S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

05/16/2019 - 02:01

మిత్రదేశాల పట్ల ఆధిపత్య ధోరణి దశాబ్దుల తరబడి అమెరికా విదేశాంగ విధానంలో నిహితమై ఉన్న దౌత్య దౌర్జన్యం. ఈ ‘‘దౌర్జన్యాన్ని’’ మన ప్రభుత్వం రెండు దశాబ్దులకు పైగా సహించవలసి వస్తోంది. ఇరాన్ దేశం నుంచి మన దేశం ఇంధన తైలాన్ని, ఇంధన వాయువులను కొనరాదన్నది మన ప్రభుత్వాన్ని నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం అమలు జరుపుతున్న వ్యూహంలో వర్తమాన ఘట్టం...

05/15/2019 - 01:51

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పాటు చేయదలచిన ‘సమాఖ్య కూటమి’ ప్రభుత్వం ‘మరీచికలో మధుర జలం’ వంటిది కాదు. ఎందుకంటె మరీచిక- ఎండమావి-లో మధుర జలాన్ని- తీయని నీటిని- అనే్వషించే వారికి ‘నీరు కన్పించడం’ సహజం. అది చివరికి భ్రాంతిగా మిగిలిపోతుంది. అయినప్పటికీ వెదకుతున్నంత సేపుఎండమావిలో ‘లేని నీరు’ ఉన్నట్టుగానే వెదికేవారిని ఊరించడం సహజం.

05/14/2019 - 01:51

ఆధిపత్యం కోసం కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం లేదా పరోక్ష యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా మారుతుండడం అంతర్జాతీయ వర్తమాన వైపరీత్యం. చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై అమెరికా ప్రభుత్వం భారీగా సుంకాలను పెంచడం ప్రచ్ఛన్న యుద్ధం- కోల్డ్‌వార్- ప్రత్యక్ష యుద్ధంగా మారుతుండడానికి నేపథ్యం.

05/11/2019 - 00:18

ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నప్పటికీ, తెలుగునేల నుంచి మాత్రమే గాక దేశంలోని అనేక ప్రాంతాల నుంచి సౌదీ అరేబియాకు, పారశీక సింధుశాఖ దేశాలకు ఉద్యోగార్థులు వెడుతుండడమే విస్మయకరం. కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలం మక్తాపల్లి గ్రామానికి చెందిన వీరయ్య అనే ‘ఒంటెల కాపరి’ విషాదగాథ సౌదీ అరేబియాలోని సంపన్న యజమానుల పైశాచిక ప్రవృత్తికి సరికొత్త ఉదాహరణ.

05/10/2019 - 01:22

‘ఎంత మంచి సినిమా అయినా వసూళ్లు ప్రధానంగా విడుదలైన తర్వాత నాలుగు రోజులే ఉంటాయి.. మరోపక్క పైరసీ వల్ల సినిమాలకు నష్టం జరుగుతోంది.. అలాంటప్పుడు పెద్ద సినిమాలు అనుకొన్న వసూళ్లు సాధించాలంటే టిక్కెట్ ధరలు పెంచక తప్పదు..’ అని ఓ ప్రముఖ సినీ నిర్మాత కొత్త భాష్యం చెప్పాడు.

05/09/2019 - 01:24

ఐదుమంది భారతీయ నావికులను ఆఫ్రికా ఖండపు నైజీరియా సముద్ర తీరంలో ఓడదొంగలు అపహరించుకొని పోవడం ఆశ్చర్యకరం కాదు. నైజీరియా తీరంలో గత కొనే్నళ్లుగా జిహాదీ బీభత్సకారులు, ఓడదొంగలు విశృంఖల విహారం చేస్తుండడం ఇందుకు కారణం. గత ఏడాది ఫిబ్రవరిలో ఇరవైమంది భారతీయ వాణిజ్య నావికులను ఓడదొంగలు అపహరించుకొని పోవడం ఈ ‘విశృంఖల జిహాదీ బీభత్స విస్తరణ’ ఫలితం.

05/08/2019 - 01:30

మానవుడు కల్పించుకున్న ‘ప్రగతి భ్రాంతి’- ఇల్యూషన్ ఆఫ్ డెవలప్‌మెంట్-కి పది లక్షల తరగతుల జీవరాసులు బలిఅయిపోతున్నాయన్నది పర్యావరణ శాస్తవ్రేత్తల అధ్యయన నివేదికలో జరిగిన నిర్ధారణ. ‘పారిస్’ పర్యావరణ పరిరక్షణ అంగీకారానికి అనుగుణంగా జరుగుతున్న వివిధ దేశాల సమన్వయ అధ్యయనంలో భాగంగా ఈ నివేదికను రూపొందించారు.

05/07/2019 - 01:17

దేశ విద్రోహపు చరిత్ర పునరావృత్తం అవుతుండడం ప్రచారం కాని మహా విషయం. క్రీస్తుశకం 1498లో మొదలై 1947 వరకు నడచిన చరిత్రకు ఇది పునరావృత్తి. వాస్కోడిగామా అనే పోర్చుగీసు బీభత్సకారుడు మన దేశంలో అడుగుపెట్టడం 1498 నాటి కథ. 1947లో బ్రిటన్ ముష్కరులు దేశం నుండి నిష్క్రమించేవరకు విదేశీయులు మన దేశాన్ని కుళ్లగించి వేయడం అప్పుడు నడచిన చరిత్ర.

05/03/2019 - 23:05

గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారి ‘వాణిజ్య అనుమతి’ రద్దుకాకపోవడం ఆర్థిక బీభత్సకాండను అరికట్టే నాథుడు దేశంలో లేడన్న వాస్తవానికి మరో ధ్రువీకరణ. ‘ఇంటర్ మీడియట్’ పరీక్షను తప్పినట్టు భ్రాంతి చెందిన అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తెలంగాణ అంతటా ఆవిష్కృతమైన విషాద దృశ్యం. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్‌లో గురువారం మరో విద్యార్థి ఈ ‘భ్రాంతి’కి బలైపోయాడు.

05/03/2019 - 01:28

తోడేలు ‘దూకడం’ మానుకోదు! ఒకచోట తోక ముడిచిన తోడేలు మరోచోట దూకుతుంది, వేరొకచోట నక్కుతుంది. అందువల్ల ‘ఐక్యరాజ్యసమితి’లో ‘తోక ముడిచిన’ చైనాకు మన దేశం పట్ల సుహృత్‌భావం వెల్లివిరిసినట్టు కాదు.

Pages