సునకు నేపథ్య భూమిక కావడం హర్షణీయం... వ్యవసాయ, సస్య పరిరక్షక ప్రవృత్తికి ఈ ‘బట్టమేక పక్షి’ ప్రతీక!

02/08/2020 - 22:42

అస్సాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జరిపిన పర్యటన ‘శాంతి పథప్రస్థానం’లో మరో చారిత్రక ఘట్టం. ప్రధానమంత్రి ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించడం సహజం. అందువల్ల ఈ పర్యటనల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. కానీ అస్సాంలోని కోక్రఝాడ్‌లో ఐదు లక్షల ‘బోడో’ వన వాసీ ప్రజలు పాల్గొన్న సభలో శుక్రవారం నరేంద్ర మోదీ ప్రసంగించడం సముజ్వల ఘట్టం...

02/07/2020 - 06:19

‘‘ఎప్పటి రాముడు సీతమ,
ఎప్పటి లక్ష్మణుడు ఎన్ని ఏళ్లు గతించెన్?!
ఇప్పటికి కరకు మాయల!
అప్పటి వాల్మీకి రచనల జరామరమై..’’

02/06/2020 - 01:25

దేశ చరిత్రలో ఓ ప్రభుత్వం చేపట్టిన చట్టానికి వ్యతిరేకంగా నెలల తరబడి నిరసన జ్వాలలు రగిలిన ఉదంతాలు ఇటీవల కాలంలో ఎన్నడూ లేనిదే! జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్‌ఆర్‌సి)ని అస్సాంలో ప్రవేశ పెట్టినప్పుడు మొదలైన నిరసనలు అనంతరం మోదీ సర్కార్ ఆమోదించిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టంతో మరింత ముదురుపాకాన పడ్డాయి.

02/05/2020 - 05:37

ఆర్థిక స్వాతంత్య్రాన్ని మళ్లీ సాధించుకున్నట్టు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించడం ఐరోపా జాతుల ‘పరస్పర విరోధ చరిత్ర’లో సరికొత్త అధ్యాయం. ఐరోపా సమాఖ్య- యూరోపియన్ యూనియన్- ఇయు-నుంచి ‘బ్రిటన్ నిష్క్రమణ’- బ్రిటన్స్ ఎగ్జిట్- బ్రెగ్జిట్- ప్రక్రియ పూర్తయిన సందర్భంగా బోరిస్ జాన్సన్ ఇలా ‘ఆర్థిక స్వాతంత్య్ర పునరుద్ధరణ’ గురించి వాక్రుచ్చాడు.

02/04/2020 - 01:48

మన సరిహద్దుల పరిరక్షణకు తగినన్ని నిధులు కేటాయించక పోవడం దశాబ్దుల వైపరీత్యం. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఆరంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో కూడ ఈ వైపరీత్యం కొనసాగనుంది. చైనా దురాక్రమణ వ్యూహం మన ఉత్తర- ఉపరితల- సరిహద్దులలో మాత్రమేకాక, మూడువైపుల విస్తరించి ఉన్న సముద్ర జలాలలో కూడ ఉచ్చులను బిగిస్తుండడం ఈ వైపరీత్యాన్ని మరింత ప్రస్ఫుటంచేస్తున్న విపరిణామం!

02/02/2020 - 21:45

సౌరశక్తి ప్రాధాన్యం పెరుగుతుండడం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన ‘ఆర్థిక సర్వేక్షణ’- ఎకనామిక్ సర్వే-కు అంతర్గత నేపథ్యం! ప్రభుత్వం సాధించ తలపెట్టిన ‘మూడు కోట్ల యాబయి లక్షల కోట్లు’ రూపాయల- ఐదు ట్రిలియన్ అమెరికా డాలర్ల- ఆర్థిక వ్యవస్థ ఎప్పటికి సాకారం అవుతుందన్న ప్రశ్నకు సమాధానం ప్రపంచీకరణ కబంధ బంధంనుంచి మనం బయటపడడం!

01/31/2020 - 06:23

‘కరోనా వైరస్’ మరో విచిత్రమైన వ్యాధి. చైనాలో బయటపడిన ఈ భయంకర ‘రోగ ధాతువు’- వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను హడలెత్తిస్తుండడం నడుస్తున్న వ్యథ! చిత్ర విచిత్రమైన వ్యాధులు ప్రపంచ జనజీవనాన్ని ఆవహించి అతలకుతలం చేస్తుండడం దాదాపు నాలుగు దశాబ్దులుగా ఆగని వ్యథ.

01/30/2020 - 01:57

పాకిస్తాన్‌లో హిందువులకు వ్యతిరేకంగా జరిగిపోతున్న ప్రభుత్వ బీభత్సకాండ ఆగడం లేదన్న కఠోర వాస్తవానికి ఇది మరో నిదర్శనం. సింధు ప్రాంతంలోని ‘హాలా’ పట్టణంలో పెళ్లిపీటల మీద కూర్చుని ఉండిన ‘్భరతీబాయి’ అన్న హిందూ వధువును జిహాదీ దుండగులు అపహరించుకొనిపోయారు! ఇరవై నాలుగేళ్ల ఈ యువతిని ఆదివారం బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి ఓ ‘జిహాదీ’ హంతకునితో ఆమెకు బలవంతపు పెళ్లి చేశారు.

01/29/2020 - 02:34

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ను ప్రభుత్వేతరులకు అమ్మివేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం మిక్కిలి దురదృష్టకరం. నష్టాలతో నడుస్తున్న కారణంగా ప్రభుత్వం అమ్మివేస్తున్న వివిధ ప్రభుత్వరంగ సంస్థలలో ‘ఎయిర్ ఇండియా’ ఒకటి మాత్రమే! ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- మొదలయిన తరువాత ఇరవై ఆరు ఏళ్లలో ‘ప్రభుత్వరంగ’ వాణిజ్య పారిశ్రామిక సంస్థలు భారీ నష్టాలతో నడుస్తుండడం కొత్త విషయం కాదు!

Pages